Journalists Warn of Indefinite Hunger Strike for House Sites
జర్నలిస్టుల ఇళ్ల స్థలాల కోసం ఆమరణ నిరాహార దీక్షకు సిద్ధం
భూపాలపల్లి నేటిధాత్రి
జర్నలిస్టులకు పట్టాలిచ్చి ఇళ్ల స్థలాలు కేటాయించకుండా కాలయాపన చేస్తున్న అధికారులు,ప్రజా ప్రతినిధుల తీరును నిరసిస్తూ ఇళ్ల స్థలాల సాధన కోసం ఉద్యమాన్ని మరింత ఉదృతం చేస్తున్నట్టు జయశంకర్ జిల్లా కేంద్రం లో రిలే దీక్షకు దిగిన జర్నలిస్టులు వెల్లడించారు..రెండు మూడు రోజుల్లో స్థలాలు కేటాయించక పోతే ఆమరణ దీక్షకు సిద్ధం అంటూ హెచ్చరించారు..
ఇళ్ల స్థలాల కోసం జయశంకర్ జిల్లా కేంద్రం లో జర్నలిస్టులు చేస్తున్న రిలే నిరహార దీక్షలు 31 వ రోజుకు చేరుకున్నాయి..అయితే స్థలాల కేటాయింపులో కాలయాపన జరుగుతుదనీ అదే విధంగా అధికారులు నాయకుల నుంచి సరైన స్పందన రాకపోవడం తో ఇళ్ల స్థలాల కోసం ఉద్యమ కార్యచరణ ను మరింత ఉదృతం చేస్తున్నట్లు తెలిపారు.. రెండు మూడు రోజుల్లో ఇళ్ల స్థలాల పై అధికారులు ప్రజా ప్రతినిధుల నుండి సరైన స్పందన రాకపోతే ఎమ్మ్యేల్యే క్యాంప్ కార్యాలయాన్ని..కలెక్టరేట్ ను ముట్టడిస్తామని హెచ్చరించారు… అప్పటికి దిగి రాకపోతే ఆమరణ దీక్షలకు సిద్ధం అని వెల్లడించారు.ఈ కార్యక్రమం లో 37 మంది జర్నలిస్టులు పాల్గొన్నారు
