తెలుగు నేలపై చంద్రమహోదయం!

https://epaper.netidhatri.com/view/317/netidhathri-e-paper-12th-july-2024

నవ్యాంధ్ర సారథి…అమరావతి వారథి!

నా దేవుడు చంద్రబాబు, రేపటి తెలుగు వెలుగు లోకేష్‌ అంటున్న తెలుగు యువత రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అనిమిని రవి నాయుడు, నేటిధాత్రి ఎడిటర్‌ కట్టా రాఘవేంద్రరావు తో నవ్వాంధ్ర భవితపై చెప్పిన ఆసక్తికరమైన విషయాలు ఆయన మాటల్లోనే…

-తెలుగు నేల పులకరించేలా ప్రగతి.

-రాజకీయాలలో చంద్ర చాణక్యం.

-పరి పాలనలో గుప్తులను మించిన సంక్షేమం.

-తెలుగు నేలనేలిన శాతవాహన రాజ్యానికి చంద్రోదయం.

-అన్ని వర్గాల ఆశా కిరణం.

-తెలుగు జాతి భవిష్యత్తుకు చైతన్య రథం.

-ముప్పై ఏళ్ల క్రితమే జన్మభూమి అభివృద్ధి మొదలుపెట్టారు.

-హైదరాబాదును ప్రపంచానికి పరిచయం చేశారు.

-సైబరాబాద్‌ నిర్మాణం చేసి చంద్ర కాంతులు పంచారు.

-సాంకేతిక విద్యను తెలుగు యువతకు అందించారు.

-విదేశాలలో తెలుగు జాతి ప్రస్థానానికి పునాదులు వేశారు.

-సాఫ్ట్‌ వేర్‌ రంగాన్నే కొత్త పుంతలు తొక్కేలా చేశారు.

-అమరావతికి నిన్న శ్రీకారం చుట్టారు.

-ఇప్పుడు అమరావతికి మళ్ళీ ఊపిరి పోయనున్నారు.

-తెలుగు వారికి రాజధానికి నవ కాంతులు తెస్తున్నారు.

-ఐదేళ్ల క్రితమే కియా కార్‌ను పరుగులు పెట్టించారు.

-రెండేళ్లలో భవ్య రాజధాని అమరావతిని ప్రపంచ పటంలో పెట్టనున్నారు.

-పోల ‘వరం’ పూర్తి చేసి ఆంధ్రుల కల నెరవేర్చనున్నారు.

-పట్టిసీమకు పూర్వ వైభవాన్ని తెచ్చి సీమలో సిరిసంపదలు పెంచనున్నారు.

-రాయలసీమను రతనాల సీమ చేయనున్నారు.

-కోన సీమకు కొత్త శోభలు అద్దనున్నారు.

-పెట్టుబడుల వెల్లువ తెచ్చి పారిశ్రామిక దారులు వేయనున్నారు.

-యువతరం కలలకు రెక్కలు తొడగనున్నారు.

-ఐదేళ్లలో అమరావతిని అంతర్జాతీయ నగరాలకు దీటుగా నిలబెట్టనున్నారు.

-రాజనీతిలో తన పాలనతో రాయల సరసన నిలిచారు.

-తెలుగు నేలన చరిత్రలో ఆ చంద్ర తారాత్కం నిలిచిపోతారు.

హైదరాబాద్‌,నేటిధాత్రి:

