Medchal-Malkajgiri DMHO scams
`వృత్తి వైద్యం..ప్రవృత్తి లంచం!?
`వైద్య వృత్తికే అవమానం… ప్రభుత్వ కొలువుకే కలంకం?
`అక్రమ సంపాదనతో సినిమా వ్యాపారం!
`మేడ్చల్ మల్కాజిగిరి డిఏం అండ్ హెచ్ ఓ నిర్వాకం!?
`ఉమాగౌరీ..లంచాలే గురి?
`ఆమె డాక్టర్..ఆయన ప్రొడ్యూసర్!
`జిల్లా వైద్య ఆరోగ్యశాఖలో అవినీతి తిమింగలం???
`సినిమా తియ్యాలంటే ఆ మాత్రం వసూళ్లు తప్పని సరి?
`పుర్రెకో బుద్ది జిహ్వకో రుచి!
`నేను సినిమా తియ్యాలే.. మీరు లంచాలియ్యాలే!
`వైద్య ఆరోగ్య శాఖలో జిల్లా ఉన్నతాధికారి!
`ఆసుపత్రులకు ఫోన్ చెయ్యాలే.. అనుచరులను పంపాలే!
`మేడ్చల్.. మల్కాజిగిరి ఆమె చేతుల్లో వుంది మరి!
`సినిమా తీయాలంటే పెట్టుబడి కావాలి?
`కోట్లలో పెట్టుబడి పెట్టి సినిమా తీయాలి!
`ఆమె ఎంత చెబితే అంత ముట్ట చెప్పాలే?
`ఆమె అనుచరులు అడిగినంత ఇవ్వాల్సిందే?
`అడిగినంత లంచం ఇవ్వకుంటే ఆసుపత్రి మూసేస్తాం!
`మేడ్చల్.. మల్కాజిగిరి జిల్లాలో ప్రైవేట్ ఆసుపత్రుల నుంచి భారీగా వసూళ్లు?
హైదరాబాద్, నేటిధాత్రి:
మన సమాజంలో ప్రతి వ్యక్తికి వత్తి, ప్రవత్తి అనే రెండు అంశాలుంటాయి. వత్తి అనేది ఉద్యోగ ధర్మం. వత్తి ధర్మం. ప్రవత్తి అనేది తన వ్యక్తిగతమైంది. అది సమాజికమైంది కావొచ్చు. సంతోషం కోసం ఎంచుకునేది కావొచ్చు. కాకపోతే వత్తిని ప్రవత్తికి జోడించడం ఎవరికీ అభ్యంతరం వుండదు. కాని పవత్తిని వత్తిని అన్వయించడం అనేది స్వార్ధంతో కూడుకున్నదౌతుంది. సమాజాన్ని మోసం చేయడమౌతుంది. అవినీతికి ఆస్కారమిస్తుంది. అవినీతి కోసం వత్తిని ఫణంగా పెట్టడమౌతుంది. అలాంటిదే ఈ వార్త. మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాకు చెందిన డిఎంఅండ్ హెచ్వో తన వత్తిని ప్రవత్తి కోసం వినియోగిస్తుందన్న వార్తలు అనేకం వున్నాయి. ఆరోపణలున్నాయి. అనేక విమర్శలు నిత్యం తలెత్తుతూనే వున్నాయి. ఆమె వత్తిపరంగా ఒక వైద్యురాలు. ప్రస్తుతం ఆమె వత్తిలోనే ఉన్నతమైన అదికారిగా కొనసాగుతున్నారు. ఆమె ప్రవత్తి సినిమాల నిర్మాణం. ప్రవత్తిపరంగా ఆమెకు కళాపోషణ వుండడంతో తప్ప్పు లేదు. ఆమె కళలకు ప్రాదాన్యతనివ్వడం తప్ప్పుకాదు. ఆమె భర్త సినిమా నిర్మాత? అంటే వ్యాపారం. సినిమా నిర్మాణమనేది డబ్బుతో కూడుకున్న వ్యవహారం. ఆ సినిమాల కోసం పెద్దఎత్తున సొమ్ము కావాలి. ఆ సినిమాలు తీయడానికి