నూతన గోడౌన్ల నిర్మాణానికి కార్యాచరణ సిద్ధం చేయాలి
ఎఫ్ సీఐ, ఎస్ డబ్ల్యూసీ, నాబార్డ్, పరిశ్రమల శాఖ, తహసీల్దార్లు ఇతర శాఖల అధికారులతో సమీక్ష
జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్
సిరిసిల్ల టౌన్ :(నేటిధాత్రి)
జిల్లాలో నూతన గోడౌన్ల నిర్మాణానికి కార్యాచరణ సిద్ధం చేయాలని జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్ ఆదేశించారు. ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎఫ్ సీఐ), స్టేట్ వేర్ హౌసింగ్ కార్పొరేషన్ (ఎస్ డబ్ల్యూసీ), నాబార్డ్, పరిశ్రమల శాఖ, ఎల్ డీ ఎం తహసీల్దార్లు, మార్క్ ఫెడ్, మార్కెటింగ్ శాఖ ఇతర శాఖల అధికారులతో జిల్లా సమీకృత కార్యాలయాల సముదాయంలో గురువారం అదనపు కలెక్టర్ గడ్డం నగేష్ తో కలిసి జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్ సమీక్ష సమావేశం నిర్వహించారు. జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్ మాట్లాడుతూ.. ఎఫ్ సీఐ, ఎస్ డబ్ల్యూసీ, మార్క్ ఫెడ్ తదితర శాఖల ఆధ్వర్యంలో పంట ఉత్పత్తుల నిల్వ కోసం గోడౌన్ల నిర్మాణానికి కార్యాచరణ సిద్ధం చేయాలని సూచించారు. స్థలాలు గుర్తించాలని, నిర్మాణాలకు ప్రతిపాదనలు సిద్ధం చేయాలని ఆదేశించారు. త్వరితగతిన పనులు చేపట్టి అందుబాటులోకి తీసుకురావాలని జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్ తెలిపారు. సమావేశంలో జిల్లా సహకార అధికారి రామకృష్ణ, మార్కెటింగ్ అధికారి ప్రకాశ్, మార్క్ ఫెడ్ అధికారి హబీబ్, జిల్లా పౌర సరఫరాల శాఖ మేనేజర్ నరసింహ, నాబార్డ్ డీడీఎం దిలీప్, పరిశ్రమల శాఖ అధికారి హనుమంతు, లీడ్ బ్యాంక్ మేనేజర్ మల్లికార్జున రావు, ఎస్ డబ్ల్యూసీ, ఎఫ్ సీ ఐ అధికారులు, తహసీల్దార్లు, తదితరులు పాల్గొన్నారు.