తెలుగు దేశం పార్టీ అధినేత, ఏపి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆత్మ విశ్వాసం చాలా గొప్పది. ఆచరణ అంత కన్నా గొప్పది. పట్టుదలతో ఆయనను మించిన వారు లేదు. అనుకున్నది సాధించడంలో ఆయనకు సాటి మరొకరు లేరు. తెలుగు ప్రజల శ్రేయస్సు కన్నా మరేదీ ఆయనకు గొప్ప కాదు. తెలుగు ప్రజల జీవితాలలో వెలుగులు నింపడం కన్నా సంతృప్తి ఆయన మరొకటి లేదు. అందుకే ఆయనకు ఎన్ని సార్లు జాతీయ రాజకీయాలలో ఎన్నో అవకాశాలు వచ్చిన తెలుగు ప్రజల కోసం నిలబడ్డారు. తెలుగు నేల బాగు కోసం నిలబడ్డారు. తెలుగు గడ్డ ప్రగతి కోసం పాకులాడాడు. ఆ ప్రయాణంలో విజయాలు చూశాడు. అపజయాలు చూశారు. పొగడ్తలు చూశాడు. అవమానాలు భరించాడు. గెలిచినప్పుడు పొంగిపోలేదు. పడినప్పుడు కుంగిపోలేదు. ఓడి పోయిన ప్రతీ సారి రెట్టించిన ఉత్సాహంతో ముందుకు సాగారు. తెలుగు ప్రజలకు మేలుకొలుపు కాపుకాస్తూనే వున్నారు. తెలుగు నేలకు దిక్కెవరు అని చూడాల్సిన ప్రతి సందర్భంలో ప్రజలు చంద్రబాబును ఎంచుకుంటున్నారు. పడిలేచిన ప్రతిసారీ తెలుగు కీర్తిని నిలబెడుతున్నాడు. అదీ చంద్రబాబు అంటే…అదీ విజన్‌ వున్న నాయకుడి అంతరంగమంటే. తెలుగు జాతి ప్రగతి, నవ్యగతి, భవిత కోసం పుట్టిందే తెలుగు దేశం పార్టీ. తెలుగు నేలలో వెలుగు ప్రసరించాలన్నదే తెలుగు దేశం ఆలోచనా సరళి. పార్టీ పురుడుపోసున్న నాటి నుంచి తెలుగు ప్రజల శ్రేయస్సే కాంక్షగా అడుగులేస్తున్న ఏకైక పార్టీ. అలాంటి తెలుగు దేశం పార్టీ పగ్గాలు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేపట్టిన నుండి అటు రాజకీయాలు, ఇటు ప్రజల జీవన విధానాలలో వినూత్నమైన మార్పులు వచ్చాయి. ప్రభుత్వాల ఆలోచనలు కూడా మారాయి. ప్రజల శ్రేయస్సు కోసం పని చేసే రోజులొచ్చాయి. ప్రజలు ప్రభుత్వంలో భాగస్వాములయ్యారు. శ్రమ దానం పేరుతో చంద్రబాబు నాయుడు తెలుగు నేలలో సరికొత్త చైతన్యాన్ని నింపారు. ప్రభుత్వం చేపట్టే ప్రతి పనిలో ప్రజల భాగస్వామ్యం చేశారు. అది అమరావతి నిర్మాణంలో కూడా కనిపించేలా చేశారు. ప్రపంచంలో ఎక్కడా ఒక నాయకుడిని నమ్మి ప్రజలు సుమారు 50 వేల ఎకరాలను అందించలేదు. అది ఒక్క చంద్రబాబు నాయుడు వల్లనే సాధ్యమైంది. ల్యాండ్‌ పూలింగ్‌ అనే దానిని ఆవిష్కరించారు. రాజధాని నిర్మాణంలో ప్రజలను నేరుగా భాగస్వామ్యం చేశారు. అంతటి గొప్ప ముందు చూపు వున్న నాయకుడు ఒక్కరే ఒక్కరు చంద్రబాబు నాయుడు. తెలుగు ప్రజలకు ఎలాంటి విపత్కర పరిస్థితులు వచ్చినా గుర్తొచ్చే ఏకైక నాయకుడు చంద్రబాబు. ఉమ్మడి రాష్ట్రంలో వున్నప్పుడు కరువు పరిస్థితులను పారద్రోలి రైతులకు అండగా నిలవడం కోసం ఆయన తెచ్చిన వినూత్నమైన పద్దతులతో రైతులకు కొత్త జీవితాలు ప్రసాదింపబడ్డాయి. నీటి లభ్యత లేక కరువులు వెంటాడే తెలంగాణ, రాయలసీమలలో తక్కువ నీటి వాడకంతో పంటల సాగుకు మార్గాలన్వేశించిన నాయకుడు చంద్రబాబు. ఇప్పుడు పోలవరం లాంటి బృహత్తర ప్రాజెక్టును పూర్తి చేసే బాధ్యతలు నిర్వర్తిస్తున్న నాయకుడు చంద్రబాబు. ఇలాంటి అవకాశాలు ఏ నాయకుడికి రాలేదు. అలాంటి గొప్ప ఆవిష్కరణలు చేసిన నాయకుడు మరొకరు లేరు. పట్టిసీమ లాంటి ప్రాజెక్టును కేవలం 11 నెలలో పూర్తి చేయడం అంటే మాటలు కాదు. అది ఒక్క చంద్రబాబు వల్లనే సాధ్యమైంది. అన్ని రంగాలలో తెలుగు నేల పులకరించేలా ప్రగతిని కళ్ల ముందు ఆవిష్కరించిన ఏకైక నాయకుడు చంద్రబాబు.

