వేటు కోసమే ప్రేవేటులో చేరాడు!?

`తప్పు కోవాల్సిన సమయం వచ్చింది?

`తన తప్పులు బైట పడే కాలం ఎదురుకానుంది?

`మంత్రి హరీష్‌ రావు తవ్వకాలు మొదలుపెట్టేలా వున్నారు?

`సంకేతాలు అలాగే కనిపించాయి?

`ఏదో జరిగేలా వుంది?

`శంకరగిరి మాన్యాలు తప్పవని తెలుస్తోంది?

`తనకు తానుగా తప్పుకునే అవకాశం కనిపించలేదు?

`తప్పిస్తే తప్ప చేసిన తప్పులనుంచి బైట పడలేడు?

`అందుకు వేటే సరైన మార్గం?

`అందుకు చికిత్స ఇప్పటికిప్పుడు అవసరం?

`ప్రైవేటులో చేరి సమస్య పక్కదారి పట్టిస్తే చాలు!

`వస్తే సింపతి…లేకుంటే సాగనంపే వసతి?

`ఎలా అయినా మేలే…తప్పులు తవ్వకుండా పంపిస్తే సంతోషమే!

`ప్రతిష్టాత్మక నిమ్స్‌ పరువు మనోహర్‌ తీశాడన్న అపవాదులో అవినీతి మాయం?

`ఇప్పటికైతే మనోహర్‌ స్కెచ్‌ సక్సెస్‌…?

`అసలు రంగు బైటపడితే తప్ప వెలుగు చూడదు…అసలు మైనస్‌!

`మనోహర్‌ బాగోతాలెన్నో గతంలో నేటిధాత్రి చెప్పింది!

`అన్నతో కలిసి అందినకాడికి దోచుకున్న వైనం..

`ఎంజిఎంలో రిటైర్డైన డాక్టర్‌కు నిమ్స్‌లో నియాకమం…

`ఆడిటింగ్‌ సెక్షన్‌లో ఓ రిటైర్డు ఉద్యోగితో లెక్కలు తారు మారు బాగోతం…

హైదరాబాద్‌,నేటిధాత్రి: 

తాను తప్పుకోవాల్సిన సమయం వచ్చింది. పరిస్దితులు గతంలో లాగా లేవు. వైద్య ఆరోగ్య శాఖ మంత్రిగా హరీష్‌రావు వచ్చారు. గత ఏడాది కాలంగా వైద్య శాఖ ప్రక్షాళనలో సీరియస్‌గా వుంటున్నారు. చిన్న చిన్న తప్పులు చేసిన వారినే వదలడం లేదు. అలాంటిది ఏకంగా ఎనమిదేళ్లుగా నిమ్స్‌ను భ్రష్టుపట్టించిన తనను ఎలాగూ వదిలిపెట్టరు? ఈ మధ్య వైద్యశాఖలో మరింత సీరియస్‌గా అన్ని వ్యవస్ధలపై సమీక్షలు నిర్వహిస్తున్నారు. పైగా తనపై అనేక పిర్యాధులు కూడా అందుతున్నాయి. ఇక తప్పుకోవడం మేలు…అలా అని వైదొలుగుతానని చెప్పలేడు….! ఏం చేయాలి అని ఆలోచిస్తున్న తరుణంలోనే నిమ్స్‌ డైరెక్టర్‌ మనోహర్‌ను గుండె నొప్పి కాపాడిరది. అందుకు గుండెపోటు కలిసొచ్చింది. ఇదే అదును వేటు వేయించుకునేందుకు… ఇదే సరైన సమయం. ఈ సమయంలో ఎలాగూ గుండెచికిత్స అవసరం. అందుకు నిమ్స్‌లో కాకుండా ప్రైవేటు ఆసుపత్రిలో చేరితే చాలు…తాను నిమ్స్‌కు అప్రదిష్ట తెచ్చానని ముందూ వెనుక ఆలోచించకుండా ప్రభుత్వమే తప్పిస్తుంది…ఉద్యోగం నుంచి తొలిగిస్తుంది…! ఒక వేళ అదే జరిగితే అంతా మాఫ్‌…అంతా సాఫ్‌…అండ్‌ సేఫ్‌…! చేసిన తప్పులన్నీ తూచ్‌…అవినీతి సంపాదన అంతా గప్‌చుప్‌…ఎలాంటి ఎంక్వౌరీలు వుండవు. వాటి ఆలోచనకే ఆస్కారం లేదు. సాగనంపే సమయంలో అవకతవకలు చూడరు. తెలంగాణ రాష్ట్రం వచ్చాక నిమ్స్‌ డైరెక్టర్‌గా బాధ్యతలు చేపట్టిన రిటైర్డ్‌ వైద్యుడు మనోహర్‌ . ఆడిరది ఆట పాడిరది పాటగా సాగింది.

