Dog Bite Cases Rise in Jharasangam
ఝరసంగం మండలంలో కుక్క కాటు కేసులు పెరిగాయి;
◆”-: సూచించిన మండల వైద్య అధికారి రమ్య జాగ్రత్తలు వహించలి.
జహీరాబాద్,నేటి ధాత్రి:
ఝరసంగం మండలంలో కుక్కకాటు కేసులు నమోదవుతున్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని మండల వైద్య అధికారి రమ్య సూచించారు. మార్చి 17 నాటికి మొత్తం 19 మంది కుక్క కాటుకు గురై ప్రభుత్వ ఆసుపత్రిలో టీకా తీసుకున్నారని ఆమె ఒక ప్రకటనలో వెల్లడించారు. గ్రామాల్లో ఎవరైనా కుక్క కాటుకు గురైతే, నిర్లక్ష్యం లేకుండా వెంటనే సమీపంలోని ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్లి యాంటీ-రాబిస్ టీకా వేయించుకోవాలని ఆమె పేర్కొన్నారు. సకాలంలో చికిత్స తీసుకోవడం వల్ల రేబీస్ వంటి ప్రమాదకరమైన వ్యాధులను నివారించవచ్చని ఆమె అన్నారు. అలాగే, ప్రజలు తమ ఆరోగ్యం విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలని, చిన్న గాయాలైనా వెంటనే వైద్య సలహా తీసుకోవాలని వైద్య అధికారి రమ్య విజ్ఞప్తి చేశారు,
