DRDO Inspects MGNREGA Works in Lakshmipuram
లక్ష్మీపురంలో చెరువు పూడిక పనులను పరిశీలించిన డీఆర్డీఓ నాగ పద్మజ
ఉపాధి కూలీలకు సౌకర్యాలు, ఓఆర్ఎస్ ప్యాకెట్ల పంపిణీ
నర్సంపేట, నేటిధాత్రి:
దుగ్గొండి మండలంలోని లక్ష్మీపురం గ్రామపంచాయతీలో ఉపాధి హామీ పథకంలో భాగంగా చేపట్టిన ఊర చెరువు పూడికతీత పనులను డీఆర్డీఓ నాగ పద్మజ మంగళవారం పరిశీలించారు.పని ప్రదేశాన్ని సందర్శించిన ఆమె కూలీలతో మాట్లాడి వర్క్ సైట్లో కల్పిస్తున్న సౌకర్యాలను పరిశీలించారు. పనిచేసే వారికి ఓఆర్ఎస్ ప్యాకెట్లను అందజేశారు. ఎండ తీవ్రత దృష్ట్యా నీడను మరింత ఎక్కువగా ఏర్పాటు చేయాలని సూచించారు. ఉపాధి పనులకు ఎక్కువ మంది హాజరయ్యేలా ప్రతి 40 మందికి ఒక మేట్‌ను నియమించాలని అధికారులను ఆదేశించారు.ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ లెక్కల అరుంధతి, గ్రామ సర్పంచ్, ఏపీవో డి.శ్రీనివాస్, ఈసీ బి.రాజు, టీఏ మౌనిక, పంచాయతీ కార్యదర్శి కొండల్ రెడ్డి, ఫీల్డ్ అసిస్టెంట్ రమేష్, ఐకేపీ వీవోఏలు తదితరులు పాల్గొన్నారు.