ఈ ఎనమిదేళ్లు ఎలాంటి ఎదరు లేదు. నిజానికి నిమ్స్‌ డైరెక్టర్‌ పదవి అన్నది రెండు సంవత్సరాలు మాత్రమే. కాకపోతే ఓ ఏడాది పొడిగింపుకు కూడా అవకాశం వుంటుంది. కాని మనోహర్‌ మాత్రం ఎనమిదేళ్లుగా ప్రభుత్వం వద్ద మంచి మార్కులు కొట్టేస్తూ పదవీ కాలాన్ని పొడిగించుకుంటూ వస్తున్నారు. అందుకు సిఎంవోలో వున్న గంగాధర్‌ పూర్తి సహాకారంతో సాగుతోందన్నది నిమ్స్‌ ఉద్యోగులు అనే మాట. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటయ్యాక ముగ్గురు ఆరోగ్య శాఖ మంత్రులు మారారు. కాని నిమ్స్‌ డైరెక్టర్‌ మాత్రం మారలేదు. అలా అందర్నీ మేనేజ్‌ చేస్తూ వచ్చారు. కాని ఇప్పుడు కుదడం లేదు. కాలం కలిసి రావడం లేదు. గతంలో ఆరోగ్యశాఖ మంత్రులతో అందిన సహాకారం ఇప్పుడు అందడం లేదు. తన ఆటలు చెల్లుబాటు కావడం లేదు. ప్రతి విషయంలోనూ మంత్రి హరీష్‌రావు బాధ్యతలు చేపట్టాక డేగకళ్లలో నిఘా పెరిగింది. మనోహర్‌ లాంటి వారికి ఊపిరి సలపడం లేదు. ఎప్పటికప్పుడు నిమ్స్‌ విషయంలోనూ సమీక్షలు జరుగుతున్నాయి. పాత ఫైళ్లు ముందుట పడుతున్నాయి. పాపాల చిట్టా బైటపడేలా వుంది. ఇక తన వంతు వచ్చేలా వుంది. ఎందుకైనా మంచిది ముందే తప్పుకుంటే మేలు…ఎనమిదేళ్లుగా దోచుకున్నదంతా తెలిసిపోయేలా వుంది. ఇలాంటి సమయంలో సానుభూతి పొందడం అన్నది దుర్లభం. ప్రభుత్వ పెద్దలు చీదరించుకుంటేనే మేలు…ఉన్న ఫలంగా సాగనంపితేనే మరింత మేలు. మెడలు పట్టి బైటకు పంపినా సరే…కాని పాత గోతులు తవ్వకపోతే సరి… ఎలాగూ గుండెకు స్టెంటులు వేశారు. కొంత కాలం పాటు రెస్టు ఎంతో అవసరం. 

