టిడిపి పార్టీ ఆధ్వర్యంలో 79 వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు
పరకాల నేటిధాత్రి
పట్టణంలోని 52వ బూత్ సగర వీధిలో టిడిపి సీనియర్ నాయకులు భూపాలపల్లి నియోజకవర్గ పరిశీలకులు పరకాల పట్టణ అధ్యక్షుడు చిదురాల రామన్న ఆధ్వర్యంలో 79వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు.79వ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా జాతీయ జెండా ఆవిష్కరించి జాతీయ గీతం గీతం ఆలపించారు.ఈ సందర్భంగా రామన్న మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ జాతీయ పార్టీలకు అతీతంగా ఎన్నో సంక్షేమ పథకాలు అమలు చేసి సంస్కరణలు అమలు చేసి బడుగు బలహీన వర్గాలకు అండగా ఉండి ప్రపంచవ్యాప్తంగా తెలుగు ప్రజల కీర్తిని వెలుగెత్తి చాటిందని అన్నారు.ఈ కార్యక్రమంలో పట్టణ ఉపాధ్యక్షులు కొత్తపల్లి శంకర్, రాజశేఖర్,నరసయ్య పి శరత్ బాబు,మహిళా నాయకురాలు కురిమిండ్ల కనక లక్ష్మీ,ఎల్లమ్మ, ఐలమ్మ తదితరులు పాల్గొన్నారు.
