రెండు రోజుల్లో ధాన్యం మొత్తాన్ని తరలించాలి ఆర్డివో కిషన్

*20 లారీలు ఏర్పాటు చేస్తాం*

*ఆర్డిఓ విచారణలో బయట పడుతున్న నిజాలు*

*ధాన్యం విక్రయించి నెల గడిచినా అందని రిసిప్ట్*

*ధాన్యం నిల్వ చేయడానికి గోదాం పరిశీలన*

శాయంపేట, నేటి ధాత్రి: రెండు రోజులలో మక్కల కొనుగోలు ప్రక్రియ ముగియనున్నది, వేల సంఖ్యలో బస్తాలు గోదాములకు తరలించకుండా నిల్వ ఎందుకు చేశారు, రెండు రోజుల్లో ధాన్యం మొత్తాన్ని గోదాములకు తరలించాలని ఆదేశాలు జారీ చేసిన పరకాల ఆడివో కిషన్ నాయక్. శాయంపేట మండలంలో పెద్ద మొత్తంలో మక్కజొన్న వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలలో నిలిచిపోయింది, శుక్రవారం రాత్రి కురిసిన వర్షానికి మండల వ్యాప్తంగా కొనుగోలు కేంద్రాలలో ధాన్యం వర్షానికి తెలిసింది. విషయం తెలుసుకున్న పరకాల ఆడివో కిషన్ నాయక్ శాయంపేట మండల కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో పిఎసిఎస్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మక్కల కొనుగోలు కేంద్రాన్ని పరిశీలించారు. రైతులతో మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. 20 రోజులు గడిచిన మక్కలు కాంటాలు వేయడం లేదని, కాంటాలు వేసి 20 రోజులు గడిచిన గోదాములకు తరలించడం లేదని, లోడ్ అన్లోడ్ అయ్యేవరకు బాధ్యతలు రైతు ఏఅని తరలించడానికి బస్తాకు మొదలు10 20 నుండి ఇవాళ 50 రూపాయలు ఆడుతున్నారని రైతులు ఆర్డీఓ దృష్టికి తీసుకు వచ్చారు. నిర్లక్ష్యానికి కారణమేమిటని తెలుసుకోవడానికి కొనుగోలు కేంద్రం నిర్వాహకులు ఎవరు అని అడుగగా కొనుగోలు కేంద్రంలో ఎవరూ లేకపోవడంతో ఇంత నిర్లక్ష్యమా అని అసహనం వ్యక్తం చేశారు. కొనుగోలు కేంద్రానికి ఆడివో చేరుకున్న విషయం తెలుసుకున్న పిఎసిఎస్ చైర్మన్ శరత్ కొనుగోలు కేంద్రానికి చేరుకున్నారు, నిర్లక్ష్యానికి కారణమేమిటని ఆడివో ఆరా తీశారు వేలది బస్తాల ధాన్యం కొనుగోలు కేంద్రంలో పేరుకుపోతూ ఉంటే మీరు ఏం చేస్తున్నారని విచారణ చేపట్టగా, ట్రాన్స్పోర్ట్ఆర్ కారణంగా వాహనాల కొరత ఉందని తెలుపగా, ట్రాన్స్పోర్ట్ వాహనాలు, సమస్యలు ఏవైనా కూడా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసుకోవాల్సిన బాధ్యత మీదేనని తెలియదా. వర్షం వస్తే ఎంత నష్టం వాటిల్లుతుంది ఇంత నిర్లక్ష్యం వహించినందుకు వచ్చేసారి మీకు కొనుగోలు కేంద్రం అలాట్మెంట్ చేయమని హెచ్చరించారు. పెద్ద రైతులు పలుకుబడి ఉన్న వారు ధాన్యాన్ని తీసుకు వచ్చి లారీలు పెట్టుకుంటే టోకెన్ ప్రకారం కాకుండా వారి ముందు తరలించడం కారణంగా సన్నకారు రైతులకు అన్యాయం జరుగుతుందని ఎవరు వాహనం పెట్టుకున్న టోకెన్ ప్రకారం ముందు కాంటాలు వేసిన వారి తరలించాలని, హమాలీలతో మాట్లాడారు లారీలను మేము ఏర్పాటు చేస్తాం రెండు రోజులలో ధాన్యం మొత్తాన్ని లైట్లు ఏర్పాటు చేసి డే అండ్ నైట్ పని చేసి గోదాములకు తరలించాలని ఆదేశాలు జారీ చేశారు.

