నాగర్ కర్నూల్ జిల్లా ఐదు మండలాలకు సంబంధించినcmrf చెక్కుల పంపిణీ చేసిన ఎమ్మెల్యే రాజేష్ రెడ్డి గారు
నేటిదాత్రి ,నాగర్ కర్నూల్ జిల్లా
https://youtu.be/bYu-BREQags
నాగర్ కర్నూల్ పట్టణ ,మరియు బిజినపల్లి ,తాడూరు, తిమ్మాజీపేట తెలకపల్లి, మండలాలకు సంబంధించి ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీసులో 2 29 సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కుల పంపిణీ చేశారు
ఈ సందర్భంగా ఎమ్మెల్యే రాజేష్ రెడ్డి గారు మాట్లాడుతూ మా ప్రభుత్వానికి ప్రజల సంక్షేమమే ప్రాధాన్యం అందుకే అర్హులైన ప్రతి ఒక్కరికి ఈ పథకాలను అందించే బాధ్యత అధికారులదే ఎవరైనా పథకానికి దూరంగా ఉంటే వెంటనే దరఖాస్తు చేసుకోవాలని ఎలాంటి సమస్య వచ్చినా మీ ఎమ్మెల్యేగా నేను మీకు అండగా ఉంటానని పేర్కొన్నారు
ముఖ్యమంత్రి సహాయనిధి ద్వారా ప్రజలకు ఆర్థిక సాయం అందించడం ప్రభుత్వ ధ్యేయమని తెలిపారు
అనారోగ్యంతో బాధపడుతున్న వారు ఆర్థికంగా వెనుకబడిన కుటుంబాలకు ఇది ఎంతో ఉపయోగంగా ఉంటుందని పేర్కొన్నారు ప్రభుత్వ పథకాల గురించి ప్రజలకు పూర్తి అవగాహన కలిగి ఉండాలని పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో మార్కెట్ చైర్మన్ రమణారావు మున్సిపల్ చైర్మన్ తీగల సునీంద్ర వైస్ చైర్మన్ బాదం రమేష్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు జక్కరాజు మున్సిపల్ కౌన్సిలర్స్ పాల్గొన్నారు
