ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు
భూపాలపల్లి నేటిధాత్రి
భూపాలపల్లి మున్సిపల్ పరిధిలోని సుంధరయ్య నగర్ లోని సీపీఎం పార్టీ ఆధ్వర్యంలో గుడిసెలు వేసుకొని నివాసం ఉంటున్న గుడిసెవాసులతో నిర్వహించిన సమావేశ కార్యక్రమంలో భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు వరంగల్ పార్లమెంట్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి డాక్టర్ కడియం కావ్య పాల్గొన్నారు అనంతరం.ఎంపీ అభ్యర్థి డాక్టర్ కడియం కావ్య మాట్లాడుతూ
కాంగ్రెస్ పాలనలోనే అన్ని వర్గాలకు న్యాయం జరుగుతుంది.
ఒక చెయ్యిని గెలిపించారు, మరో చెయ్యిని గెలిపిస్తే రెండు చేతుల చప్పట్ల శబ్దానికి అటు మోడీ ఇటు అరూరికి దిమ్మదిరిగాలి.
పదేళ్ల మోడీ రాక్షస పాలనలో అన్ని వర్గాలకు నష్టం జరిగింది.
కాంగ్రెస్ ప్రభుత్వం 6 గ్యారెంటీ ల్లో మహిళలకే పెద్ద పీట వేసింది.
కేంద్రంలో రాహుల్ గాంధీ ప్రధాని అవ్వాలి.
అర్హులైన పేదలకు పట్టాలు ఇచ్చేందుకు కృషి చేస్తాను.
35 ఏళ్ల తరువాత వరంగల్ లోక్ సభలో ఒక మహిళకు అవకాశం వచ్చింది.
మీ కష్ట సుఖాల్లో తోడుగా ఉంటాను.
మీ ఇంటి బిడ్డగా నిండు మనసుతో నన్ను ఆశీర్వదించి భారి మెజార్టీతో గెలిపించాలని కోరుతున్నాను.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు మాట్లాడుతు..
సీపీఎం పార్టీ ఆధ్వర్యంలో గుడిసె వసూలతో
కేంద్ర బీజేపీ రైతుల ఎరువుల సబ్సిడీ లు ఎత్తివేసి ఆధాని, అబనీలకే కొమ్మ కాస్తూ వాళ్ళు చెప్పిన ధరాలనే నిర్ణఇస్తున్నారు.
700 మంది రైతులను పొట్టన పెట్టుకుంది.
2 కోట్లా ఉద్యోగుల ఇస్తామని మోసం నిరుద్యోగులను మోసం చేసింది.
జన్ధన్ఖాతాల్లో 15 లక్షలు వేశారా..
దేవుడి పేరుతో, మతాల మధ్య చిచ్చు పెడుతూ రాజకీయం పబ్బం గడిపే బిజెపికి ఈ ఎన్నికల్లో బుద్ధి చెప్పాలి.
రాహుల్ గాంధీ ని మనం గెలిపించుకుంటే ఈ ప్రాంత వాసులకు ఇళ్లపంటలతో పాటు ఇందిరమ్మ ఇండ్లు కేటాయించే బాధ్యత నేను తీసుకుంటాను.
మోరంచ పల్లి ఊరు మునిగి ప్రజలు ఇబ్బందులు పడుతుంటే బీఆర్ఎస్ బిజెపి పార్టీలు చేసింది ఏమీ లేదు.
బీఆర్ఎస్ బిజెపికి ఓట్లు అడిగే హక్కు లేదు.
పెరిగిన ధరలు తగ్గాలన్న, మన బ్రతుకులు మారాలన్నా, మన వరంగల్ పార్లమెంట్ నియోజకవర్గ కాంగ్రెస్ అభ్యర్థి డాక్టర్ కడియం కావ్య గారిని భారీ మెజారిటీతో గెలిపించుకోవాలి.
రాష్ట్రంలోని బిఆర్ఎస్ దళితులకు మూడెకరాల భూమి , నిరుద్యోగ భృతి, కేజీ టు పీజీ విద్య అందిస్తామని మోసం చేశాయి.
బీఆర్ఎస్ 7 లక్షల కోట్ల అప్పును ప్రజల నెత్తిన వేశారు.
కాంగ్రెస్ పాలనలో 500 కె గ్యాస్, 200 యూనిట్ల ఫ్రీ కరెంటు, మహిళలకు ఉచిత బస్సు సౌకర్యాన్ని కల్పిస్తున్నాం. ఆడపడుచులకు నెలకు 2500 రూపాయలను అందిస్తాం.
పార్లమెంట్ ఎన్నికల్లో కడియం కావ్య చేతి గుర్తుకు ఓటు వేసి భారీ మెజారిటీతో గెలిపించాలని కోరుతున్నాను.
ఈ కార్యక్రమంలో జిల్లా సిపిఎం కార్యదర్శి బందు సాయిలు ఇస్లావత్ దేవ్ బుర్ర కొమురయ్య అప్పం కిషన్ స్థానిక ప్రజాప్రతినిధులు, ప్రజా సంఘాల నాయకులు, సిపిఎం నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.