చావా సినిమాను స్కూల్స్ విద్యార్థిని విద్యార్థులకు చూపించిన బిజెపి నాయకులు
బిజెపి మండల అధ్యక్షులు ఊర నవీన్ రావు
గణపురం నేటి ధాత్రి
గణపురం మండల కేంద్రంలో హిందూ హృదయ సామ్రాట్ చత్రపతి శివాజీ మహారాజ్ తనయుడు శంబాజి మహారాజ్ జీవిత చరిత్ర ఆధారంగా చావా చిత్రాన్ని తెలుగులో గణపురం లోని శ్రీ లక్ష్మీ శ్రీనివాస థియేటర్లో ప్రదర్శించిన సందర్భంగా బిజెపి గణపురం మండల పార్టీ అధ్యక్షుడు ఊర నవీన్ రావు ఆధ్వర్యంలో మండలంలో ఉన్న ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న 170 విద్యార్దిని విద్యార్దులకు ఉచితంగా సినిమా ప్రదర్శన చేయడం జరిగింది ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చావా మూవీ డైరెక్టర్ లక్ష్మణ్ ఉటేకేర్ కి నా ప్రత్యేక కృతజ్ఞతలు దు రాక్రమణదారుడైన ఔరంగాజెబ్ మన మరాఠా యోధుడు శంబాజీ మహారాజును స్వరాజ్య పోరాటంలో ఏ విధంగా చిత్రహింసలు పెట్టి చంపాడో అదేవిధంగా స్వాతంత్రం వచ్చిన 60 ఏళ్లలో ఎంతోమంది వీరుల చరిత్రను దాచిపెట్టి దురాక్రమన దారులైన ఔరంగాజెబ్,మహమ్మద్ బిన్ తుగ్లక్, అక్బర్, బాబర్, షాజహాన్,లాంటి వారి చరిత్రను పాఠ్యపుస్తకాలలొ చేర్చి మన పోరాట యోధుల చరిత్రను దాచి పెట్టింది కాంగ్రెస్ మన దేశ కేంద్ర మొట్టమొదటి విద్యా శాఖ మంత్రిని అరబ్ దేశాల నుండి తీసుకొచ్చి మన వీరుల చరిత్రపుటల్లో లేకుండా చేసింది దయచేసి స్కూల్ యాజమాన్యాలు తల్లిదండ్రులు మీ పిల్లలకు ఈ సినిమాను చూపించి హిందూ సామ్రాట్ చత్రపతి శివాజీ మహారాజ్ కుమారుడు ఛత్రపతి శంభాజీ మహారాజ్ చేసిన పోరాటం పిల్లలకు తెలిసేలా చేయాలని అన్నారు ఈ కార్యక్రమంలో బీజేవైఎం కలాశాలాల విభాగం రాష్ట్ర కన్వీనర్ మంద మహేష్, బీజేవైఎం జిల్లా అధ్యక్షులు గాలిఫ్, బీజేపీ మండల నాయకులు దుగ్గుశేట్టి పున్నం చందర్, వడ్డెం రాజశేఖర్ తదితరులు పాల్గొన్నారు