Guest Faculty Jobs Announced in Narsampet
అతిథి అధ్యాపక పోస్టులకు దరఖాస్తుల ఆహ్వానం
ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ మల్లం నవీన్
నర్సంపేట,నేటిధాత్రి:
నర్సంపేట ప్రభుత్వ డిగ్రీ కళాశాల (అటానమస్)లో 2025–26 విద్యా సంవత్సరానికి గెస్ట్ ఫ్యాకల్టీ పోస్టులకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు కళాశాల ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ మల్లం నవీన్ తెలిపారు. మంగళవారం విడుదల చేసిన ఒక ప్రకటనలో ఆయన ఈ వివరాలను వెల్లడించారు.కళాశాలలో అర్ధశాస్త్ర విభాగంలో ఒక గెస్ట్ ఫ్యాకల్టీ పోస్టు, చరిత్ర విభాగంలో ఒక గెస్ట్ ఫ్యాకల్టీ పోస్టు ఖాళీగా ఉన్నట్లు తెలిపారు. సంబంధిత విభాగంలో పీజీ ఉత్తీర్ణతతో పాటు ఓసి, బీసీ అభ్యర్థులకు కనీసం 55 శాతం మార్కులు, ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు 50 శాతం మార్కులు ఉండాలని పేర్కొన్నారు.అదనంగా పీహెచ్డీ / నెట్ / సెట్ / స్లెట్ అర్హతలు మరియు బోధన అనుభవం కలిగిన అభ్యర్థులకు ఎంపికలో ప్రాధాన్యత ఇస్తామని తెలిపారు. అర్హత మరియు ఆసక్తి కలిగిన అభ్యర్థులు తమ బయోడేటా మరియు ధ్రువపత్రాలతో కలిసి 02-04-2026 సాయంత్రం 4:00 గంటలలోపు కళాశాలలో సమర్పించాలని ప్రిన్సిపాల్ సూచించారు.
