Hospital Controversy in Bhupalpally
సాయి రత్నం ఆస్పత్రి యజమాన్యంపై చర్య తీసుకోవాలి
ఎస్సీ ఎస్టీ కమిషన్ మెంబర్ రామచంద్ర కు ఫిర్యాదు చేసిన బాధితులు
భూపాలపల్లి నేటిధాత్రి
ఆస్పత్రిలో వైద్యం కోసం తీసుకువెళ్లిన నాలుగు నెలల గర్భిణీ అయిన నా భార్యకు ఎలాంటి 2/అనుమతి లేకుండా గర్భస్రావం చేసిన సాయి రత్న మల్టీ స్పెషాల్టీ హాస్పిటల్ డాక్టర్ ప్రవళిక, హాస్పిటల్ ఎం.డి. ఆస్పత్రి సిబ్బందిపై చర్య తీసుకోవాలని
జర్పుల రాంబాబ ఎస్సీ ఎస్టీ కమిషన్ నెంబరు రామచంద్ర నాయకులు కోరడం జరిగింది
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ
(లంబాడ), నివాసం: క్వా-నెం. టి2-389, కృష్ణకాలనీ, భూపాలపల్లి. నా భార్య జర్పుల హాసిని రెండవసారి గర్భవతి కావడంతో భూపాలపల్లి పట్టణం గణేష్ చౌక్ నందలి సాయి రత్న మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ నందు నెల నుంచి డాక్టర్ ప్రవళిక వద్దనే వైద్యం చేయిస్తున్నాము. నాల్గవ నెల వచ్చిన నా భార్యకు రెండో నెల 9వ తారీకు అర్ధరాత్రి సమయంలో కడుపునొప్పితో బాధపడుతుండటంతో అర్ధరాత్రి 1 గంట సమయంలో హుటాహుటిన నేను, నా తల్లి కలిసి నా భార్యను సాయి రత్నం ఆస్పత్రికి తీసుకుని వెళ్లాము. ఆస్పత్రిలో డాక్టర్ లేకపోవడంతో అక్కడ విధుల్లో ఉన్న నర్స్ నా భార్యను వార్డులో అడ్మిట్ చేసుకుని డాక్టర్‌కు ఫోన్ చేయగా ఆమె సూచన మేరకు ఇంజక్షన్, మందులు ఇచ్చినారు కొద్దిసేపటికి నా భార్యకు ఉమ్మనీరు బయటకు వస్తుండటంతో నా తల్లి పలుమార్లు వెళ్లి నరుసుకు చెప్పినప్పటికీ ఆమె నా తల్లిపై విసుక్కుంటూ వైద్యం అందించకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించింది. డాక్టర్ కి ఫోన్ చేయమని ఎన్నిసార్లు చెప్పినా నర్స్ వినిపించుకోకుండా ఉమ్మనీరు అలాగే బయటకు వస్తుందని నిర్లక్ష్యంగా సమాధానం చెప్పింది. తెల్లవారుజామున 4 గంటల సమయంలో డాక్టర్ ప్రవళిక వచ్చి నా భార్యను పరీక్షించి ఉన్నఫళంగా స్కానింగ్ తీయించాలని చెప్పడంతో నా భార్యకు తోడుగా నా తల్లి వెళ్లింది. స్కానింగ్ తరువాత డాక్టర్ మా అమ్మను తన గదికి పిలిపించుకుని గర్భాశయంలో ఉమ్మనీరు లేదని, బిడ్డ బ్రతికే అవకాశం లేదని, వెంటనే అబార్షన్ చేయాలని చెప్పారు. ఉమ్మనీరు పోతుందని నేను ఎన్నిసార్లు నరుసుకు చెప్పినా పట్టించుకోలేదని, ఇప్పుడు అబార్షన్ చేయాలని చెప్తున్నారు ఏమిటని డాక్టర్ ను మా అమ్మ అడుగగా దురుసుగా ప్రవర్తించారు. నా భార్యకు మరళా స్కానింగ్ చేస్తామంటూ తీసుకుని వెళ్లి నా యొక్క, నా భార్య వద్ద నుంచి కాని ఎలాంటి అనుమతి తీసుకోకుండానే అబార్షన్ చేసి పిండాన్ని తీసుకువచ్చి మా చేతికి ఇచ్చారు. దీంతో మేము ఏం జరిగిందో అ చేసుకుని డాక్టర్ ప్రవళిక ని నిలదీయగా ఆమె మా పట్ల దురుసుగా ప్రవర్తిస్తూ మమ్ములను అకారణం దుర్భాషలాడుతూ అక్కడి నుంచి వెళ్లిపోయారు. కొద్దిసేపటికి హాస్పిటల్ ఎం.డి. మీతో మాట్లాడు అంటూ అక్కడి నర్స్ మాకు ఫోన్ ఇవ్వగా, ఆయన ఫోన్లో నన్ను, నా తల్లిని తీవ్ర దుర్భాషలాడు మాట్లాడారు. ఎలాంటి గోల చేయకుండా వెళ్లిపోకపోతే మీపై కేసులు పెడతామని, బెదిరించారు ఆస్పటల్ యజమాన్యంపై జిల్లా కలెక్టర్ జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి వెంటనే చర్యలు తీసుకొని మాకు న్యాయం చేయాలని మేము అధికారులను డిమాండ్ చేస్తున్నాం
