AITUC Extends Full Support to RTC Workers Strike
ఆర్టీసీ కార్మికులు సమ్మెకు ఏఐటీయూసీ సంపూర్ణ మద్దతు
ప్రైవేట్ బస్సులను అడ్డుకున్న ఆర్టీసీ జేఏసీ ఏఐటియుసి నాయకులు
భూపాలపల్లి నేటిధాత్రి
ఆర్టీసీ కార్మికులు తమ డిమాండ్లను నెరవేర్చాలని చేస్తున్న సమ్మెకు ఏఐటీయూసీ జయశంకర్ భూపాలపల్లి జిల్లా సమితి సంపూర్ణ మద్దతు ప్రకటించింది ఈ సందర్భంగా ఏఐటీయూసి జిల్లా అధ్యక్ష కార్యదర్శులు మోటపలుకుల రమేష్, క్యాతరాజు సతీష్ మాట్లాడుతూ.. ప్రజా ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఆర్టీసీ కార్మికులకు ఇచ్చిన డిమాండ్లను నెరవేర్చాలని వారు చేస్తున్న సమ్మెకు ప్రభుత్వము స్పందించి వెంటనే వాళ్లను చర్చలకు పిలిచి ఎన్నికల్లో ఇచ్చిన హామీలను వారి డిమాండ్లను నెరవేర్చాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు లేనియెడల ఆర్టీసీ కార్మికులకుఏఐటీయూసీ సంపూర్ణ మద్దతు తెలియజేసి వారితోపాటు వారి సమ్మె విజయవంతము అయ్యే వరకు ప్రతి కార్యక్రమాల్లో ఏఐటీయూసీ జిల్లా నాయకత్వం వారి వెంట ఉంటుందన్నారు ఈ కార్యక్రమంలో ఏఐటిఈసి నాయకులు సుధాకర్ రెడ్డి వేముల శ్రీకాంత్ నేరెళ్ల జోసెఫ్ బాబురావు పొన్నగంటి లావణ్య తో పాటు ఏఐటీయూసీ నాయకులు పాల్గొన్నారు
