
స్వేరో స్టూడెంట్స్ యూనియన్ హన్మకొండ జిల్లా అధ్యక్షులు :ఎల్తూరి సాయికుమార్ స్వేరో
హన్మకొండ, నేటిధాత్రి:
స్వేరో స్టూడెంట్స్ యూనియన్ హనుమకొండ జిల్లా అధ్యక్షులు ఎల్తూరి సాయికుమార్ మాట్లాడుతూ వేసవికాలంలో హనుమకొండ నగరంలో ఎటువంటి పర్మిషన్స్ లేకుండా నడుపుతూ అకాడమీ పేరు మీద జూనియర్ కాలేజ్ నడిపిస్తూ ఎంసెట్ నీట్ జేఈఈ మెయిన్స్ అని పేద విద్యార్థుల దగ్గర డబ్బులు తీసుకుని ఇటు ప్రభుత్వాన్ని అటు పేరెంట్స్ ను మోసం చేస్తున్న అకాడమీ చైర్మన్ లు అదేవిధంగా తీవ్రంగా 48 డిగ్రీల ఎండలు కొడుతున్న ఎన్నిసార్లు చెప్పినా పట్టించుకోని అధికారులు ఎటువంటి చర్యలు తీసుకోకుండా మాకు ఎటువంటి సంబంధం లేదు అనే విధంగా వ్యవహరిస్తున్నటువంటి అధికారుల పైన కూడా చర్యలు తీసుకోవాలని ఈ సందర్భంగా డిమాండ్ చేయడం జరుగుతోంది చర్యలు తీసుకుని ఎడల తీవ్రమైనటువంటి ఉద్యమాలు చేపడతామని ఈ సందర్భంగా తెలియజేయడం జరుగుతోంది. ఈ కార్యక్రమంలో జీడి అభిషేక్, ఉదయ్, సాయి మరియు హరీష్ తదితరులు పాల్గొన్నారు.