Subsidized Gypsum Distribution for Farmers
రైతులకు రాయితీపై జిప్సం పంపిణీ
భూగర్భ నేలల్లో అల్యూమినియం విష ప్రభావం తగ్గించడం ద్వారా మొక్క వేరు పెరుగుదలను మెరుగుపరిచి పంట దిగుబడిని పెంచుతుంది. మొగుళ్ళపల్లి నేటి ధాత్రి జిప్సం అనేది సోడిక్/లవణ(సౌడు) నేలలను సరిచేయడానికి, నేల నిర్మాణాన్ని మెరుగుపరచడానికి మరియు pH ను గణనీయంగా పెంచకుండా కాల్షియం మరియు సల్ఫర్‌ను సరఫరా చేయడానికి ఉపయోగించే అత్యంత ప్రభావవంతమైన, తక్కువ ఖర్చుతో కూడిన నేల సవరణ. ఇది నీటి చొరబాటును పెంచుతుంది, క్రస్టింగ్ తగ్గిస్తుంది, కోతను తగ్గిస్తుంది మరియు భూగర్భ నేలల్లో అల్యూమినియం విషప్రభావం తగ్గించడం ద్వారా మొక్క వేరు పెరుగుదలను మెరుగుపరిచి పంట దిగుబడిని పెంచుతుంది.
90 శాతం రాయితీ పై జిప్సం రైతులకు పంపిణీ చేయడానికి అవకాశం కలదు. చౌడు భూములలో జిప్సం వేసుకోవడం వలన చౌడు తీవ్రత తగ్గి పంటల దిగుబడి పెరుగును. ఒక టన్నుకు మొత్తం ధర 5660 రూపాయలు, ఇందులో 90% రాయితీ పోను 10శాతం అనగా ఒక టన్నుకు 566రూపాయలు రైతులు చెల్లించాలి. ఈ జిప్సం 50 కిలోల బస్తాలలో పంపిణీ చేయడం జరుగుతుంది.
ఇందులో సన్న, చిన్న కారు మరియు మహిళా రైతులకు మొదటి ప్రాధాన్యత ఇవ్వబడును. జిప్సం కావలసిన రైతులు ఒక గ్రూపుగా ఏర్పడి 20టన్నులకు రైతు వాటా డీడీ చెల్లించినచో ఆ గ్రామానికి జిప్సం లోడు సరఫరా చేయడం జరుగుతుంది. జిప్సం కావలసిన రైతులు వారి యొక్క పూర్తి వివరాలతో మీ యొక్క క్లస్టర్ వ్యవసాయ విస్తరణ అధికారిని(ఏ ఈ ఓ )లేదా మండల వ్యవసాయ అధికారిని(ఎం ఏ ఓ)సంప్రదించి రాయితీ పై జిప్సంను పొందాలని వ్యవసాయ శాఖ ద్వారా పత్రికా ముఖంగా తెలియజేయడం జరుగుతుంది.
