కుట్టు శిక్షణతో ఉపాధి అవకాశాలు
జడ్పీ సీఈఓ గూడూరు రామ్ రెడ్డి
దుగ్గొండి,నేటిధాత్రి:
మహిళలకు కుట్టు శిక్షణతో ఉపాధి అవకాశాలు మెండుగా ఉంటాయని జడ్పీ సీఈఓ, ఇంచార్జి డీఆర్డీఓ గూడూరు రామ్ రెడ్డి అన్నారు.దుగ్గొండి మండలంలోని ప్రశాంతి మండల సమాఖ్య కార్యాలయంలో నిర్వహిస్తున్న కుట్టు శిక్షణ కార్యక్రమాన్ని జడ్పీ సీఈఓ, ఇంచార్జి డీఆర్డీఓ గూడూరు రామ్ రెడ్డి, అదనపు డీఆర్డీఓ కందురు రేణుక దేవి, మండల అభివృద్ధి అధికారి లెక్కల అరుంధతి సందర్శించారు. ఈ సందర్భంగా శిక్షణ పొందుతున్న సభ్యులను ఉద్దేశించి జడ్పీ సీఈఓ మాట్లాడుతూ శిక్షణను పూర్తిస్థాయిలో నేర్చుకుంటే స్కూల్ యూనిఫార్మ్స్తో పాటు ఇతర సంస్థల యూనిఫార్మ్స్ కుట్టే అవకాశాలు కల్పిస్తామని తెలిపారు. అవసరమైన రుణ సదుపాయం కూడా అందించేందుకు చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో ఎన్ఏసీ కోఆర్డినేటర్ రవీందర్, మాస్టర్ ట్రైనర్లు సంధ్యరాణి, రమ, కవిత, ఏపీఎం ఈద రమేష్ కుమార్, సీసీలు కవిత, శారద, దుగ్గొండి మరియు నల్లబెల్లి మండల సభ్యులు, మండల సమాఖ్య సిబ్బంది అరుణ, రంజిత్ తదితరులు పాల్గొన్నారు.
