26న ఇల్లందులో జరుగు నిర్మాణ జనరల్ బాడీ ని జయప్రదం చేయండి; కే సారంగపాణి

(భద్రాద్రికొత్తగూడెం జిల్లా)గుండాల,నేటిధాత్రి: కార్మిక హక్కులను హరించే విధంగా దేశంలో నరేంద్ర మోడీ ప్రభుత్వం అనుసరిస్తున్న కార్మిక వ్యతిరేక విధానాలపై ఉద్యమించాలని “భారత కార్మిక సంఘాల సమాఖ్య (ఐ ఎఫ్ టి యు) భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ప్రధాన కార్యదర్శి కే సారంగపాణి పిలుపునిచ్చారు. బుధవారం మణుగూరులో ఐ ఎఫ్ టి యు ముఖ్య కార్యకర్తలతో మల్లి కంటి రాము అధ్యక్షతన జరిగిన సమావేశం లో సారంగపాణి మాట్లాడుతూ మోడీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన మొదటి నుండి కార్మిక హక్కులను చట్టాలను రద్దు చేయడానికి కుట్రపూరితంగా ప్రయత్నిస్తోందని అందులో భాగంగానే గతంలో పోరాడి సాధించుకున్న 44 కార్మిక చట్టాలను నాలుగు లేబర్ కోడ్ లు గా కుదించి. కార్మిక వర్గ హక్కులను హరించి కార్పొరేట్ కంపెనీలకు బహుళజాతి సంస్థలకు బడా పెట్టుబడిదారులకు ప్రభుత్వ రంగ సంస్థలైన ఎల్ఐసి, బిఎస్ఎన్ఎల్, సింగరేణి, రైల్వే, విద్యుత్ , బ్యాంకులు తదితర ప్రభుత్వ రంగ సంస్థలను వారికి అప్పగించి ప్రైవేట్ పరం చేయుటకు సిద్ధమైందని విమర్శించారు.

కేంద్ర ప్రభుత్వం ప్రభుత్వ సంస్థలను ప్రైవేటుపరం చేసే ఆలోచనలను విరమించుకోవాలని డిమాండ్ చేశారు. వివిధ ప్రభుత్వ రంగ సంస్థల్లో పనిచేస్తున్న కాంట్రాక్టు కార్మికులకు సుప్రీం కోర్టు తీర్పు ప్రకారం సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని, ఈపీఎఫ్ , ఇతర బెనిఫిట్స్ అమలు చేయాలని , అసంఘటిత రంగంలోని హమాలి, మోటార్ కార్మికులకు సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలని ప్రభుత్వాన్ని కోరారు.

గ్రామపంచాయతీ లో పనిచేసే కార్మికులకు పిఆర్సిప్రకారం వేతనాలు చెల్లించాలని, గ్రామ పంచాయతీలలో మల్టీ పర్పస్ విధానాన్ని తొలగించాలని అన్నారు. కార్మిక వర్గం ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారమే లక్ష్యంగా, భవిష్యత్ పోరాటాలను కర్తవ్యాలను రూపొందించుకునేoదుకు ఈనెల 26 న ఇల్లందులో జరిగే భారత కార్మిక సంఘాల సమాఖ్య( ఐ ఎఫ్ టి యు) జిల్లా నిర్మాణ జనరల్ బాడికి కార్మికులు అధిక సంఖ్యలో హాజరై జయప్రదం చేయాలని కార్మికులకు పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో ఐ ఎఫ్ టి య జిల్లా నాయకులు కందగట్ల సురేందర్ , మోత్కూరి మల్లికార్జున్, మణుగూరు ఏరియా నాయకులు మలికంటి రాము, డి విక్రమ్ , బట్టా సాంబయ్య తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *