ప్రెస్ నోట్,
15/07/2024.
చర్ల.
జూలై 22న స్థానిక తాసిల్దార్ ఆఫీస్ ముందు జరిగే ధర్నా ను జయప్రదం చేయండి.కరపత్రాల ఆవిష్కరణ చేయడం జరిగింది.
భద్రాచలం నేటి దాత్రి
సిపిఐ ఎంఎల్ మాస్ లైన్ ప్రజాపంథా పార్టీ భద్రాచలం డివిజన్ నాయకుడు దాసరి సాయన్న.
చwర్ల మండల కేంద్రంలోని కామ్రేడ్ డీవీకే భవన్లో సిపిఐ ఎంఎల్ మాస్ లైన్ ప్రజాపంథా పార్టీ మండల కమిటీ సమావేశం సోమవారం సీనియర్ నాయకులు పాలెం చుక్కయ్య అధ్యక్షతన నిర్వహించారు.ఈ సందర్భంగా పార్టీ డివిజన్ నాయకుడు దాసరి సాయన్న మాట్లాడుతూ అర్హులైన ప్రతి ఒక్కరికి తెల్ల రేషన్ కార్డులు ఇవ్వాలని అర్హులైన పేదలకు ఇంటి స్థలం లేని వారికి ఇంటి స్థలం ఇచ్చి గృహ నిర్మాణానికి 10 లక్షల రూపాయలు ఇవ్వాలని ప్రభుత్వ వాగ్దానం ప్రకారం పెన్షన్లు పెంచి అర్హులైన వారందరికీ ఇవ్వాలని రైతాంగ రుణాలను రద్దు చేయడంతో పాటు వారికి కొత్త రుణాలు ఇవ్వాలని పంటల భీమా పథకం జూలై ఆగస్టు నెలలోనే అమలు చేయాలని వాస్తవ సాగుదారులందరికీ రైతు భరోసా అందాలని 20 ఎకరాల లోపు ఉన్నవారికి ఎంపిక చేసి పది ఎకరాల వరకు రైతు భరోసా అందించాలని అలానే కవులు రైతుల గుర్తింపునకు నిర్దిష్ట చర్యలు చేపట్టాలని ధరణి సమస్యలను తక్షణమే పూర్తిగా పరిష్కరించాలని వ్యవసాయ కార్మికులకు ప్రభుత్వం ప్రకటించిన 12 వేల రూపాయల ఆసరా పథకాన్ని తక్షణమే అమలు చేయాలని దీనిని కూడా జీవన వ్యాయానికి అనుగుణంగా పెంచాలని నిర్మాణరంగా కార్మికులు ఇతర అసంఘటిత రంగ కార్మికులకు కూడా ఆసరా పథకాన్ని అమలు చేయాలని స్కాలర్షిప్ ఫీజు రియంబర్స్మెంట్ విడుదల చేయాలని నిరుద్యోగ కాళీ పై శ్వేత పత్రం ప్రకటించి జాబ్ క్యాలెండర్ విడుదల చేయాలని పోడు సాగుదారులందరికీ పట్టాలు సాగు హక్కులు కల్పించాలని ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ సమస్యల పరిష్కారం కై జూలై 22న తహసిల్దార్ ఆఫీస్ ల ముందు జరిగే ధర్నాలను జయప్రదం చేయాలని జూలై 29న కలెక్టరేట్స్ ముందు జరగనున్న ప్రదర్శనలు ధర్నాలను జయప్రదం చేయాలని ఆయన పార్టీ కార్యకర్తలకు సానుభూతిపరులకు మండల ప్రజానీకానికి పిలుపునిచ్చారు అనంతరం సంబంధిత కరపత్రాలను ఆవిష్కరణ చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో పార్టీ చర్ల మండల కార్యదర్శి కొండ కౌశిక్, పార్టీ మండల నాయకులు శిమిడి సుజాత, మెహముద, చెన్నాం మోహన్ iftu నాయకులూ ఎంఎల్ఎన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.