Narendra Damodardas Modi
`ఆకాశమంత వ్యక్తిత్వం.. ఎవరికీ అంతు చిక్కని చాణక్యం!
`దేశమంతా నలుదిశలా మారు మరోగుతున్న నమో మంత్రం.
`12 ఏళ్లుగా దేశమంతా వెలుగుతున్న ప్రజా కిరణం.

`25 సంవత్సరాలుగా పాలనాపెద్దగా సుదీర్ఘ ప్రయాణం.
`మోడీ రికార్డును బ్రేక్ చేయడం భవిష్యత్తుభారతం లో ఎవరికీ సాధ్యం కాదు.
`భారతవని ఉన్నంత వరకు ఈ రికార్డ్ పదిలం.

`అది ఒక్క నరేంద్రదామోదర్ దాస్ మోడీ కే సొంతం.
`మోడీ అనే పేరు చరిత్రలో చిరస్థాయిగా నిలిచే సంతకం.
`13 ఏళ్లపాటు గుజరాత్ ముఖ్యమంత్రిగా సేవలు!
`ఓటమి ఎరగని నాయకుడుగా రికార్డులు.
`మూడు సార్లు గుజరాత్ ముఖ్యమంత్రిగా గెలుపు.
`ఆ వెంటనే ప్రధానిగా మూడు సార్లు వరుస గెలుపులు.
`ఏడు సార్లు వరుసగా గుజరాత్ లో బీజేపీ గెలుపులు.
`దేశమంతా గుజరాత్ మోడల్ తో అభివృద్ధి పునాదులు.
`ప్రధానిగా దేశమంతా కాషాయ జెండా ఎగురవేసిన ఏకైక నాయకుడు.
`“మోడీ,అమిత్ షా” ద్వయం అంటేనే అదో రాజకీయ వ్యూహం.
`ఆ ద్వయాన్ని ఎదుర్కొలేక గిలగిల లాడుతున్న కాంగ్రెస్.
`ఇంకా 25 ఏళ్ళు వుంది.. మరింత ముందుంది అని చెప్పిన ఏకైక నాయకుడు.
`ఇంకా రెండు సార్లు ప్రధానిగా పని చేయగల ఆరోగ్యం మోడీ సొంతం.
`దేశ ప్రజల ఆశీర్వాదమే మోడీ బలం.
`ఇప్పటికే విశ్వ గురువుగా ప్రపంచమే కొనియాడుతున్న నాయకత్వం.
హైదరాబాద్, నేటిధాత్రి:
జనం నమ్మకాన్ని నిలబెట్టే వారే నాయకుడు. జనం ఆకాంక్షలకు అనుగుణంగా పాలన సాగించేవారే పాలకులు. అలా జనం గుండెల్లో చెరగని స్ధానం సంపాదించుకొని 25 సంవత్సరాలుగా పాలకుడుగా కొనసాగుతున్న ఏకైక నాయకుడు, పాలకుడు ప్రదానమంత్రి నరేంద్ర మోడీ. దేశ ప్రజలంగా విశ్వగురువుగా కీర్తించుకుంటున్న ఏకైక నాయకుడు కూడ ప్రధాని నరేంద్ర మోడీ. దేశానికి స్వాతంత్య్రం తెచ్చిన నాయకులలో ఏ ఒక్కరినీ ప్రజలు అంత గొప్పగా పిలుచుకోవడం లేదు. స్వాతంత్య్రం వచ్చిన ఇన్నేళ్ల తర్వాత దేశం ప్రపంచ దేశాలకు దిక్సూచీగా మార్చిన నాయకుడిగా లోకమే గర్వపడుతున్న నాయకుడు ప్రధాని నరేంద్ర మోడీ. మన దేశంలోనే ఎవరెస్టు శిఖరమంత ఎత్తు ఎదిగిన ఒకే ఒక్కడు ప్రదాని నరేంద్ర మోడీ. తరతరాలకు ఆదర్శంగా నిలిచేలా తన పాలనా విధానాన్ని ఒక సౌధంలా నిర్మించి నాయకుడు కూడా మోడీయే కావడం విశేషం. ఇన్ని సుగుణాలు కలిగిన నాయకుడిగా దేశమంతా చూస్తున్న ఒకే ఒక్క నాయకుడు నరేంద్ర మోడీ. అందుకే గత ఇరవై ఐదు సంవత్సరాలుగా నిర్విరామంగా, నిరంతరంగా అటు నాయకుడుగా, ఇటు పాలకుడిగా తన కర్తవ్యం నిర్వహిస్తున్న ఏకైక ప్రజాపెన్నిది నరేంద్ర మోడీ. ఆయనది ఆకాశమంత వ్యక్తిత్వం. అందుకే దేశ ప్రజలకు నరేంద్ర మోడీ నాయకత్వం అంత ఆరాధనత్వం. సహజంగా నాయకులకు జేజేలు కొట్టడం వేరు. కాని జనం ఆదార్యడిగా కొలుస్తున్న నాయకుడు నరేంద్ర మోడీ. ఇక రాజకీయంగా ఆయన వేసే అడుగులు ఎవరికీ అంతు పట్టవు. ఆయన వ్యూహాలు చేధించే నాయకుడు దేశంలోనే లేరు. గుజరాత్ ముఖ్యమంత్రిగా ఆయన 13 సంవత్సరాల పాటు పాలించారు. అక్కడి నుంచి నేరుగా దేశ ప్రదానిగా పాలకుడిగా మారారు. విశ్వ విజేతను విశ్వ గురువుగా కొనియాడబడుతున్నారు. అది కేవలం బిజేపి పార్టీ నాయకులే కాదు, అన్ని వర్గాల ప్రజలు ఆయను విశ్వగురువుగా గుర్తిస్తున్నారు. కీర్తిస్తున్నారు. మోడీ తప్ప దేశాన్ని కాపాడే నాయకత్వం మరొక పార్టీకి గాని, నాయకుడికి గాని లేదని ప్రజలు పన్నెండేళ్ల క్రితం తీర్మానించుకున్నారు. నాటి నుంచి నరేంద్ర మోడీ మాత్రమ కావాలని ఎన్నుకుంటున్నారు. పాలకుడిగా చూసుకుంటున్నారు. ఆ పాలకుడే మన ప్రాణాలకు రక్ష అనుకుంటున్నారు. అందుకే గుజరాత్‌కే పరిమితమైన బిజేపిని దేశ మంతా విస్తరింపజేసిన ఏకైక నాయకుడు నరేంద్రమోడీ. ఒకప్ప్పుడు కొన్ని రాష్ట్రాలకే పరిమితమైన బిజేపి ఇప్ప్పుడు దేశమంతా కాషాయ మయం చేసిన నాయకుడు నరేంద్ర మోడీ. ఎవరూ ఊహించనంత ఎత్తులో బిజేపిని నిలబెట్టారు. భవిష్యత్తు తర తరాలకు చెక్కు చెదరని పునాదులు బిజేపికి వేస్తున్నారు. దేశమంతా వినిపించే ఏకైక నామం నరేంద్ర మోడీ. దేశమంతా కొలిచే ఏకైక నాయకుడు నరేంద్ర మోడీ. ఏ రాష్ట్రంలోనా సరే బిజేపి గెలవాలంటే, గెలిచినా బిజేపి పాలించాలంటే ప్రజలు చూసి ఎన్నుకునేందుకు చూసే ఏకైక దారి నరేంద్ర మోడీ. అందుకే గుజరాత్ నుంచి ఆయన నేరుగా దేశ నాయకుడిగా ఎదిగారు. గుజరాత్ ముఖ్యమంత్రిగా వున్న సమయంలో ఆయన రాష్ట్ర అభివద్దికి వేసిన దారులు దేశమంతా చూసింది. గుజరాత్ మోడల్ అన్ని రాష్ట్రాలు కావాలని కోరుకున్నాయి. చివరికి దేశానికే నరేంద్ర మోడీ నాయకత్వం కావాలిన కోరుకున్నారు. అందుకే 2014 ఎన్నికల్లో మొదటిసారి బిజేపి సంపూర్ణ మెజార్టీతో విజయదుందుబి మోగించింది. అక్కడ మొదలైన విజయయాత్రలు ఇక పెరుగుతూనే వున్నాయి. 2019 ఎన్నికల్లో తిరుగులేని శక్తిగా బిజేపి మారింది. ఎదరులేని నాయకుడిగా మోడీ ఎదిగారు. మోడీకి ఎదరు నిలబడి రాజకీయాలు చేసేవారు కరువయ్యారు. ఎవరెన్ని ప్రచారాలు చేసినా, ఎన్ని రకాలుగా ప్రజల ఆలోచనల్లో మార్పులు తీసుకురావాలని చూసినా కుదలేదు. దేశ ప్రజల గుండెల్లో వున్న ఏకైక నాయకుడుగా కొలువబడుతున్న నాయకుడు ప్రధాని మోడీ. దాంతో ఏ పార్టీ ఆయనను కదలించలేపోతున్నాయి. గత ఎన్నికల ముందు ప్రతిపక్షాలు చేసిన కొంత అరాజకీయం వల్ల బిజేపికి కొంత మెజార్టీ తగ్గింది. కాని మోడీ చరిష్మా ఏ మాత్రం తగ్గలేదు. పైగా మోడీలో మరింత కసి పెంచింది. అందుకే ఆ తర్వాత జరిగిన రాష్ట్రాల ఎన్నికల్లో బిజేపి అనూహ్య విజయాలే కాదు, అపూర్వ విజయాలు అందుకుంటూ వచ్చింది. మూడు రాష్ట్రాలలో హాట్రిక్ విజయాలను సొంతం చేసుకున్నది. డిల్లీ రాష్ట్రాన్ని కూడా బిజేపి వశం చేసుకున్నది. ఇలా అప్రతిహాత విజయాలు చూసిన నాయకుడు దేశంలోనే ఎవరూ లేరు. పాలకుడిగా ఏకంగా 8వేల, 9వందల, 37 రోజులు పూర్తి చేసుకున్న నాయకుడిగా నరేంద్ర మోడీ రికార్డులకెక్కారు. అయితే ముఖ్యమంత్రిగా సిక్కిం మాజీ ముఖ్యమంత్రి పవన్ కుమార్ 24 సంవత్సరాలకు పైగా పూర్తి చేసుకున్నారు. తర్వాత రికార్డు పశ్చిమబెంగాల్ సిఎంగా పనిచేసిన మాజీ దివంగత ముఖ్యమంత్రి జ్యోతిబసు సుమారు 24 సంవత్సరాలు పనిచేశారు. ప్రధానిగా నరేంద్ర మోడీ సరికొత్త రికార్డు సష్టించేదుకు రాజకీయ పాలనా ప్రయాణం సాగిస్తున్నారు. దేశానికి తొలి ప్రధాని జవహార్‌లాల్ నెహ్రూ సుమారు 17 సంవత్సరాల పాటు పనిచేశారు. తర్వాత 15 సంవత్సరాలకు పైగా ఇందిరాగాంధీ ప్రదానిగా పనిచేశారు. మూడోసారి ప్రధాని అయిన మోడీ ఈ సారి పాలనా సమయం పూర్తయ్యే సరికి ఇందిరాగాందీ రికార్డును సమం చేస్తారు. వచ్చే ఎన్నికల్లో మళ్లీ గెలిస్తే నెహ్రూ రికార్డును కూడా దాటేస్తారు. అందుకే ఈ మధ్య ఆయన చేసిన కొన్ని వ్యాఖ్యలు బాగా వైరల్ అయ్యాయి. తనుకు ఇప్ప్పుడు 75 సంవత్సరాలు. ఇంకా 25 సంవత్సరాలు ముందున్నాయి అన్నారు. అంటే ఇంకా కనీసం ఆయన రెండు సార్లు ప్రధానిగా పనిచేసేందుకు కూడా సిద్దంగా వున్నట్లు చెప్పకనే చెప్పారు. మరో రెండు సార్లు మోడీ ప్రధాని అయితే ఆయన రికార్డు కొన్ని వేల సంవత్సరాల వరకు కూడా పదిలంగానే వుంటుందని అనుకోవాలి. ఆ తర్వాత కూడా మోడీ రికార్డును తిరగరాసే నాయకుడు వస్తాడన్న నమ్మకం లేదు. ఇంత సుధీర్ఘ కాలం పాటు పాలకుడిగా అవకాశం రావడం అనేది సామాన్యమైన విషయం కాదు. దేవుడు తనని ఏదో ఒక కార్యం మీద పంపించాడని మోడీ చెప్పినట్లే నిజం కూడా కావొచ్చు. లేకుంటే ఒక నాయకుడికి ఇంత ఛరిష్మా ఏమిటి? ఆయన అంటే దేశ ప్రజలు ఇంతగా ఆదరించడమేమిటి? రికార్డులన్నీ ఆయనే తిరగ రాయడమేమిటి? ఇంత వయసులో కూడా నవయువకుడిగా వుండడం ఏమటీ? ఏదో ఒక తెలియని శక్తి ఆయనను నడిపిస్తుందని చెప్పడంలో సందేహం లేదు. అది సామాన్యులకు సాద్యమయ్యేది కాదు. ప్రధాని మోడీకి సన్నిహితుడు, స్నేహితుడిగా వున్న అమిత్‌షాతో కలిసి వేసే రాజకీయ పాచికలకు ఎదురుండదు. తిరుగుండదు. దేశ ప్రజల ఆశీర్వాదమే మోడీ బలం. మోడీ నాయకత్వమే దేశానికి ధైర్యం.
