ఎబిఎస్ఎఫ్ జిల్లా అధ్యక్షులునాగుల పవన్ కళ్యాణ్
శాయంపేట నేటిధాత్రి:
శాయంపేట మండల కేంద్రములో జరిగిన ఎబిఎస్ఎఫ్ కార్యకర్తల సమావేశంలో ఎబిఎస్ఎఫ్ జిల్లా అధ్యక్షులు నాగుల పవన్ కళ్యాణ్ పాల్గొని మాట్లాడుతూ మండల కేంద్రములోని వితంతు మహిళలు పెన్షన్ కోసం దరఖాస్తు చేసుకొని సంవత్స రాలు గడుస్తున్న పెన్షన్ రాకపోవడం ప్రభుత్వలా నిర్లక్ష్యమే అని అన్నారు. ఇదివరకు బిఆర్ఎస్ ప్రభుత్వంలో ఇలానే జరిగి వితంతు మహిళలు అన్యాయం జరిగిందని అన్నారు. అలాగే కాంగ్రెస్ ప్రభుత్వంలో కూడా వితంతువులకు అన్యాయం జరుగుతుందన్నారు.కాంగ్రెస్ ప్రభుత్వ గెలచాక 4000 పెన్షన్ ఇస్తానాని హామీ ఇచ్చి మరిచిపోయారని అన్నారు. కొత్త పెన్షన్ దరఖాస్తుదారులకు వెంటనే పెన్షన్ వచ్చేలా ప్రభుత్వం చర్యలు తీస్కొని ఇచ్చిన హామీ ఇచ్చిన ప్రకారం 4000 పెన్షన్ ఇవ్వాలని డిమాండ్ చేసారు. లేని పక్షంలో రానున్న స్థానిక ఎన్నికల్లో ప్రజలే తగిన బుద్ది చెప్తారని అన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు సుమన్, రాజు, రమేష్, వినయ్ పాల్గొన్నారు.