రాజకీయాలలో చంద్రబాబు నాయుడును మించిన రాజకీయ చాణక్య ఎవరిలోనూ కనిపించదు. ఎందుకంటే ప్రజలను భాగస్వాములను చేసే రాజకీయాలు గతంలో ఎవరూ చేయలేదు. ఇతరులకు ఎవరికీ సాధ్యం కాలేదు. 1999 ఎన్నికలలో ఎలాగైనా గెలవాలని ఆనాడు వైఎస్‌. రాజశేఖరరెడ్డి చేసిన ప్రయత్నాలు చంద్రబాబు నాయుడు చిత్తు చేశారు. కేవలం ఐదేళ్లలో అభివృద్ధి అంటే ఏమిటో చేసి చూపించారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ లో హైదరాబాదు రూపు రేఖలు మార్చారు. హైదరాబాదను సరికొత్త నగరంగా తీర్చిదిద్దారు. విశ్వనగరం చేశారు. ఒకప్పుడు హైదరాబాదులో ఫ్లై ఓవర్‌ అనేది కనిపించేది కాదు. చంద్రబాబు మొదటి సారి ముఖ్యమంత్రి అయిన వెంటనే ఏక కాలంలో 13 ఫ్లై ఓవర్ల నిర్మాణం చేపట్టిన అభివృద్ధి నమూనాను ఆవిష్కరించారు. సెక్రెటియేట్‌ వద్ద వున్న తెలుగు తల్లి ఫ్లై ఓవర్‌ మొదలు నగరానికి నగిషీలు చెక్కారు. హైదరాబాద్‌ ను పెట్టుబడుల స్వర్గదామమం చేశారు. సైబరాబాద్‌ నిర్మాణం చేసి, సరికొత్త నగరాన్ని ఆవిష్కరించారు. ఐటి రంగానికి హైదరాబాద్‌ తలమానికం చేశారు. ఐటి హబ్‌ గా హైదరాబాద్‌ ను తీర్చిదిద్దారు. ఉమ్మడి రాష్ట్రంలో సాంకేతిక విద్యా విప్లవాన్ని తెచ్చారు. పరిపాలన అంటే ఆశామాషీ వ్యవహరం కాదు. ప్రజల మీద ప్రేమ వుండాలి. ప్రజలను చల్లగా చూడాలన్న గుణముండాలి. ప్రజలకు మేలు చేయాలన్న తపన వుండాలి. అభివృద్ధి మీద శ్రద్ధ వుండాలి. సమస్యలను ఆకలింపు చేసుకునే శక్తి వుండాలి. సమస్యల పరిష్కారానికి అవసరమైన నేర్పరితనం వుండాలి. ప్రజలకు సంక్షేమ ఫలాలు అందించాలన్న చిత్తశుద్ధి వుండాలి. అవన్నీ చంద్రబాబులో నిండుగా వున్నాయి. అందుకే పరి పాలనలో గుప్తులను మించిన సంక్షేమం అందించారన్న పేరు సార్థకం చేసుకున్బారు.

అమరావతి నిర్మాణాన్ని రాజధానిగా ఎంపిక చేసుకోవడంలో ఎంతో ముందు చూపు వుంది. రాజ్యాలెప్పుడు సుసంపన్నమైన, పుష్కలమైన నీటి వనరులు వున్న చోటనే వెలిశాయి. కాలగతిలో వారి చరిత్రను కూడా నిక్షిప్తం చేశాయి. తొలి తెలుగు రాజుల రాజధాని అమరావతి. తెలుగు నేలనేలిన శాతవాహన రాజ్యానికి మళ్ళీ చంద్రోదయం తెచ్చారు. రాజధానికి అమరావతిలో శ్రీకారం చుట్టారు. అటు కృష్ణా నది పరవళ్ళు, ఇటు పచ్చిని మాగాణాల మధ్య అమరావతి మరో వెయ్యేళ్లు వెలిగేలా రూపకల్పన జరుగుతోంది. నిజానికి గత ఎన్నికలలో కూడా చంద్రబాబు అధికారంలోకి వచ్చి వుంటే ఇప్పటికే అమరావతి మరో హైదరాబాదు అయ్యేది. ఇప్పటికీ మించిపోయింది లేదు. ఎందుకంటే చంద్రబాబు 2014 నుంచి 2019 వరకు బలమైన పునాదులు వేశారు. ఇప్పుడు రాకెట్‌ వేగంతో అభివృద్ధి పరుగులు పెట్టిస్తారు. చంద్రబాబు నాయుడు అన్ని వర్గాల ఆశా కిరణం. ఒకప్పుడు రాజకీయాలు వేరు. ఇప్పుడు రాజకీయాలు వేరు. తెలుగు దేశం పార్టీ ఆవిర్భావానికి ముందు ఆంద్రప్రదేశ్‌ పరిస్థితి వేరు. ఇప్పుడు వేరు. ఒక్క సంక్షేమమే కాదు రాజకీయంలో సామాజిక న్యాయం తెచ్చింది తెలుగుదేశం పార్టీ. బడుగు బలహీన వర్గాలకు ప్రభుత్వంలో భాగస్వామ్యమయ్యేలా సరికొత్తగా రాజకీయాలకు నిర్వచనం చెప్పింది తెలుగు దేశం పార్టీ. స్థానిక సంస్థల నుంచి, రాష్ట్ర స్థాయి పాలన, రాజకీయాలలో సామాజిక న్యాయానికి పెద్ద పీట వేసింది కూడా తెలుగు దేశం పార్టీయే. అంతే కాదు మహిళలకు రాజకీయాలలో, పదవులలో సమాన స్థాయిని, అవకాశాలను కల్పించారు. స్థానిక సంస్థల ఎన్నికలలో మహిళలకు చంద్రబాబు నాయుడు 50శాతం అవకాశాలు కల్పించారు. ఇలా చెప్పుకుంటూ పోతే మహిళా లోకానికి చంద్రబాబు చేసినంత మేలు దేశంలో ఏ నాయకుడు చేయలేదు.

