ఘనంగా శ్రీ సోమేశ్వర స్వామి మాస కళ్యాణం

పాలకుర్తి, నేటిధాత్రి;-

ప్రముఖ పుణ్యక్షేత్రం పాలకుర్తి శ్రీ సోమేశ్వర లక్ష్మీనరసింహస్వామి దేవాలయంలో శుక్రవారం చండిక అమ్మవారి  ఆలయంలో చండికాసమేత  శ్రీ సోమేశ్వర స్వామి వారికి మాస కళ్యాణం వైభవంగా నిర్వహించారు. మేళతాళాలు, అర్చకుల వేద మంత్రోచ్ఛారణల  మధ్య మహా వైభవోపేతంగా జరిగింది. ఈ కల్యాణోత్సవంలో భక్తులు పాల్గొని కనులారా తిలకించి తరించారు.ఈ కార్యక్రమంలో ఆలయ ఈవో భాగం లక్ష్మీ ప్రసన్న, అర్చకులు, సిబ్బంది, భక్తులు పాల్గొన్నారు. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *