New Weighbridge Inaugurated in Parakala
ధర్మకాంట ప్రారంభించిన చల్లా ధర్మారెడ్డి
పరకాల,నేటిధాత్రి
దామెర మండలం దుర్గంపేట గ్రామ ప్రధాన రహదారిపై నూతనంగా ఏర్పాటు చేసిన డీవీఆర్ ధర్మకాంటను బుధవారం రోజున పరకాల మాజీ ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి ప్రారంభించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతులకు, వ్యాపారులకు ధర్మకాంట ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని తెలిపారు.గ్రామీణ ప్రాంతాల్లో ఇలాంటి సదుపాయాలు పెరగడం వల్ల వ్యవసాయ ఉత్పత్తుల తూకం ప్రక్రియ సులభతరం అవుతుందని అన్నారు.స్థానిక ప్రజలు, రైతులు ఈ ధర్మకాంటను సద్వినియోగం చేసుకోవాలని ఆయన సూచించారు.ఈ కార్యక్రమంలో నాయకులు,కార్యకర్తలు,గ్రామ ప్రజలు పాల్గొన్నారు.