ముప్పై ఏళ్ల క్రితమే జన్మభూమి కార్యక్రమంతో అభివృద్ధికి శ్రీకారం చుట్టారు. శ్రమ దానంతో ప్రజలను బాగస్వాములు చేసి సరికొత్త పాలన ప్రజలకు పరిచయం చేశారు. హైదరాబాదును ప్రపంచానికి పరిచయం చేశారు. సైబరాబాద్‌ నిర్మాణం చేసి చంద్ర కాంతులు పంచారు. సాంకేతిక విద్యను తెలుగు యువతకు అందించారు. విదేశాలలో తెలుగు జాతి ప్రస్థానానికి పునాదులు వేశారు. సాఫ్ట్‌ వేర్‌ రంగాన్నే కొత్త పుంతలు తొక్కేలా చేశారు. అమరావతికి నిన్న శ్రీకారం చుట్టారు. ఇప్పుడు అమరావతికి మళ్ళీ ఊపిరి పోయనున్నారు. తెలుగు వారికి రాజధానికి నవ కాంతులు తెస్తున్నారు. ఐదేళ్ల క్రితమే కియా కార్‌ను పరుగులు పెట్టించారు. రెండేళ్లలో భవ్య రాజధాని అమరావతిని ప్రపంచ పటంలో పెట్టనున్నారు. పోల ‘వరం’ పూర్తి చేసి ఆంధ్రుల కల నెరవేర్చనున్నారు. పట్టిసీమకు పూర్వ వైభవాన్ని తెచ్చి సీమలో సిరిసంపదలు పెంచనున్నారు. రాయలసీమను రతనాల సీమ చేయనున్నారు. కోన సీమకు కొత్త శోభలు అద్దనున్నారు. పెట్టుబడుల వెల్లువ తెచ్చి పారిశ్రామిక దారులు వేయనున్నారు. గతంలో చంద్రబాబు చేసిన అభివృద్ధిని తుడిచేయాలని గత పాపకులు చూశారు. కానీ ప్రజలు తగిన గుణపాఠం వారికి నేర్పి అభివృద్ధి కొనసాగింపు చంద్రబాబు తో మాత్రమే సాధ్యమని ప్రజలు బలంగా నమ్మారు. యువతరం కలలకు రెక్కలు తొడగనున్నారు. సరికొత్త అలోచనలతో స్కిల్‌ డెవలప్మెంట్‌ కార్యక్రమాలకు శ్రీకారం చుట్టనున్నారు. అసలు ఆంద్రప్రదేశ్‌ లో చదువుకొని నిరుద్యోగులగా వున్న యువతరం లెక్కల గణన చేపట్టి, వారి సాంకేతిక పరిజ్ఞానాన్ని బట్టి ఉద్యోగ కల్పనకు పూనుకోవడం అంటే సామాన్యమైన విషయం కాదు. యువతరం భవిష్యత్తుకు విప్లవాత్మకమైన మార్గం వేయడమే అవుతుంది. దేశంలోని అన్ని రాష్ట్రాల ఆదర్శంగా తీసుకొనే విధానమౌతుంది. ఐదేళ్లలో అమరావతిని అంతర్జాతీయ నగరాలకు దీటుగా నిలబెట్టనున్నారు. రాజనీతిలో తన పాలనతో రాయల సరసన నిలిచారు. తెలుగు నేలన చరిత్రలో నారా చంద్రబాబు నాయుడు ఆ చంద్ర తారాత్కం నిలిచిపోతారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *