Mohiyuddin Dargah Ready for 767th Urs
ఉర్సుకు మోహీజుద్దీన్ దర్గా ముస్తాబు
◆:- కోహీర్లోని మౌలానా మోహీజోద్దీన్ దర్గా
జహీరాబాద్ నేటి ధాత్రి:
కోహీర్ మున్సిపల్ పట్టణంలోని హజరత్ సయ్యద్ మౌలానా మోహీయుద్దీన్ దర్గా వద్ద ఈ నెల 8, 9 తేదీల్లో 767వ ఉర్షే షరీఫ్ ఉర్సు ఉత్సవాలు నిర్వహిస్తున్నట్లు బండారి ఖదీమీన్, దర్గా కమిటీ సభ్యులు తెలి పారు. ఈ నెల 7న రాత్రి సర్కారీ సందల్ నిర్వహించనున్నట్లు తెలిపారు. 8న జియా రత్ హీరామన్ సందల్, 9న చిరాగ్, అదే రోజు సాయంత్రం కుస్తీ పోటీలు నిర్వహిం చనున్నట్లు తెలిపారు. 8, 9 తేదీల్లో ఉత్తరప్రదేశ్, బీహార్ రాష్ట్రాలకు చెందిన సనమ్ వార్సి, ఫయాజ్ ఖాన్ గాన కచేరీ కళాకారుల చేత కవ్వాలి ఉంటుందన్నారు. అన్న దాన కార్యక్రమం ఉంటుందన్నారు. ఉత్సవాలకు ప్రజలు అధిక సంఖ్యలో హాజరై విజ యవంతం చేయాలని ఉర్సు కమిటీ సభ్యులు కోరారు.
