36 Public Grievances Received at Tirupati Dial Your Commissioner Program
*ప్రజా పిర్యాదుల పరిష్కార వేదికకు 36వినతులు…
*కమిషనర్ ఎన్. మౌర్య…
తిరుపతి(నేటి ధాత్రి:
నగరపాలక సంస్థ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికకు 36 వినతులు వచ్చాయని కమిషనర్ ఎన్.మౌర్య తెలిపారు. సోమవారం తిరుపతి నగరపాలక సంస్థ కార్యాలయంలో డయల్ యువర్ కమిషనర్, ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమాలను నిర్వహించారు. ఈ కార్యక్రమంలో 26మంది కార్యాలయంకు నేరుగా వచ్చి వినతులు సమర్పించగా, 10 మంది ఫోన్ ద్వారా తమ సమస్యలు తెలిపారు. కాగా తమ వార్డుల్లో సమస్యలు పరిష్కరించాలని డిప్యూటీ మేయర్ ముద్ర నారాయణ, ఆర్.సి.మునికృష్ణ కమిషనర్ ను కోరారు. రాయల్ నగర్ 7వ క్రాస్ వద్ద ట్రాన్‌పోర్ట్ ఆఫీస్ ఉండడం వలన ట్రాఫిక్ ఇబ్బందిగా ఉందని, చంద్రశేఖర్ కాలనిలో డ్రైనేజి కాలువలు ఏర్పాటు చేయాలని, ఎస్. కె. డి. నగర్ నందు డ్రైనేజి కాలువలను ఎలుకలు లోడేయడం వలన మురుగునీరు రోడ్లపైకి వస్తున్నాయి అరికట్టాలని, లక్ష్మిపురం కూడలి మూసివేయడం వలన ఇబ్బందిగా ఉండి పరిష్కరించాలని, కొరమీనుగుంట లో ఏర్పాటు చేయనున్నారు సెల్ టవర్ నిలుపుదల చేయాలని, టి. నగర్ లో కాలువలు శుభ్రం చేసి, దోమలు రాకుండా చర్యలు చేపట్టాలని, ఎస్. కె. డి. నగర్ లోని మునిసిపల్ స్కూల్ వద్ద శితిలావస్థ లో ఉన్న చెట్టును తొలగించాలని, గ్రీనపార్క్ అపార్ట్మెంట్ వెనుక పాడయిపోయిన కాలువలు మరమ్మతులు చేయాలని, నెహ్రు నగర్ లో అంబులెన్సు వచ్ఛేందుకు ఇబ్బందిగా ఉంది పరిష్కరించాలని, ఆర్డీవో కార్యాలయం ఎదురుగా ఆక్రమణకు గురైన రోడ్డును కాపాడాలని, ఎస్. ఎల్. Vi. నగర్లో తెలుగుగంగా నరు సరఫరా చేయాలని, సంజయ్ గాంధీ కాలని, సాయి విష్ణు లే ఔట్ లో అక్రమ నిర్మాణలను అరికట్టాలని కోరారు. ఆయా విభాగాల అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలించి పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో అదనపు కమిషనర్ శారదా దేవి, డిప్యూటీ కమిషనర్ అమరయ్య, సూపరింటెండెంట్ ఇంజినీర్ శ్యాంసుందర్, మునిసిపల్ ఇంజినీర్లు తులసి కుమార్, గోమతి, హెల్త్ ఆఫీసర్ డాక్టర్ యువ అన్వేష్,డిసిపీ ఖాన్, రెవిన్యూ అధికారులు సేతుమాదవ్, రవి, ఉద్యానవన శాఖాధికారి హరికృష్ణ, ఫైర్ ఆఫీసర్ శ్రీనివాసులు, వెటర్నరీ ఆఫీసర్ గుణశేఖర్, డి.ఈ.లు, ఏసీపీ లు, శానిటరీ సూపర్ వైజర్లు, తదితరులు పాల్గొన్నారు..
