Rajitha Nagesh Appeals for Support in Sarpanch Race
మిమ్మల్ని నమ్మి..
మీ ముందుకు వస్తున్నాం.
ఆదరించండి
పాగాల రజిత నగేష్
నిజాంపేట, నేటి ధాత్రి
గ్రామస్తులు నమ్మి.. సర్పంచ్ బరిలో దిగుతున్నానని ఆదరించి గెలిపించండి అని సర్పంచ్ అభ్యర్థి పాగాలరజిత నగేష్ అన్నారు. నిజాంపేట మండలం నస్కల్ గ్రామానికి చెందిన వారు మాట్లాడుతూ.. గ్రామ పంచాయతీ ఎన్నికలు సర్పంచ్ అభ్యర్థిగా పోటీకి దిగుతున్నానని తనకు తోడుగా సహకారంగా ఓటు వేసి గెలిపించాలన్నారు. ప్రతిరోజు వాడవాడ గల్లి గల్లి తిరుగుతూ ప్రజాసమస్యలను తెలుసుకొని సమస్య సార్ధకం అయ్యేవరకు కృషి చేస్తానని పేర్కొన్నారు. మీ అమూల్యమైన ఓటును కత్తెర గుర్తుపై ఓటు వేసి గెలిపించాలని వేడుకున్నారు.
