నీట్ పరీక్ష రద్దుకు కేంద్ర ప్రభుత్వ వైఫల్యాలే కారణం
పట్టణ బీఆర్ఎస్ మహిళల కన్వీనర్ కడారి జ్యోతి
పరకాల,నేటిధాత్రి
నీట్ పరీక్ష రద్దు కావడం కేంద్ర ప్రభుత్వ నిర్లక్ష్యం,పరీక్షల నిర్వహణలో జరిగిన వైఫల్యాలకు నిదర్శనమని పట్టణ బీఆర్ఎస్ మహిళల కన్వీనర్ కడారి జ్యోతి విమర్శించారు.దేశవ్యాప్తంగా లక్షలాది మంది విద్యార్థులు ఎంతో కష్టపడి పరీక్షలకు సిద్ధమైతే,సరైన పర్యవేక్షణ లేకపోవడం వల్ల వారి భవిష్యత్తు అనిశ్చితిలో పడిందన్నారు.పరీక్షల నిర్వహణలో పారదర్శకత, భద్రత కల్పించడంలో కేంద్ర ప్రభుత్వం విఫలమైందని ఆమె ఆరోపించారు.విద్యార్థులు,తల్లిదండ్రులు తీవ్ర ఆందోళనకు గురయ్యే పరిస్థితి ఏర్పడటం బాధాకరమన్నారు.భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా కఠిన చర్యలు తీసుకుని,విద్యార్థుల ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని బాధ్యతాయుతంగా వ్యవహరించాలని కేంద్ర ప్రభుత్వాన్ని ఆమె కోరారు.
