Hormuz Crisis Fears: Will Oil Prices Rise Globally?
ఆరు నెలలు హార్మూజ్ క్లోజ్!
భారత్‌లో పెట్రోల్ ధరల పెంపు?
అంతర్జాతీయంగా చమురు సెగలు మంటలు రేపుతున్నాయి. ఇజ్రాయెల్, అమెరికా-ఇరాన్ మధ్య మొదలైన యుద్ధం.. ఇప్పుడు మీ జేబులకు చిల్లు పెట్టబోతోంది. అవును.. మీరు విన్నది నిజమే! ప్రపంచానికే ఇంధనాన్ని సరఫరా చేసే అత్యంత కీలకమైన హర్మూజ్ జలసంధి ఇప్పుడు ఒక మృత్యుపాశంగా మారింది!”
”తాజా సమాచారం ప్రకారం.. హర్మూజ్ జలసంధి ఇప్పట్లో తెరుచుకునే సూచనలు కనిపించడం లేదు. ఎందుకో తెలుసా? ఇరాన్ సైన్యం అక్కడ అమర్చిన ‘సీ మైన్స్’! సముద్ర గర్భంలో దాదాపు 20కి పైగా శక్తివంతమైన గనులను ఇరాన్ పేర్చిందన్నది పెంటగాన్ రహస్య నివేదిక. అత్యంత ఆధునిక GPS టెక్నాలజీతో వీటిని అమర్చడం వల్ల.. ఏ నిమిషానికి ఏ నౌక పేలిపోతుందో తెలియక అగ్రరాజ్యం అమెరికా కూడా వణికిపోతోంది. వీటిని తొలగించడానికి కనీసం ఆరు నెలల సమయం పడుతుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.”
”ఇక మన భారత్ విషయానికి వస్తే.. పరిస్థితి మరింత ఆందోళనకరంగా ఉంది! ప్రస్తుతం తమిళనాడు, బెంగాల్ ఎన్నికల హడావుడిలో ఉన్నాం కాబట్టి ధరలు నిలకడగా ఉన్నాయి. కానీ, ఒక్కసారి ఎన్నికల ప్రక్రియ ముగిసిందా.. సామాన్యుడి నడ్డి విరగడం ఖాయం!
అంతర్జాతీయ మార్కెట్ లెక్కల ప్రకారం.. పెట్రోల్ లీటర్‌పై ఏకంగా 25 నుంచి 28 రూపాయలు పెరిగే అవకాశం ఉందట! అంటే.. ఒక్క పెట్రోల్ మాత్రమే కాదు, రవాణా చార్జీలు పెరిగి నిత్యావసర వస్తువుల ధరలు ఆకాశాన్ని తాకబోతున్నాయి.
కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే ఎక్సైజ్ డ్యూటీ తగ్గించినా.. అంతర్జాతీయంగా క్రూడాయిల్ ధరలు ఇలాగే పెరిగితే ఆ భారం మోయడం ఎవరికైనా కష్టమే. మరి ఈ చమురు సంక్షోభం నుంచి భారత్ ఎలా గట్టెక్కుతుంది? హర్మూజ్ గండం ఎప్పుడు గడుస్తుంది? వేచి చూడాల్సిందే!”
