BJP Demands Congress to Fulfill Promises
కాంగ్రెస్ ప్రభుత్వం.. మోసపూరిత హామీలు ఇచ్చింది.
మండల బీజేపీ అధ్యక్షులు గోపాల్ నాయక్.
బాలానగర్ /నేటి ధాత్రి
కాంగ్రెస్ ప్రభుత్వం మోసపూరిత హామీలు ఇచ్చి వాటిని అమలు చేయకుండా ప్రజలను మభ్యపెడుతోందని ఆరోపిస్తూ వెంటనే ఇచ్చిన హామీలను అమలు చేయాలని డిమాండ్ చేస్తూ.. మహబూబ్ నగర్ జిల్లా బాలానగర్ మండల బీజేపీ నాయకులు బాలానగర్ డిప్యూటీ తహసీల్దార్ లిఖిత రెడ్డి గారికి మెమొరాండం సమర్పించారు. ఈ సందర్భంగా మండల బీజేపీ అధ్యక్షుడు గోపాల్ నాయక్ మాట్లాడుతూ.. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను కాంగ్రెస్ ప్రభుత్వం వెంటనే అమలు చేయాలని కోరారు. ప్రజలను మాటలతో మోసం చేయడం మానుకుని హామీలను నెరవేర్చాలని డిమాండ్ చేశారు. హామీలు నెరవేర్చకపోవడంతో ప్రజలు కాంగ్రెస్ ప్రభుత్వం పై అసహ్యం వ్యక్తం చేస్తున్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఈ కార్యక్రమంలో మండల ప్రధాన కార్యదర్శి సందీప్, కార్యదర్శి సాయి, తిరుపతి, నరేష్ తదితరులు పాల్గొన్నారు.
