
చిల్పూర్( జనగామ)నేటి ధాత్రి:
చిల్పూర్ మండలంలోని చిన్న పెండ్యాల గ్రామంలో గల శ్రీ హనుమాన్ దేవాలయం ప్రధాన అర్చకులు ఎల్లంబట్ల కరుణాకర్ శర్మ జన్మదిన వేడుకలు చిన్న పెండ్యాల బీసీ కాలనీ భగత్ సింగ్ యూత్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా హనుమాన్ దేవాలయ ప్రధాన అర్చకులు ఎల్లంబట్ల కరుణాకర్ శర్మ పుట్టినరోజును పురస్కరించుకుని భగత్ సింగ్ యూత్ సభ్యులు వినాయక మండపం వద్ద అర్చకులు కరుణాకర్ శర్మను శాలువాతో సత్కరించి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.ఈ కార్యక్రమంలో భగత్ సింగ్ యూత్ కమిటీ సభ్యులు వేమునూరు శ్రీనివాస్, బత్తుల రాజన్ బాబు, కీర్తి శ్రీధర్, తాళ్లపల్లి శ్యామ్ గౌడ్, పొడిశెట్టి లక్ష్మీనారాయణ, దేశిని సతీష్ కుమార్, నారగోని సంతోష్ కుమార్, కొత్తపల్లి అనిల్ రాజ్,నాగవెల్లి హరీష్,వెలిశాల రాజు,నాగవెల్లి రంజిత్, రామడుగు ఖుషి, వెలిశాల రాకేష్ తో పాటు కమిటీ సభ్యులు, తదితరులు పాల్గొన్నారు.