ఈ సమయంలో తనను ప్రశ్నించడానికి ఎవరూ రారు…మానవతా దృక్పధం వుంటుంది…ఇదే సమయంలో తనను పరామర్శించడానికి వచ్చిన నిమ్స్‌ ఉద్యోగులతో ఏం జరుగుతుందో అన్నది ఎప్పటిప్పుడు తెలుసుకోవచ్చు. మరింత జాగ్రత్త పడొచ్చు. ఇదీ నిమ్స్‌ డైరెక్టర్‌ మనోహర్‌ వేసిన అధ్భుతమైన స్కెచ్‌…వినడానికి వింతగా వున్నా లోతుగా అవగాహన చేసుకుంటే గాని అర్ధం కాదు. జులాయి అనే సినిమాలో ఓ అధ్భుతమైన సన్నివేశం మనోహర్‌ విషయంలో రుజువైనట్లు కనిపిస్తోంది. ఓ సన్నివేశంలో ఎంతో టెన్షన్‌గా వుండే రాజేంద్ర ప్రసాద్‌కు అల్లు అర్జున్‌ ఓ విషయం చెబుతాడు. అప్పుడు రాజేంద్ర ప్రసాద్‌ ఇంత టెన్షన్‌లో ఆ విషయం ఎలా తట్టిందని ప్రశ్నిస్తాడు. క్లాస్‌ రూంలో వున్నప్పుడు ఎవడైనా సమాధానం చెబుతాడు…పరీక్షల్లో గుర్తుకొచ్చి ఆన్సర్లు రాసిన వాడే టాపర్‌ అవుతాడు…అంటాడు….ఇది ఇక్కడ నిజమైందని మాత్రం ఖచ్చితంగా చెప్పొచ్చు. ఇది సరిగ్గా అమలు చేసి సక్సెస్‌ అయ్యాడు. నిమ్స్‌లో పనిచేసే ఉద్యోగులు, ప్రభుత్వ పెద్దలు, ప్రజల ఆలోచనలు మరో వైపు మళ్లించాడు. ఎంత సేపు మనోహర్‌ నిమ్స్‌ డైరెక్టర్‌గా వుంటూ ఎలా ప్రైవేటు ఆసుపత్రికి వెళ్తారు? నిమ్స్‌ డైరెక్టరే ఆ ఆసుపత్రిని నమ్మకపోతే ఇక సామాన్యులు ఎలా నమ్ముతారు? జనంలో నమ్మకం ఎలా ఏర్పడుతుంది. ఒక్క సంఘటనతో మొత్తం నిమ్స్‌ పరవు తీశాడు. వెంటనే మనోహర్‌ను పదవి నుంచి తొలిగించాలి? అనే డిమాండ్‌ సర్వత్రా ఎదురౌతుంది. తాను చేసిన తప్పులన్నీ ఈ ఒక్క తప్పులో కొట్టుకుపోతాయన్నది మనోహర్‌ వేసిన ఎత్తుగడ… ఈ ఎనమిదేళ్ల కాలంలో నిమ్స్‌లో సుమారు వందల కోట్ల రూపాయల గోల్‌ మాల్‌ .జరిగిందనేది అక్కడి ఉద్యోగుల మాట.

ఎనమిదేళ్ల కాలంలో నిమ్స్‌లో అనేక వందల కోట్ల రూపాయలు ఖర్చు చేసి అనేక మరమ్మత్తులు చేపట్టారు. కొత్త నిర్మాణాలు మాత్రం కాదు…పాత వాటికే కొత్త పూతలు పూయడం అన్న మాట…ఇలా పావుల పైసల కూరకు ముప్పావుల మసాలా ఖర్చు అన్నట్లు కొత్త నిర్మాణాలకయ్యే ఖర్చుకన్నా, అనేక రెట్లు మరమ్మత్తుల పేరుతో ఖర్చు చేశారన్నది ప్రధాన అరోపణ. అది కూడా కొన్ని వందల కోట్ల ఖర్చుకు లెక్కా పత్రం లేకుండా చేశారన్నది ప్రధాన విమర్శ. తాను చేసిన అడ్డమైన పనులకు అండగా నిలిచేందుకు వరంగల్‌ ఎంజిఎంలో రిరైర్డ్‌ అయిన అరవింద్‌ రెడ్డి అనే డాక్టర్‌, మధుసూదన్‌ అనే మరో రిటైర్డు ఉద్యోగిని తెచ్చి తన అనుచరులుగా ఔట్‌సోర్సింగ్‌లో నియామకాలు చేయించాడు. అంతే కాకుండా నిమ్స్‌లో జరిగే ప్రతి నిర్మాణాలను స్వయాన తన సోదరుడి కనుసన్నల్లోనే జరిగేలా చూసుకున్నాడు. నిమ్స్‌ పరిధిలో చేపట్టే అనేక నిర్మాణపు పనులకు ఎలాంటి టెండర్లు వుండవు. ఒక వేళ వేసినా వాటిని రద్దు చేస్తారు. మనోహర్‌ సోదరుడి పర్యవేక్షణలో అనేక మరమ్మత్తులు చేపట్టారు. వందల కోట్లు ఖర్చు చేశారు…కోట్లాది రూపాయలు వెనకేసుకున్నారు. కాదు..కాదు దోచుకున్నారంటే బాగుంటుందేమో! ఇది ఏ నిమ్స్‌ ఉద్యోగిని కదిలించినా చెప్పే మాటే… నిమ్స్‌ డైరెక్టర్‌గా మనోహర్‌ నియామకం జరిగిన నాటి నుంచి నేటిధాత్రి అనేక కధనాలు రాసింది.

