*ప్రైవేట్ హాస్పిటల్లో కి వలస పోతున్న, ప్రభుత్వ హాస్పిటల్ రోగులు,
నిద్రిస్తున్న జిల్లా వైద్య ఆరోగ్య శాఖ మరియు జిల్లా అదికారులు*
ఇటువంటి చర్యలు వాళ్ళ జిల్లా ప్రభుత్వ అధికారులకు మరియు ప్రభుత్వానికి చెడ్డపేరు వస్తుంది.
నేటి ధాత్రి.భద్రాచలం;
భద్రాచలం ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలో ఎముకల మరియు సాధారణ సర్జరీలు చెయ్యము అంటున డాక్టర్ల వైఖరి….
•ఏరియా ఆసుపత్రి నుంచి ప్రైవేట్ ఆస్పత్రి బాట పడుతున్న రోగులు,వారికి దరిచూపుతున ప్రభుత్వ హాస్పిటల్ సిబంది…
•అసలు భద్రాచలం ఏరియా ఆసుపత్రిలో రోజురోజుకీ ఏం జరుగుతుంది….?
భద్రాచలం ఏరియా ఆసుపత్రి నందు రోజురోజుకి ప్రతిరోజు ఏదో ఒక సమస్య బయటకు వస్తూనే ఉంది అలాగే బుధవారం రోజున కాలు విరిగి మణుగూరు నుంచి వచ్చిన కుటుంబం ఏరియా ఆసుపత్రిలోని ఎముకల డాక్టర్ వద్ద చికిత్సకి వచ్చినారు. అయితే కాలు భాగం ఏరియా ఆసుపత్రిలో ఎక్స్-రే తీసి దానిని వైద్యుడు యొక్క చరవాణి లో చూశారు. ఈలోపు డాక్టర్ సర్జరీ గురించి ఎటువంటి సమాచారం ఇవ్వకుండా ఉన్నారు. ఇదిలా ఉంటే భద్రాచలం ఏరియా ఆసుపత్రిలో ఎప్పటినుంచో పేషంట్ కేర్ వాళ్లు మరియు కాంట్రాక్టు సిబ్బంది బయట ఆసుపత్రుతో కమిషన్లు మాట్లాడుకొని ఆసుపత్రికి వచ్చిన పేషంట్లకు లేనిపోని మాటలు చెప్పి ఏరియా ఆసుపత్రిలో చికిత్స సరిగ్గా లేదని చెప్పి బయట ప్రైవేటు ఆసుపత్రిలో అయితే మెరుగైన చికిత్స చేస్తారని అలాగే సర్జరీ కూడా ఉచితంగా చేస్తారని, మందులకు కూడా డబ్బులు చెల్లించాల్సిన అవసరం లేదని పేషెంట్ తాలూకు వారికి చెప్పడం వల్ల వారు భయభ్రాంతులకు లోనయ్యి ఏరియా ఆసుపత్రిలో చికిత్స సక్రమంగా లేదు అనే భయంతో ప్రైవేట్ ఆసుపత్రి బాట పడుతున్నారు. కానీ అక్కడ చికిత్స సర్జరీ చేసేది ఏరియా ఆసుపత్రిలో చికిత్స సర్జరీ చేసేది రెండు చోట్ల అదే డాక్టర్ ఉంటారు. అదేవిధంగా ఈరోజు కూడా ఓపి సేవల వద్ద ఉన్న పేషంట్ కేర్ సిబ్బంది ఇక్కడ ఎముకల డాక్టర్ సర్జరీ చేయరని చెప్పి ఆ కుటుంబంను భయభ్రాంతులకు గురిచేసి అదే డాక్టర్ కి ఉన్నటువంటి ప్రైవేట్ ఆసుపత్రి పేరు చెప్పి అక్కడకి పంపినారు. ఇక్కడ విషయం ఏమిటంటే ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలో ఎందుకు ఎముకల సర్జరీ చేయడం లేదు ఎందుకు ఆ సర్జరీ లన్ని ప్రైవేటు ఆసుపత్రిలో బాట పడుతున్నాయి.. డాక్టర్లు వైద్య సిబ్బంది మరియు పేషంట్ కేర్ కాంట్రాక్టు ఉద్యోగులు అందరూ కుమ్మక్కయి కమిషన్ల కోసం డబ్బుల కోసం కక్కుర్తి పడి పేదవారిని ఇలా దోచుకుంటూ ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిని భ్రష్టు పట్టిస్తున్నారు. ఇది అంతా ఆసుపత్రిలోని అందరికీ అన్ని స్థాయిల అధికారికి తెలిసే జరుగుతుంది మరి దీని మీద ఆసుపత్రి సూపరిండెంట్ గారి సమాధానం ఏమిటో తెలపాలని ఈ కుమ్మక్కులో వారికి ఏమైనా వాటా ఉందా తెలపాలని ఈ విషయం మీద జిల్లా కలెక్టర్ మరియు ఐటిడిఏ పిఓ వెంటనే స్పందించి సంబంధిత డాక్టర్ని సంబంధిత వైద్య సిబ్బందిని తొలగించాలని విజ్ఞప్తి చేస్తున్నాం…
జాతీయ మానవ హక్కుల సంఘం (ఎన్ హెచ్ ఆర్ సి ఓ ఐ)