ఉమాగౌరి తన ఉద్యోగాన్ని అడ్డం పెట్టుకొని, ఆసుపత్రుల నుంచి లంచాలు వసూలు చేస్తున్నారనేది ఆమె మీద అనేక ఆరోపణలు వున్నాయి. తీసిని సినిమాలు ఏమిటో ఎవరికీ తెలియదు. ఎన్ని సినిమాలు తీశారో తెలియదు. ఎన్ని విడుదలయ్యాయో తెలియదు. కాని సినిమా నిర్మాత అనే ప్రచారం వుంది. సినిమాలు నిర్మాణం చేస్తున్నట్లు వార్తలున్నాయి. సినిమాలు నిర్మానం చేయాలంటే డబ్బు కావాలి. అది కూడా పెద్దఎత్తున సొమ్ము కావాలి. అందుకు డిఎంఅండహెచఓగా విదులు నిర్వర్తిస్తున్న ఉమాగౌరి తన వత్తి అడ్డం పెట్టుకొని లంచాలు వసూలు చేస్తూ సినిమా నిర్మానంకోసమంటూ చెబుతున్నట్లు కూడా అంటున్నారు. తెలంగాణలోనే మేడ్చల్. మల్కాజిగిరి అనేది నగరంలో భాగమైన పెద్ద జిల్లా. హైదరాబాద్ రంగారెడ్డి జిల్లాలోని కొన్ని అంత్యంత ఖరీదైన ప్రాంతాలు కూడా ప్రస్తుతం ఆ జిల్లా పరిధిలో వున్నాయి. ఆ జిల్లా పరిధిలో అనేక ప్రైవేటు ఆసుపత్రులున్నాయి. ఆ ఆసుపత్రులు ప్రజలకు మెరుగైన వైద్యం చేస్తున్నాయా? లేదా? ప్రజలను మోసం చేస్తున్నాయా? లేక ప్రజలను పీడించు తింటున్నాయా? ఆ జిల్లాలో నకిలీ వైద్యులున్నారా? నకిలీ వైద్యులు ఆసుపత్రులు నడుపుతున్నారా? లేక ఆసుపత్రులు ఏమైనా దారుణాలకు ఒడిగడుతున్నాయా? అనైతిక వైద్యం సాగిస్తున్నాయా? ఆసుపత్రులకు అన్ని అనుమతులున్నాయా? సరైన మౌలిక సదుపాయాలున్నాయా? మందుల విషయంలో విలువలు పాటిస్తున్నారా? లేక నకిలీ మందులును రోగులకు అంటగడుతున్నారా? ఇలాంటి అనేక అంశాలను చూసుకుంటూ ప్రజలకు మెరుగైన వైద్యం అందేలా చూసుకోవడం డిఎంఅండ్హెచఓ కర్తవ్యం. ఈ బాద్యతలే ఉమాగౌరికి కాసుల పంట పండించేలా మలుచుకుంటోంది. అన్ని రకాల సౌకర్యాలున్నా సరే…మెరుగైన వైద్యాలు అందిస్తున్నా సరే..సమాజంలో మంచి పేరు వున్న ఆసుపత్రులైనా సరే..ఆమెకు ýంచాలు సమర్పించాల్సిందే? ఇది ఆ జిల్లా పరిధిలో వున్న అనేక ఆసుపత్రుల నిర్వాహకులు చెబుతున్న మాట. అంతే కాదు ఆమె ఎంత ఇవ్వాలంటే అంత ముట్ట జెప్పాల్సిందే. లేకుంటే చర్యలు తప్పవని నోటీసులు ఇస్తారు. ఆసుపత్రిని సీజ్ చేస్తామని బెదిరిస్తారు? దాంతో విదిలేక, చెప్ప్పుకునే దిక్కులేక ఆసుపత్రులు కూడా డిఎంఅండ్హెచఓ అడిగినంత ముట్ట జెఫ్ప్పుతున్న ఆసుపత్రులు అనేకం వున్నాయి. పైగా ఒక్కసారి కాదు, రెండు సార్లు కాదు, ఎన్ని సార్లు ఆమె డబ్బులు పంపమని చెబితే అన్ని సార్లు పంపాల్సిందే. లేకుంటే ఇబ్బందులు పడాల్సిందే? అందుకే ఆసుపత్రుల నిర్వాహకులు కూడా అలా డబ్బులు సమకూర్చుతున్నారు. ఉమా గౌరి భర్త ఆ సంపాదనను సినిమా నిర్మాణానికి ఖర్చు చేస్తున్నట్లు చెప్ప్పుకుంటున్నారు. ఆసుపత్రులకు కూడా తాము సినిమా తీస్తున్నాం..