ఖిలా వరంగల్ లో బుర్ర రాములు 15వ యాది సభ
మానవ హక్కుల ఉమ్మడి జిల్లా నాయకుడు శంకర్
భూపాలపల్లి నేటిధాత్రి
ఖిలా వరంగల్ కోట సెంటర్లో మానవ హక్కుల నేత డాక్టర్ బుర్ర రాములు 15వ యాది సభను జిల్లా హక్కుల నేతలు ప్రజాస్వామికవాదులు వివిధ ప్రజా సంఘాల నాయకులు ఘనంగా జరిపారు. అనంతరం బుర్ర రాములు చిత్రపటానికి ఆయన కుటుంబ సభ్యులు ప్రజా సంఘాల నాయకులు పూలమాలలు వేశారు. అనంతరం రెండు నిమిషాలు ఆయనకు శ్రద్ధాంజలి ఘటించి జోహార్లు తెలిపారు.
బుర్ర రాములు కూతురు జన మానవ హక్కుల వేదిక జిల్లా నాయకులు పాలకుర్తి సత్యం సాయి ఉమ్మడి జిల్లా నాయకుడు చంద్రగిరి శంకర్ మాట్లాడుతూ డాక్టర్ బుర్ర రాములు విద్యార్థి దశ నుండే ప్రగతిశీల భావాలు కలిగి విప్లవ విద్యార్థి సంఘ నిర్మాణానికి కృషి చేశాడని అదే క్రమంలో కాకతీయ యూనివర్సిటీలో లెక్చరర్ గా పని చేస్తూ పౌర, మానవ హక్కుల సంఘాలలో రాష్ట్ర నాయకులుగా పనిచేస్తూ కేంద్ర ప్రభుత్వాలు చేస్తున్న హక్కుల ఉల్లంఘనను ప్రశ్నించేవాడని అన్నారు .
ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ బైరబోయిన దామోదర్ యాదవ్ వరంగల్ బార్ అసోసియేషన్ మాజీ అధ్యక్షులు తీగల జీవన్ న్యాయవాది మైదం జయపాల్ నలిగింటి పాల్ బెల్లంకొండ రమేష్ పూర్ణచందర్ గద్దల సంజీవ బండి వెంకటేశ్వర్లు భైరబోయిన ఐలయ్య మైదంపాణి ఆర్ కృష్ణ ప్రభాకర్ లతోపాటు వివిధ ప్రజా సంఘాల నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.
