బీజేపీ జిల్లా అధ్యక్షుడు నిశీధర్ రెడ్డి
రేగొండ,నేటిధాత్రి:
జయశంకర్ భూపాలపల్లి జిల్లా భారతీయ జనతా పార్టీ అధ్యక్షునిగా రేగొండ మండలానికి చెందిన ఏడునుతుల నిషిధర్ రెడ్డి ఎన్నికయ్యారు.రాష్ట్ర అధ్యక్షులు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేశారు.ఈ సందర్భంగా నిషిధర్ రెడ్డి మాట్లాడుతూ తన ఎన్నికకు సహకరించిన భారత ప్రధాని నరేంద్ర మోడీ,జాతీయ అధ్యక్షులు జెపి నడ్డ, కరీంనగర్ ఎంపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్ కుమార్, మధ్యప్రదేశ్ రాష్ట్ర ఇన్చార్జి మురళీధర్‌రావు,హుజూరాబాద్ మాజీ శాసనసభ్యులు ఈటల రాజేందర్,రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు ప్రేమేందర్ రెడ్డి,ప్రదీప్ రావు,కాసం వెంకటేశ్వర్లు,బంగారు శృతి,రాష్ట్ర అధికార ప్రతినిధి చందుపట్ల కీర్తి సత్యపాల్ రెడ్డి,కన్నం యుగదీశ్వర్,రాష్ట్ర క్రమశిక్షణ సంఘం మెంబెర్ రాజమౌళి గౌడ్ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు వెన్నంపల్లి పాపన్న,చదువు రామచంద్రారెడ్డి,జిల్లా నాయకులకు కృతజ్ఞతలు తెలిపారు.తనపై నమ్మకంతో రాష్ట్ర అధినాయకత్వం జిల్లా అధ్యక్షుడిగా నియమించినందుకు పార్టీ విధేయుడిగా జిల్లాలో పార్టీ అభివృద్ధికి కృషి చేస్తానని కార్యకర్తలకు అందుబాటులో ఉంటూ పార్టీని జిల్లాలో అభివృద్ధి చేయుటకు పనిచేస్తానని అన్నారు.ఈ సందర్భంగా వారి నివాసంలో బిజెపి రేగొండ మండల నాయకులు పుష్పగుచ్చ ఇచ్చి శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో గన్ రెడ్డి లింగారెడ్డి,మెతుకుపల్లి బుచ్చిరెడ్డి,అన్నారపు రమణారెడ్డి,పెండ్యాల రాజు, బోట్ల సుమన్,తూర్పాటి మల్లేష్,సామల నరేందర్ రెడ్డి,నేరెళ్ల శంకర్,వాకిడి ముత్యం,పొద్దుటూరు వెంకటరెడ్డి,కౌడాగాని రాకేష్, అంబటి రాజకుమార్, ఎర్రబాటి శివ,బానోతు రాజేందర్ నాయక్ వరప్రసాద్ పున్నం,రఘు, కూరాకుల చిన్న మల్లయ్య తదితరులు పాల్గొన్నారు.