మీకు మధుమేహం ఉన్నా రోజూ మామిడిపండు తినొచ్చు.!

Mangoes

మీకు మధుమేహం ఉన్నా రోజూ మామిడిపండు తినొచ్చు.. అయితే ఈ జాగ్రత్తలు తప్పనిసరి..!

జహీరాబాద్. నేటి ధాత్రి:

‘మీకు మామిడి పండ్లంటే చాలా ఇష్టమా..? రక్తంలో చక్కెర స్థాయిలు పెరుగుతాయని భయపడుతున్నారా..? అయితే ఈ చిన్నపాటి జాగ్రత్తలు మీకు ఎంతో తోడ్పడుతాయి’ అనే క్యాప్షన్‌ ఇస్తూ ఆమె తన ఇన్‌స్టా హ్యాండిల్‌లో కొన్ని టిప్స్‌ సూచించారు. ఆ టిప్స్‌ ఏంటో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం..
ప్రతి ఏడాది ఎండాకాలంతోపాటే మామిడిపండ్ల సీజన్‌ వస్తది. మామిడిపండు రుచికరంగానే కాక అనేక పోషకాలను కలిగి ఉంటుంది. ఈ పండులో విటమిన్‌ సి, విటమిన్‌ ఎ, కాపర్‌, ఫోలేట్‌, మెగ్నీషయం, పొటాషియం, విటమిన్‌ బీ6, విటమిన్‌ కే తదితర పోషకాలు సమృద్ధిగా ఉంటాయి. జీర్ణకోశం, చర్మం, కురుల ఆరోగ్యాన్ని మెరుగుపర్చడంలో మామిడిపండులోని పోషకాలు తోడ్పడుతాయి. అంతేగాక బరువును తగ్గిస్తుంది. బీపీని అదుపులో ఉంచుతుంది. వ్యాధినిరోధక శక్తిని పెంచుతుంది.అయితే మామిడిపండ్లు రుచిలో చాలా తియ్యగా ఉంటాయి కాబట్టి మధుమేహ వ్యాధిగ్రస్తులకు ఇవి మంచివి కావని, రక్తంలో చక్కెర స్థాయిలు అమాంతం పెరిగిపోతాయని చెబుతుంటారు. అయితే కొన్ని చిన్నచిన్న జాగ్రత్తలు పాటించడం ద్వారా మధుమేహులు కూడా హాయిగా మామిడిపండ్లను ఆస్వాదించవచ్చని ప్రముఖ పోషకాహార నిపుణురాలు లవనీత్‌ బాత్రా తెలిపారు. ఈ మేరకు ఆమె తన ఇన్‌స్టా ఖతాలో ఒక పెట్టారు.

Mangoes
Mangoes

‘మీకు మామిడి పండ్లంటే చాలా ఇష్టమా..? రక్తంలో చక్కెర స్థాయిలు పెరుగుతాయని భయపడుతున్నారా..? అయితే ఈ చిన్నపాటి జాగ్రత్తలు మీకు ఎంతో తోడ్పడుతాయి’ అనే క్యాప్షన్‌ ఇస్తూ ఆమె తన ఇన్‌స్టా హ్యాండిల్‌లో కొన్ని టిప్స్‌ సూచించారు. ఆ టిప్స్‌ ఏంటో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం..

1. మితంగా తీసుకోవాలి

మీరు మధుమేహులు అయినప్పటికీ రోజుకు ఒకటికి మించకుండా మామిడి పండు తినడంవల్ల ఆరోగ్యానికి వచ్చిన నష్టమేమీ లేదని లవనీత్‌ బాత్రా తన పోస్టులో పేర్కొన్నారు. ఒక మీడియం సైజు మామిడిపండులో 50 గ్రాముల వరకు కార్బోహైడ్రేట్స్‌ ఉంటాయని, అలాంటి పండును రోజుకు సగం లేదా ఒకటి తినడంవల్ల వచ్చే నష్టమేమీ లేదని తెలిపారు.

2. పోషకాల బ్యాలెన్సింగ్‌

మధుమేహులు మామిడిపండును తీసుకున్నప్పుడు శరీరంలో కార్బోహైడ్రేట్‌లు, చక్కెరల పరిమాణం బ్యాలన్స్‌ తప్పకుండా చూసుకోవాలని బాత్రా తెలిపారు. అందుకోసం మామిడిపండును తినడానికి ముందే కొవ్వులు, ఫైబర్‌లు ఉండే ఆహారం తీసుకోవాలని సూచించారు. కార్బోహైడ్రేట్‌లు ఎక్కువగా ఉండే మామిడిపండును ఫైబర్స్‌, కొవ్వులు లాంటి ఇతర పోషకాలతో కలిపి తీసుకోవడం చాలా ముఖ్యమని ఆమె పేర్కొన్నారు. అంటే మామిడిపండును తినడానికి ముందు ఒక కప్పు నిమ్మరసంతోపాటు వాల్‌నట్స్‌, నానబెట్టిన చియా గింజలు లేదా బాదామ్‌ గింజలు తీసుకోవాలని సూచించారు. ఇలా చేయడంవల్ల మామిడిపండు తిన్నప్పటికీ గ్లూకోజ్‌ స్థాయిలు పెరగకుండా ఉంటాయని తెలిపారు.

3. టైమింగ్‌ పాటించాలి

మధుమేహులు మామిడి పండును ఎప్పుడుపడితే అప్పుడు కాకుండా సరైన టైమ్‌లో మాత్రమే తీసుకోవాలని లవనీత్‌ బాత్రా సూచించారు. ఏదైనా పనిచేయడానికి ముందు, నడవడానికి ముందు, వ్యాయామం చేయడానికి ముందు మామిడి పండును తీసుకోవాలని తెలిపారు. దాంతో పెరిగిన కార్బోహైడ్రేట్స్‌ వెంటనే అదుపులోకి వస్తాయని పేర్కొన్నారు.

4. సరైన పద్ధతిలో తినాలి

డయాబెటిక్స్‌ మామిడిపండును తినాల్సిన పద్ధతిలో మాత్రమే తినాలని బాత్రా సూచించారు. రక్తంలో చక్కెర స్థాయిలు పెరగకుండా ఉండాలంటే మామిడిపండును జ్యూస్‌ల రూపంలో, మిల్క్‌ షేక్స్‌ రూపంలో కాకుండా ఉన్నది ఉన్నట్టుగా తినాలని తెలిపారు. ప్రకృతి ఇచ్చిన పండును ప్రకృతి సిద్ధంగా తినడంవల్ల ఆరోగ్యానికి మేలు జరుగుతుందని పేర్కొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!