*దేశ ఆర్థిక భద్రత కోసం ప్రతి కుటుంబం బాధ్యత తీసుకోవాలి..
*దేశ ప్రధాని నరేంద్ర మోడీ సూచించిన పొదుపు సూత్రాలను పాటించాలి..
*చిత్తూరు ఎంపీ దగ్గుమళ్ళ ప్రసాదరావు..
చిత్తూరు(నేటిధాత్రి:
ప్రపంచ రాజకీయ పరిస్థితులు రోజురోజుకూ ఉద్రిక్తంగా మారుతున్నాయి. ముఖ్యంగా పశ్చిమాసియాలో కొనసాగుతున్న ఘర్షణలు ప్రపంచ ఆర్థిక వ్యవస్థను ప్రభావితం చేసే స్థాయికి చేరుకున్నాయి. చమురు ధరల పెరుగుదల, దిగుమతి వ్యయాల భారము, మార్కెట్ అస్థిరత వంటి పరిణామాలు భారత్ వంటి అభివృద్ధి చెందుతున్న దేశాలపై ప్రత్యక్ష ప్రభావం చూపే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో దేశ ప్రజలు ముందుగానే జాగ్రత్తగా వ్యవహరించాలనే. భారత ప్రధాని నరేంద్ర మోదీ సూచించిన పొదుపు సూత్రాలను పాటించి.దేశ ఆర్థిక భద్రత కోసం ప్రతి కుటుంబం బాధ్యత తీసుకోవాలని తెలుగు దేశం పార్టీ పొలిట్ బ్యూరో సభ్యులు, చిత్తూరు పార్లమెంటు సభ్యులు దగ్గుమళ్ళ ప్రసాదరావు పిలుపునిచ్చారు.పొదుపు అనేది కేవలం కుటుంబ అవసరం కాదు…అది దేశ భద్రతకు కూడా ఆధారం” అనే భావనను ఆయన ప్రోత్సహిస్తున్నారని చెప్పారు.
పశ్చిమాసియా సంక్షోభం.., పెరుగుతున్న ఆర్థిక సవాళ్ల నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోడీ దేశవిదేశీ మారక నిల్వలను కాపాడేందుకు,ఇందన వినియోగాన్ని తగ్గించేందుకు కీలక పొదుపు సూత్రాలను ప్రకటించిన దరిమిలా..,
ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మార్గ నిర్దేశంలో…
మోడీ పిలుపునందుకున్న
చిత్తూరు ఎంపీ దగ్గుమళ్ళ ప్రసాదరావు…. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలను గురువారం చిత్తూరు ఎంపీ కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో మీడియాకు
చిత్తూరు పార్లమెంటు సభ్యులు దగ్గుమళ్ళ ప్రసాదరావు వెల్లడించారు,
విద్యుత్ పొదుపు… దేశానికి ప్రత్యక్ష సహాయం అవసరం లేని సమయంలో లైట్లు, ఫ్యాన్లు, ఏసీలు ఆఫ్ చేయడం చిన్న విషయం అనిపించినా, కోట్లాది కుటుంబాలు అదే చేస్తే దేశ విద్యుత్ వినియోగ భారం గణనీయంగా తగ్గుతుంది. విద్యుత్ ఉత్పత్తికి కూడా భారీగా ఇంధనం అవసరం అవుతుంది. కాబట్టి విద్యుత్ పొదుపు అంటే పరోక్షంగా దేశ సంపదను కాపాడినట్టేనన్నారు.
ఇంధన వినియోగంలో నియంత్రణ అవసరం..,
అవసరం లేని వాహన ప్రయాణాలు తగ్గించడం, ఒకే పనికి అనేకసార్లు బయటకు వెళ్లకుండా ప్లాన్ చేసుకోవడం,సాధ్యమైనంత వరకు పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ వినియోగించడం వంటి చర్యలు పెట్రోల్, డీజిల్ వినియోగాన్ని తగ్గిస్తాయి. భారత్ ఎక్కువగా విదేశీ చమురుపైనే ఆధారపడుతున్నందున ప్రతి చుక్క ఇంధనం విలువైనదేనని తెలిపారు.
బంగారం దిగుమతుల వల్ల దేశ విదేశీ మారక ద్రవ్యం భారీగా వ్యయమవుతున్నందున, ప్రస్తుత సంక్షోభ పరిస్థితి ముగిసేవరకు బంగారం కొనుగోళ్లను వాయిదా వేసుకోవాలి. విదేశీ వస్తువుల దిగుమతులను తగ్గించి, విదేశీ కరెన్సీ ఖర్చయ్యే వ్యక్తిగత విలాసాలకు దూరంగా ఉండాలన్నారు.
నీటి సంరక్షణ కూడా ఆర్థిక రక్షణే నీటి వృథా తగ్గితే వ్యవసాయం, విద్యుత్ ఉత్పత్తి, పట్టణాల నిర్వహణపై ఒత్తిడి తగ్గుతుంది. భవిష్యత్‌లో నీటి కొరత పెద్ద ఆర్థిక సంక్షోభానికి దారితీయొచ్చని నిపుణులు హెచ్చరిస్తున్నారు. అందుకే నీటి వినియోగంలో జాగ్రత్తలు ఇప్పటి నుంచే అలవాటు కావాలని ప్రజలకు అవగాహన కల్పించారు.
విదేశీ వస్తువుల కంటే స్వదేశీ ఉత్పత్తులకు ప్రాధాన్యం లోకల్‌కు వోకల్” అనే మోదీ పిలుపు ఇప్పుడు మరింత అవసరమైంది. స్థానిక ఉత్పత్తులు కొనుగోలు చేస్తే చిన్న వ్యాపారులు, రైతులు, సూక్ష్మ పరిశ్రమలు బలపడతాయి. దేశంలోనే డబ్బు తిరుగుతుండటం వల్ల ఆర్థిక వ్యవస్థ స్థిరపడుతుందన్నారు.
ఆడంబరాల కంటే అవసరాలకు ప్రాధాన్యం సంక్షోభ కాలాల్లో అధిక ఖర్చులు, అనవసర కొనుగోళ్లు కుటుంబాలను అప్పుల్లోకి నెట్టే ప్రమాదం ఉంటుంది. కాబట్టి కుటుంబ బడ్జెట్‌ను నియంత్రించడం, పొదుపుకు ప్రాధాన్యం ఇవ్వడం అత్యవసరం. ప్రతి నెల కొంత మొత్తాన్ని సేవింగ్స్‌గా ఉంచే అలవాటు పెంచుకోవాలన్నారు.
డిజిటల్ లావాదేవీలతో పారదర్శక ఆర్థిక వ్యవస్థకు బలమని చెప్పిన చిత్తూరు ఎంపీ దగ్గుమళ్ళ..,డిజిటల్ చెల్లింపులు పెరిగితే నగదు నిర్వహణ ఖర్చు తగ్గుతుంది. అలాగే అవినీతి, నల్లధనం నియంత్రణకు కూడా దోహదం అవుతుంది. చిన్న వ్యాపారుల నుంచి సాధారణ కుటుంబాల వరకు డిజిటల్ విధానాలను అలవాటు చేసుకోవడం దేశ ఆర్థిక క్రమశిక్షణకు ఉపయోగపడుతుందని తెలియజేశారు.
ఆహార ధాన్యాల వృథా తగ్గించాలి..ఒక్క గింజ అన్నం వెనుక రైతు చెమట, నీరు, విద్యుత్, రవాణా వ్యయం అన్నీ ఉంటాయి. కాబట్టి ఆహారాన్ని వృథా చేయకుండా అవసరమైనంత మాత్రమే వండటం, వినియోగించడం కూడా ఒక గొప్ప పొదుపు సూత్రమేనన్నారాయనపొదుపు అనేది పాతతరం అలవాటు మాత్రమే కాదు. భవిష్యత్ భారత్‌ను నిర్మించే యువత కూడా పొదుపు నేర్చుకోవాలి. ఇంధన పొదుపు, నీటి సంరక్షణ, డిజిటల్ చెల్లింపులు, స్థానిక ఉత్పత్తుల వినియోగం వంటి అంశాల్లో యువత ముందుండాలన్నారు.
ప్రధాని నరేంద్ర మోడీ కేవలం మాటలకే పరిమితం కాకుండా నిబంధనలను స్వయంగా అమలు చేస్తూ తన భద్రతా కాన్వాయ్‌లోని వాహనాల సంఖ్యను మరియు SPG కమాండోల సంఖ్యను 50 శాతం మేర తగ్గించుకుని, ఆచరణలో చేసి చూపారని, ఇది కూటమి ప్రభుత్వ చిత్తశుద్ధికి నిదర్శనం అన్నారు.
ఇక రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కూడా భారత ప్రధాని నరేంద్ర మోడీ బాటలో పయనిస్తూ పొదుపు చర్యలకు శ్రీకారం చుట్టారని చిత్తూరు ఎంపీ దగ్గుమళ్ళ ప్రసాదరావు తెలియజేశారు.