ఒక దశలో అనుకూలమైన మంత్రుల కనుసన్నల్లో జరిగిన అవకతవకలపై సాక్ష్యాధారాలతో సహా ప్రచురించింది. అయినా మనోహర్‌ మాటే చెల్లుబాటైంది. కాకపోతే ఇప్పుడు పాపం పండిరది. ఏదో ఒకనాడు చేసిన తప్పులు బైట పడాల్సిందే…అవి వెలుగు చూడాల్సిందే…జనానికి తెలియాల్సిందే…కాకపోతే కొంత సమయం పట్టొచ్చు. అంతేగాని అవినీతి పరుడు ఎప్పుడూ నీతి పరుడు కాలేడు…! అయినా మనోహర్‌ తప్పించుకోవాలని చూశాడు..కాని కుదరలేదు…సానుభూతి పొందుదామని చూశాడు…కాని నిమ్స్‌ ఉద్యోగులే ప్రశ్నించారు. మనోహర్‌కు గుండెసంబంధమైన విషయంలో ఆయన ఆసుపత్రిలో చేరిన వెంటనే అత్యవసర చికిత్స ఏమీ జరగలేదు. ఒక వేళ ఆయన తప్పని పరిస్ధితుల్లో అపోలో హైదర్‌గూడలో చేరినా , తర్వాత గుండె సంబంధమైన చికిత్స కోసం నిమ్స్‌కు తరలించే అవకాశం వుంది. కాని అలా జరగలేదు. అంటే ఒక స్ధిర నిర్ణయంతోనే ఆయన ప్రైవేటు ఆసుపత్రిలో చేరాడనేది స్పష్టమౌతోంది. తాను నిమ్స్‌ పరువు దిగజార్చినట్లు ప్రజలు, ప్రభుత్వం స్పందిస్తేగాని, ఈ ఉచ్చునుంచి బైటపడలేని స్దితి. అందుకే ఈ కొత్త నాటకంతో అందరిచేత అయ్యో! అనిపించుకుకోవాలనుకున్నాడు…కాని కాలం ఎదురు తిరిగింది…తను తలిచింది నిజమైనా… అంతలోనే కథ అడ్డం తిరిగింది…అయితే ప్రభుత్వం అప్పటికే కొత్త డైరెక్టర్‌ను నియమించాలని కూడా ఆలోచన చేస్తున్నట్లు మనోహర్‌కు తెలిసింది. కొత్త డైరెక్టర్‌ వచ్చి, పాత ఫైళ్లన్నీ తిరగదోడితే కథ మొదటికొస్తుంది. పీకల మీదికొస్తుంది…అందుకే ముందుజాగ్రత్త చర్య…ఎంతో నిపుణుడైన డాక్టర్‌కు గుండెపోటుకు చికిత్స!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!