డబ్బులు కావాలి. అని కూడా ఆమె చెబుతుందని కూడా అంటున్నారు. నిజానికి ఆమె డిఎంఅండ్హెచఓ అనే ఉద్యోగానికి అర్హురాలు కాదనే విమర్శలు కూడా వున్నాయి. ఆమె సవిల్సర్జన్ కాదు. డిఎమఅండ్హెచఓ ఉద్యోగానికి ఖచ్చితంగా సివిల్ సర్జన్ అయి వుండాలి. కాని ఆమెకు ఆ అర్హత లేదు. అయినా ఆమె పూర్తి స్ధాయి డిఎంఅండ్హెచఓ కాదు. కేవలం ఇన్చార్జి మాత్రమే. దీపముండగానే ఇల్లు చక్కదిద్దుకోవాలనే సామెతను నిజం చేస్తున్నట్లున్నారు. అందుకే ఇష్టానుసారం లంచాలు వసూలు చేస్తున్నారు? ఆమె నిర్వర్తించాల్సిన విధి వేరు. ఆమె చేస్తున్న ఉద్యోగం వేరు. ఏడిపిహెచఓ అనేది ఆమె చేయాల్సిన ఉద్యోగం. అంటే అదనపు జిల్లా ప్రజా ఆరోగ్య అదికారి. సినియర్ ప్రజా ఆరోగ్య అదికారిగా జిల్లా పరిధిలో వివిధ ప్రజారోగ్య కార్యక్రమాలు నిర్వహించాలి. కార్యకలాపాల ప్రణాళికలు రచించాలి. పర్యవేక్షించాలి. అంటే డిఎంఅండ్హెచఓకు సహకరించాలి. ఇదీ ఉమాగౌరీ చేయాల్సిన బాద్యత. ఆ బాద్యతను ఆమె పక్కన పెట్టారు. ఇన్చార్జి డిఎంఅండ్హెచఓగా విధులు నిర్వహిస్తూ, వసూళ్ల కార్యక్రమం నిర్వహిస్తున్నారని అంటున్నారు. పైగా ఆమె తన జీతంకోసం కోర్టును ఆశ్రయించారు. కోర్టు తీర్పు కూడా ఆమె జీతానికి సంబంధించి మాత్రమే. కాని ఆమె తప్ప్పుడు ప్రచారం చేసుకుంటూ తనకు అనుకూలంగా తీర్పు వచ్చిందని చెప్ప్పుకుంటున్నారని కూడా అంటున్నారు. 142జివో అనేది ఇంకా అమలులో లేదు. కాని అమలులోని జీవో పేరు చెప్ప్పుకొని పబ్బం గడుపుకుంటున్నారు అని వైద్య శాఖలోనే చెప్ప్పుకుంటున్నారు. కోర్టు ఈ విషయంలో ఉమా గౌరీ ఎందుకు అర్హురాలు కాదో చెప్పాలని కోర్టు అడిగిందే తప్ప, ప్రమోషన్ ఇవ్వాలని ఆదేశాలు జారీ చేయలేదు. అయినా ఆమె ఇన్ఛార్జీ డిఎంఅండ్ హెఛఓ అయ్యారు. అందుకు అనేక కారణాలు కనిపిస్తున్నాయి. కాకపోతే ఉమాగౌరికన్నా అర్హులు అనేక మంది వున్నారు. కాని ఆమెను కాపాడుతున్నది కేవలం కులమే అని కూడా అర్హులైన వాళ్లు చెబుతున్నారు. కులం గుణానికి పనికి రాకపోయినా, పదవులకు , అర్హత లేకున్నా అదికారాలకు పనికొస్తుందని మరోసారి ఉమా గౌరి విషయంలో రుజువైందంటున్నారు. ఉన్నతకులమైతే చాలు అర్హతలన్నీ పక్కకు పోతాయని నిరూపనైందంటున్నారు. కులమే అర్హతగా పదువులు పరుగెత్తుకుంటూ వస్తాయని ఈ విషయంలో కూడా తేలిపోయిందని అంటున్నారు. ఉన్నతకులమైతే చాలు ప్రమోషన్లకు కూడా అర్హత అవసరం లేదని అర్ధం చేసుకోవచ్చు. కూటి కోసం కోటి విద్యలు అనేది పాత మాట. ఇప్ప్పుడు కోట్లు సంపాదించడం కోసం కూటి విద్యలు అనేది కొత్త మాట. ఉద్యోగం అంటేనే ప్రజా సేవ. ప్రజా సేవకులు. కాని ఉద్యోగమంటే అదికారమనే పరిస్దితికి చేరుకుంటున్నారు. ఉద్యోగం అదికారం చెలాయించేందుకు అనే దక్పధరంలోకి వెళ్తున్నారు. ప్రజా సేవ గాలికి వదిలేసి, తమ వ్యక్తిగత ఎదుగదల కోసం వినియోగుకుంటున్నారనేది ఈ కథనంతో తేటతెల్లమౌతోంది. ఎలాగైనా కోట్లు సంపాదించాలి. ఎన్ని అడ్డదారులైనా వెతకాలి? అడ్డమైన దారులు ఎన్నైనా తొక్కాలి? ఎంతమందినైనా బెదిరించాలి? ఎలాగైనా మోసం చేయాలి? అవతలివారిని ఎంతైనా గోస పెట్టాలి. అధికారం చేతిలో వుంటే చాలు..పెద్ద కుర్చీలో కూర్చొని సేవ చేస్తే నాలుగు రాళ్లు రావు. ఈ కుర్చీకి న్యాయం చేస్తూపోతే రూపాయి రాదు? కుర్చి పేరు చెప్పి బెదిరిస్తే చాలు? వేలకు వేలు, లక్షలకు లక్షలు వచ్చి పడతాయి? కోట్లు కూడుతాయి? అని ఆలోచించే కుట్రల విద్యలే ఇప్ప్పుడు కావాలి? అనే ధోరణితో కొంత మంది అదికారులు వ్యవహరిస్తున్నారు. అందుకు ఉమాగౌరీ మినహాయింపు కాదని సొంత శాఖ ఉద్యోగులే అంటున్నారు. ఈ విషయం సాక్ష్యాత్తు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వరకు కూడా వెళ్లినట్లు విశ్వసనీయమైన సమచారం. ఈ మధ్య జరిగిన క్యాబినేట్ సమావేశంలో కూడా ఈ విషయం ప్రస్తావనకు వచ్చినట్లు కూడా తెలుస్తోంది. ఉమాగౌరినీ తొలగించక ఎందుకు ఉపేక్షిస్తున్నట్లు, కాలయాపన చేస్తున్నట్లు అని కూడా వైద్య శాఖ మంత్రిని కూడా సిఎం. ప్రశ్నించినట్లు కూడ తెలుస్తోంది. అయినా ఉమా గౌరీ తన తీరులో ఏ మాత్రం మార్పు రావడం లేదని కూడా చర్చించుకుంటున్నారు. ఎలాగూ ఆ కుర్చీ ఖాళీ చేయాల్సిన సమయం వస్తుంది. అప్పటి వరకు దోచుకొని దాచుకంటే చాలనుకుంటున్నట్లు వున్నారని అంటున్నారు. చూద్దాం. ప్రభుత్వం ఏం చర్యలు తీసుకుంటుందో? లంచాల విషయంలో దార్యప్తు చేస్తుందా? లేదా??? అనేది కాలమే నిర్ణయిస్తుంది.