*20 లారీలు ఏర్పాటు చేస్తాం*

దాన్యం కొనుగోలు కేంద్రంలో ఎన్ని బస్తాలు పేరుకుపోయి ఉన్నాయని ఆడివో చైర్మన్ వివరణ కోరగా 11 వేల పైచిలుకు కాంటాలు హై ఈ కేంద్రంలో నిల్వ ఉన్నాయని అనగా,లారీకి 550 బస్తాల చొప్పున 20 లారీలను ఏర్పాటు చేస్తాం, శాయంపేట తహసిల్దార్ హరికృష్ణ ఇన్చార్జిగా వ్యవహరిస్తారు రెవిన్యూ సిబ్బంది సహాయంతో ధాన్యాన్ని వేగవంతంగా తరలించడానికి ప్రయత్నాలు చేయాలని సూచించారు.

*ఆర్డిఓ విచారణలో బయట పడుతున్న నిజాలు*

శాయంపేట మండల కేంద్రంలో పిఎసిఎస్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మక్కజొన్న కొనుగోలు కేంద్రంలో విచారణ చేపట్టడానికి వచ్చిన పరకాల ఆడివో కిషన్ నాయక్ కు రైతులు కొనుగోలు కేంద్రం నిర్వాహకులు జరుగుతున్న అవకతవకలను తెలియజేసారు, పైరవి కారులాయి పలుకుబడి ఉన్నవారి పెత్తనం కొనసాగుతుందని,కొనుగోలు కేంద్రానికి ముందు ధాన్యం తీసుకువచ్చిన వారి ధాన్యాన్ని ముందు తరలిస్తున్నారని, ఒక టోకెన్ పేరుమీద నలుగురైదుగురు పైరవి కారులకు ఉపయోగిస్తున్నట్లు ఆడివో దృష్టికి తీసుకువచ్చారు.

*ధాన్యం విక్రయించి నెల గడిచినా అందని రిసిప్ట్*

రైతులు కొనుగోలు కేంద్రంలో విక్రయించిన ధాన్యానికి నెల రోజులు గడిచినా రిసిప్ట్ అందజేయడం లేదని రైతులు ఆడివో దృష్టికి తీసుకువెళ్లారు, రైతులు విక్రయించిన దానికి వారికి ఒక రిసిప్ట్ అందజేయాలి కదా మరి ఎందుకు అంత చేయడం లేదని చైర్మన్ను ప్రశ్నించగా బుక్కులు అయిపోయాయని మార్క్ఫెడ్ వారు కూడా అందజేయడం లేదని తెలుపగా, ఆడివో వెంటనే మార్క్ఫెడ్ డీఎంకు ఫోన్ చేసి రైతులు విక్రయించి గోదాములకు తరలించిన మక్కలకు బుక్కులు లేక రిసిప్ట్ అందజేయడం లేదని తెలుపగా, బుక్కులు ఎన్ని కావాలంటే అన్ని అందుబాటులో ఉన్నాయని అనడంతో పిఎసిఎస్ బాగోతం బయటపడింది. ఇది గ్రహించిన ఆడివో మరికొన్ని సెంటర్లు విజిట్ చేసి శాయంపేట విఆర్ఓ రామకృష్ణను పంపిస్తాను సెంటర్ కు 5 బుక్కుల చొప్పున అందజేయగలరు అని కోరారు.

*ధాన్యం నిల్వ చేయడానికి గోదాం పరిశీలన*

రైతులు పండించిన ధాన్యం నిల్వ చేయడానికి శాయంపేట మండల కేంద్రంలో మార్కెట్ యార్డ్, ఆరేపల్లి గ్రామంలో నిర్మించిన గోదాములలో, ధాన్యం నిల్వ చేసే అంశాలపై ఆడివో పరిశీలన చేపట్టారు, పెద్దకొడేపాక గ్రామంలో ఉన్న పాత గోదాము మరమ్మతులు చేపట్టి మక్కలు నిలువ చేసే అంశం సర్పంచ్ ఎమ్మెల్యే అధికారుల దృష్టికి తీసుకువెళ్లగా మండలంలోని ధాన్యం నిల్వలకు ఉపయోగపడే గోదాములను పరిశీలించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *