Sanjana Becomes District Topper
భవిష్యత్తులో మరిన్ని ఉన్నత విజయాలు సాధించాలి
కళాశాల ప్రిన్సిపాల్ తాళ్లపల్లి రాకేష్
మొగుళ్లపల్లి నేటి దాత్రి
జయశంకర్ భూపాలపల్లి జిల్లా, మొగుళ్లపల్లి మండలంలోని *టీజీఎంఎస్ కొరికిశాల జూనియర్ కళాశాలకు చెందిన ఇంటర్మీడియట్ ద్వితీయ సంవత్సరం MPC విద్యార్థిని **కె. సంజన* 1000 మార్కులకు గాను *973 మార్కులు* సాధించి జిల్లా స్థాయిలో ఎంపీసీ గ్రూపులో అత్యుత్తమ ప్రతిభ కనబరిచి జిల్లా టాపర్గా నిలవడం మా కళాశాలకు గర్వకారణం. అని కళాశాల ప్రిన్సిపల్ తాళ్లపల్లి రాకేష్ అన్నారు
ఈ విశిష్ట విజయాన్ని గుర్తిస్తూ ఆమెకు *రూ.10,000 నగదు బహుమతితో పాటు **ప్రశంసా పత్రం*ను జిల్లా విద్యాశాఖ అధికారి శ్రీ రాజేందర్ గ అందజేశారు.
ఈ సందర్భంగా కళాశాల ప్రిన్సిపాల్ తాళ్లపల్లి రాకేష్, అధ్యాపకులు మరియు విద్యార్థులు కె. సంజన ను అభినందిస్తూ, కళాశాలకు మంచి పేరు తీసుకువచ్చినందుకు ప్రశంసించారు. భవిష్యత్తులో మరిన్ని ఉన్నత విజయాలు సాధించాలని ఆకాంక్షించారు.
ఈ విజయానికి కృషి చేసిన అధ్యాపకులు, తల్లిదండ్రులు మరియు విద్యార్థినిని ప్రిన్సిపాల్ అభినందిస్తూ, కళాశాల ఎల్లప్పుడూ విద్యా ప్రగతికి కట్టుబడి పనిచేస్తుందని తెలిపారు.
