భూపాలపల్లి నేటిధాత్రి
భూపాలపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో వెంకటేశ్వర కాలనీలో ఫ్లాట్ ఇప్పిస్తానని డబ్బులు తీసుకున్న వ్యక్తి అల్లూరి కుమార్ తండ్రి సమ్మయ్య నివాసం చెల్పూర్ ప్రస్తుత నివాసం చంద్రాపూర్ కాలనీ అరుణోదయ హాస్పిటల్ ఎల్ బి నగర్ హైదరాబాద్ అను అతడు అయిత లీల వైఫ్ ఆఫ్ కుమారస్వామి నివాసం కొత్త వాడ వరంగల్ అను వారి వద్ద 25 లక్షలు తీసుకొని ఫ్లాట్ ఇవ్వకుండా మోసం చేసినాడు అని ఫిర్యాదు చేయగా అట్టి ఫిర్యాదు మేరకు అల్లూరి కుమారును అరెస్టు చేసి రిమాండ్ కు తరలించనైనది ఈ సందర్భంగా భూపాలపల్లి సీఐ డి నరేష్ కుమార్ మాట్లాడుతూ ఎవరైనా అమాయక ప్రజలను మోసం చేస్తూ ఫ్లాట్లు ఇప్పిస్తామని మరి ఇతర కారణాల వల్ల మోసం చేసిన చట్టప్రకారం తగు చర్య తీసుకోబడుతుందని తెలిపినారు