తెలంగాణ ప్రభుత్వం చేనేత మిత్ర పథకం ద్వారా ప్రతినెల అందజేత శాయంపేట
నేటి ధాత్రి: శాయంపేట మండలం చేనేత సహకార సంఘం నిర్వహించిన 62వ వార్షిక 76వ సంవత్సర సాధారణ మహాసభలు జరిగాయి.తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేనేత కార్మికులకు అండగా ఉండి ఎన్నో సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టిందని చేనేత సహకార సంఘం పిఐసి చైర్మన్ మామిడి శంకర్ లింగం మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం చేనేత మిత్ర పథకం ద్వారా ప్రతినెల కార్మికుడికి రూ 2000 అనుబంధ కార్మికులకు రూ 1000 రూపాయలు అందజేసి కార్మికులకు చేదోడు వాదోడుగా ఉంటుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో సంఘ మాజీ అధ్యక్షులు దిడ్డి రమేష్ , సంఘ పిఐసి మెంబర్లు బాసాని సాంబయ్య, రంగు ఆనందం,బూరలక్ష్మీనారాయణ దిడ్డి ప్రభాకర్ , మెండు సమ్మక్క సంఘ కార్మికులు సభ్యులు పాల్గొన్నారు.