Follow Sundarayya’s Ideals
ఆదర్శ నేత పుచ్చలపల్లి సుందరయ్య స్పూర్తితో ఉద్యమించాలి.
సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు భుక్య సమ్మయ్య, కోరబోయిన కుమారస్వామి
నర్సంపేట, నేటిధాత్రి:
ప్రముఖ కమ్యూనిస్టు నాయకుడు, తెలంగాణా రైతాంగ సాయుధ పోరాట వీరుడు, స్వాతంత్ర్య సమర యోధుడు. కమ్యూనిస్టు గాంధీగా పేరొందిన పుచ్చలపల్లి సుందరయ్య 41వ వర్ధంతి పార్టీ కార్యాలయంలో పట్టణ కార్యదర్శి 10 వార్డు కౌన్సిలర్ హన్మకొండ శ్రీధర్ అధ్యక్షతన సభ నిర్వహించడం జరిగింది, ముందుగా సుందరయ్య చిత్ర పటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు.ఈసందర్బంగా సీపీఎం పార్టీ జిల్లా కమిటీ సభ్యులు, భుక్య సమ్మయ్య, కోరబోయిన కుమారస్వామి మాట్లాడుతూ కమ్యూనిస్టు ఉద్యమ నిర్మాతలలో ప్రముఖుడు. కులవ్యవస్థను నిరసించిన సుందరయ్య అసలు పేరు పుచ్చలపల్లి సుందరరామిరెడ్డి లోని రెడ్డి అనే కులసూచికను తొలగించుకున్నాడని కొనియాడారు. సహచరులు పుచ్చలపల్లి సుందరయ్యను “కామ్రేడ్ పి.ఎస్.” అని పిలిచే వారని అన్నారు. సుందరయ్య మార్క్సిస్ట్ పార్టీ నిరాడంబరతతో ఆదర్శ జీవితం గడిపాడు. స్వాతంత్ర్య సమరంలోని అనేక ఉద్యమాల్లో పాల్గొన్నాడు. సుందరయ్య భార్య కూడా సీపీఐ-ఎంలోని ముఖ్య నాయకురాలు. తెలంగాణ ప్రజల పోరాటం – దాని పాఠాలు, విశాలాంధ్రలో ప్రజారాజ్యం వంటి పుస్తకాలు, నివేదికలు రాశాడు గొప్ప కమ్యూనిస్టు నాయకుడు అన్నారు. పార్లమెంటు సభ్యునిగా సుదీర్ఘ కాలం పనిచేశాడు, ఆ సమయంలో పార్లమెంటుకు కూడా సైకిల్ మీద వెళ్లి ఆదర్శ కమ్యూనిస్ట్ పార్టీ నేతగా మన్నన్నలు పొందాడు. నిజాం పాలన కాలంలో సాగిన తెలంగాణా సాయుధ రైతాంగ పోరాటం ఒక ముఖ్యమైన ఘట్టం. ఆ పోరాటానికి నాయకత్వం వహించిన వాళ్లు లో ముఖ్యులు సుందరయ్య. ఆ పోరాటం చివరి దశలో 1948 నుండి 1952 వరకు సుందరయ్య అజ్ఞాతంలో గడిపాడు. భూస్వామి విధానాలకు వ్యతిరేకంగా జాగిరిదారులకు వ్యతిరేకంగా జీవితాంతం పోరాడిన కమ్యూనిస్టు ఉద్యమ నేత అని అన్నారు. ఆ పోరాటంలో 10 లక్షల ఎకరాలు పేదలకు పంపిణీ చేశారని గుర్తు చేశారు.
పేదల ఆకలి తీర్చేందుకు అంబలి కేంద్రాలను ఏర్పాటు చేశారని అన్నారు. పేదల నిత్యవసర అవసరాలు తీర్చేందుకు పట్టణం నుండి తన సైకిల్ పై నిత్యవసర వస్తువులు తెచ్చి గ్రామంలో పేదలకు పంపిణీ చేసేవారు అన్నారు. పేదల కోసం ఆసుపత్రి ఏర్పాటు చేశారని, యువకుల కోసం గ్రంథాలయాన్ని ఏర్పాటు చేశారన్నారు. 1930 లోనే సహపంక్తి భోజనాలు ఏర్పాటు చేసి కుల వివక్షత వ్యతిరేకంగా పోరాడారన్నారు, ప్రజల భాగస్వామ్యంతో బందరు కాల్వ పూడిక తీసి రైతులకు మేలు చేశారన్నారు. ఆనాడే కూలి సంఘం,కర్షక సంఘం, కార్మిక సంఘాలను స్థాపించారని గుర్తు చేశారు. చివరి శ్వాస వరకు అను నిత్యం పేదప్రజల కోసం పోరాడిన సుందరయ్య పోరాట స్ఫూర్తిని పునికిపుచ్చుకొని కమ్యూనిస్టు పార్టీ కార్యకర్తలు అయన ఆశయాలను కొనసాగించాలని పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో సిపిఎం జిల్లాకమిటీ సభ్యులు నమిండ్ల స్వామి, పట్టణ కమిటీ సభ్యులు గడ్డమీది బాలకృష్ణ, ఎండీ ఫరీదా, వజ్జంతి విజయ, బుర్రీ ఆంజనేయలు, లక్క రాజు, రుద్రారపు లక్ష్మి, ఉదయగిరి సరిత, గణిపాక విలియం కేరి , మోగులోజు శారదా, దాసరి నరేష్, ఎల్లయ్య, తదితరులు పాల్గొన్నారు.
