TDP Leaders Target YCP Over Dalit Issues
వ్యవసాయ అధికారికి వినతిపత్రం అందజేసిన వరికెల
నడికూడ,నేటిధాత్రి:
తెలంగాణ రైతు రక్షణ సమితి ఆధ్వర్యంలో ఉమ్మడి వరంగల్ జిల్లా అధ్యక్షులు వరికెల కిషన్ రావు రైతులకు కల్తీ విత్తనాల మోసం జరగకుండా కఠిన చర్యలు తీసుకోవాలని హనుమకొండ జిల్లా వ్యవసాయ అధికారి రవీందర్ సింగ్ కి వినతి పత్రం అందజేశారు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రస్తుత ఖరీఫ్ సీజన్ ప్రారంభం కావడంతో రైతులు విత్తనాల కొనుగోలుకు సిద్ధమవుతున్నారని,ఈ సమయంలో కొందరు దళారులు,అక్రమ వ్యాపారులు కల్తీ విత్తనాలను విక్రయించి రైతులను మోసం చేసే ప్రమాదం ఉందని తెలిపారు.అలాంటి వారిపై జిల్లా యంత్రాంగం ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసి, నాణ్యమైన విత్తనాలు మాత్రమే రైతులకు అందేలా చర్యలు తీసుకోవాలని కోరారు.
జిల్లాలోని అన్ని విత్తన దుకాణాలపై ఆకస్మిక తనిఖీలు నిర్వహించి,లైసెన్స్ లేని దుకాణాలపై చర్యలు తీసుకోవాలని,కల్తీ విత్తనాలను విక్రయించే వారిపై కఠిన చర్యలు చేపట్టాలని, రైతులకు అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని వినతిపత్రంలో కోరారు.
ఈ కార్యక్రమంలో హనుమకొండ జిల్లా అధ్యక్షులు హింగే భాస్కర్ పాల్గొన్నారు.
