మొగుళ్ళపల్లి నేటి రాత్రి న్యూస్ జనవరి 30
జయశంకర్ భూపాలపల్లి జిల్లా మొగుళ్ళపల్లి మండలంలోని గుండ్లకర్తి గ్రామంలో ప్రజల దాహార్తినీ తీర్చడంకోసం జిల్లా పరిషత్ నిధులు , మండల ప్రజా పరిషత్ నిధులతో ఏర్పాటైన రెండు బోర్లను ఎస్సీ కాలనీ మరియు బిసి కాలనీలో స్థానిక సర్పంచ్ గూడెపు శ్రీనివాస్ స్థానిక ఎంపిటిసి, ఎంపిటిసిల ఫోరం మండల అధ్యక్షులు మంద సుధాకర్ గార్లఆధ్వర్యంలో టెంకాయ కొట్టి బోర్వెల్ ను ప్రారంభించిన స్థానిక జడ్పిటిసి జోరుక సదయ్య ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ కొరికిల తిరుపతి, టిఆర్ఎస్ గ్రామ అధ్యక్షులు చేలిక సురేష్, రైతు సమన్వయ కమిటీ గ్రామ కోఆర్డినేటర్ కోరికల తిరుపతి, వార్డ్ మెంబర్ రాజు తదితరులు పాల్గొన్నారు