సీఎంఆర్ఎఫ్ చెక్కులు పంపిణీ చేసిన ఎమ్మెల్యే జిఎస్ఆర్
భూపాలపల్లి నేటిధాత్రి
భూపాలపల్లి ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో భూపాలపల్లి రూరల్, అర్బన్ ఘనపూర్ మండలాలకు చెందిన సీఎం ఆర్ ఎఫ్ చెక్కులను లబ్ధిదారులకు పంపిణీ చేసిన ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు.
ఈ కార్యక్రమంలో భాగంగా భూపాలపల్లి అర్బన్ & రూరల్ కు చెందిన మొత్తం 46 చెక్కులను రూ.18,45,700 విలువతో ఘనపూర్ మండలానికి చెందిన 31 చెక్కులను రూ.9,74,300 విలువతో పంపిణీ చేశారు. అదేవిధంగా 23వ వార్డుకు సంబంధించిన ఇందిరమ్మ ఇళ్ల పట్టాలను కూడా లబ్ధిదారులకు అందజేశారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు మాట్లాడుతూ ప్రస్తుతం కొనసాగుతున్న ప్రజా ప్రభుత్వం మహిళా సంక్షేమం, వైద్య సేవలు పేద ప్రజల అభ్యున్నతి కోసం ప్రత్యేకంగా కృషి చేస్తుందని తెలిపారు. సీఎం ఆర్ ఎఫ్ ద్వారా ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న పేద కుటుంబాలకు ప్రభుత్వం అండగా నిలుస్తోందని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ ఉదయ్ కుమార్ డీసీసీ అధ్యక్షులు బట్టు కర్ణాకర్ మున్సిపల్ చైర్మన్ బుర్ర కొమురయ్య వైస్ చైర్మన్ అంబాల శ్రీనివాస్ కౌన్సిలర్లు అప్పం కిషన్ బొడ్డు అశోక్ తోట రంజిత్ నాయకులు లబ్ధిదారులు పాల్గొన్నారు.
