యాదాద్రి నృసింహున్ని దర్శించుకున్న హై కోర్టు జడ్జి తిరుమలా దేవి
నేటి ధాత్రి యాదగిరిగుట్ట:
శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి వారిని మంగళ వారం కుటుంబ సమేతంగా తెలంగాణ హై కోర్టు జడ్జి తిరుమలా దేవి దర్శించుకుని స్వామివారి గర్భగుడిలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ అర్చకులు వేదమంత్రాలతో ఆశీర్వదించారు. ఆలయ ఈవో ఐఏఎస్ అధికారి భవాని శంకర్ స్వామివారి చిత్ర పటం మహా ప్రసాదం లడ్డూను అందజేశారు.
