120 Candidates in the Fray for Narsampet Municipal Elections
నర్సంపేట మున్సిపల్ ఎన్నికల బరిలో 120 మంది అభ్యర్థులు
బిఆర్ఎస్, కాంగ్రెస్,భాజపా నుండి అన్ని వార్డుల్లో త్రిముఖ పోటీ
ఎంసిపిఐ(యు) 5 సిపిఎం నుండి ఇద్దరు పోటీ
నర్సంపేట,నేటిధాత్రి:
వరంగల్ జిల్లా నర్సంపేట మున్సిపాలిటీ పరిధిలో జరుగుతున్న ఎన్నికలలో 120 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నట్లు వరంగల్ జిల్లా అడిషనల్ కలెక్టర్ సంధ్యారాణి,మున్సిపల్ కమిషనర్ కాటం భాస్కర్ తెలిపారు.నామినేషన్ల ముగింపు వరకు 291 మంది అభ్యర్థులు నామినేషన్లు వేయగా అందులో వివిధ కారణాలతో 66 నామినేషన్లు తిరస్కరణ అయ్యాయి. కాగా మొత్తం 225 ఉండగా నామినేషన్ల ఉపసంహరణ మంగళవారం చివరి రోజు కావడంతో 105 మంది అభ్యర్థులు వారి వారి నామినేషన్లు ఉపసంహరణ చేసుకున్నారు.వివిధ పార్టీలతో పాటు స్వతంత్ర అభ్యర్థులు కలిపి మొత్తం 120 ఎన్నికల బరిలో ఉన్నట్లు వరంగల్ జిల్లా అడిషనల్ కలెక్టర్ సంధ్యారాణి,మున్సిపల్ కమిషనర్ భాస్కర్ ప్రాటించారు.కాంగ్రెస్ పార్టీ నుండి 30 మంది అభ్యర్థులు, బిఆర్ఎస్ పార్టీ నుండి 30 మంది అభ్యర్థులు,భాజపా పార్టీ నుండి 30 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు.
ఎంసిపిఐ(యు) పార్టీ నుండి 1,4,16,19,20, వార్డులల్లో అభ్యర్థులు పోటీలో ఉన్నారు. సిపిఎం పార్టీ నుండి 10,23 వార్డులల్లో బరిలో ఉన్నారు.జనసేనా పార్టీ నుండి ముగ్గురు, ఇతర పార్టీల నుండి నలుగురు అభ్యర్థులు, మిగతా మొత్తం మంది స్వతంత్ర అభ్యర్థులుగా మొత్తం 120 మంది అభ్యర్థులు పోటీలో నిలిచారు.
