యువత కుంభమేళా బాట!
ఈసారి కుంభమేళాలో గొప్ప విశేషమేంటంటే పెద్ద సంఖ్యలో యువతీ యువకులు పాల్గనడం! సాధారణంగా వృద్ధులకు తీర్థయత్రలకు వెళ్లాలని, పుణ్యక్షేత్రాలను సందర్శించాలని వుంటుంది. కానీ కుంభమేళాను సందర్శిస్తున్న యువతీ యువకులను పరిశీలిస్తే ఈతరంలో ఆధ్యాత్మిక భానవలు పెరుగుతున్నాయన్న సత్యం బోధపడుతుంది. అనుక్షణం రోజువారీ కార్యకలాపాల్లో బిజీగా గడిపే యువతీ యువకులు, ప్రయాగ్‌రాజ్‌ను సందర్శించి ఆధ్యాత్మిక ప్రశాంతతను పొందుతున్నా రు. దీనిపై వారిని ప్రశ్నించినప్పుడు వచ్చే సమాధానం ఒక్కటే. మా పెద్దలు కుంభమేళా గురించి గొప్పగా చెప్పేవారు. కుంభమేళాను సందర్శించడం గొప్ప ఆధ్యాత్మిక అనుభూతినిస్తుందటూ పెద్దలు చెప్పిన విషయాలను అనుభవంలోకి తెచ్చుకోవాలన్న ఉద్దేశంతో ఈ ఆధ్యాత్మిక నగరాన్ని సందర్శిస్తున్నామని వారు చెబుతున్నారు. పెద్దలు చెప్పే మంచి విషయాలు పిల్లలపై ఎంత చక్క ని ప్రభావం చూపుతాయోనన్నదానికి ఇది గొప్ప ఉదాహరణ!