Headlines

భక్తులు జాగ్రత్తలు పాటిస్తూ గణేష్ నిమజ్జనాలు చేయాలి

భూపాలపల్లి నేటిధాత్రి

జాగ్రత్తలు పాటిస్తూ ఎలాంటి ప్రమాదాలకు తావివ్వకుండా ఆనందంగా గణేష్ నిమజ్జనం కార్యక్రమాన్ని నిర్వహించుకోవాలని జిల్లా కలెక్టర్ కృష్ణ ఆదిత్య జిల్లా ప్రజలను ఒక ప్రకటనలో కోరారు. వర్షాకాలం కాబట్టి ఈ మధ్య కురిసిన అధిక వర్షాల వలన జిల్లాలోని అన్ని వాగులు, వంకలు ఉదృతంగా ప్రవహిస్తున్నాయని చెరువులు, రిజర్వాయర్లు పూర్తిస్థాయిలో నిండి ఉన్నందున ఆదివారం నాడు జిల్లావ్యాప్తంగా నిర్వహించనున్న గణేష్ నిమజ్జనం సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా మండల స్థాయిలో తహసీల్దార్లు, ఎస్ఐ, మండల ప్రత్యేక అధికారులు ఇతర శాఖల అధికారుల సమన్వయంతో నిమజ్జనానికి ఏర్పాట్లు చేశామని, కాళేశ్వరం వద్ద గోదావరి నదిలో అధిక సంఖ్యలో గణేశుని ప్రతిమలు నిమజ్జనం జరుగుతాయి కాబట్టి అక్కడ జిల్లాస్థాయిలో జిల్లా అదనపు కలెక్టర్, ఆర్డిఓ, జెడ్పీ సీఈవో, జిల్లా హార్టికల్చర్ అధికారి, జిల్లా మత్స్యశాఖ అధికారి, డిఎస్పి, రెవెన్యూ, పోలీస్ తదితర శాఖల అధికారులను ప్రత్యేకంగా నియమించి నిమజ్జనానికి ఏర్పాట్లు పూర్తి చేశామని గోదావరిలో నీరు అధికంగా ఉన్నందున బ్రిడ్జి పై నుండి మాత్రమే వినాయకులను నిమజ్జనం చేయడానికి అనుమతి ఉంది కాబట్టి ఎవరు వినాయకుల నిమజ్జనం కోసం నేరుగా గోదావరి నది వద్దకు వెళ్లరాదని అన్నారు. ప్రభుత్వ అధికారుల సూచనలు, సలహాలను పాటిస్తూ వాహనాలను నడుపుతూ తోటి భక్తులకు ఇబ్బంది కలగకుండా ప్రశాంత వాతావరణంలో అనుమతి మేరకు తక్కువ మంది మాత్రమే వాహనాలలో ప్రయాణిస్తూ క్షేమంగా గణేష్ నిమజ్జనం జరుపుకోవాలని అన్నారు. ముఖ్యంగా యువత సంయమనం పాటిస్తూ పోలీస్ అధికారుల సూచనలను సలహాలను తు.చ తప్పకుండా పాటిస్తూ covid 19 నిబంధనలను పాటిస్తూ సురక్షితంగా గణేష్ నిమజ్జనంలో పాల్గొనాలని జిల్లా కలెక్టర్ ఆ ప్రకటనలో తెలిపారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *