Youth Dies in Train Accident at Zahirabad
రైలు ఢీకొని యువకుడి దుర్మరణం
జహీరాబాద్ నేటి ధాత్రి:
జహీరాబాద్ రైల్వే ట్రాక్‌పై సోమవారం అర్ధరాత్రి రైలు ఢీకొని రమేష్ (30) అనే యువకుడు తీవ్రంగా గాయపడ్డాడు.అతని కుడి కాలు శరీరం నుండి వేరైంది, రెండు చేతులు, కాళ్లు విరిగిపోయాయి, తలకు తీవ్ర గాయమైంది. స్థానికులు సమాచారం ఇవ్వడంతో 108 సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని ప్రథమ చికిత్స అందించి జహీరాబాద్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమించడంతో సంగారెడ్డి జిల్లా ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలోనే అతను మృతి చెందాడని పోలీసులు తెలిపారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
