New Year Should Bring Light to Workers’ Lives
నూతన సంవత్సరo కార్మికుల జీవితాల్లో వెలుగులు నింపాలి
ఏఐఎఫ్ఎఫ్టియు రాష్ట్ర నాయకులు చంద్రగిరి శంకర్
భూపాలపల్లి నేటిధాత్రి
నూతన సంవత్సరం సందర్భంగా కార్మికుల జీవితాల్లో వెలుగులు నింపాలని ఏఐఎఫ్ఎఫ్టియు రాష్ట్ర నాయకులు చంద్రగిరి శంకర్ సింగరేణి కార్మికులకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… సింగరేణి కార్మికులకు అన్ని రాజకీయ పార్టీలకు అన్ని ప్రభుత్వ శాఖల అధికారులకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలుపుతున్నామని, ఈ నూతన సంవత్సరం ప్రతి ఒక్కరి జీవితాల్లో వెలుగులు నింపాలని నూతన ఉత్తేజంతో ప్రతి ఒక్కరు జీవితంలో ఉన్నత శిఖరాలకు ఎదగాలని ఆకాంక్షించారు.కార్మికుల హక్కుల పరిరక్షణ, సంక్షేమం కోసం తాము పనిచేస్తామని ,ఏఐఎఫ్ఎఫ్టియు తరుపున కార్మికుల పక్షాన నిరంతరం పోరాడుతామని ఆయన తెలిపారు.
