`గల్లీలో కాదు డిల్లీలో తేల్చుకుందాం.
`ముక్కోణపు పోటీలో డిల్లీ పీఠం దక్కేదెవరికి?
`డిల్లీ చక్రవర్తి ఎవరు?
`ఆప్ మళ్ళీ గెలుస్తుందా?
`బిజేపి డిల్లీని ఈసారైనా కైవసం చేసుకుంటుందా?
`కాంగ్రెస్‌కు ఇప్పుడైనా కలిసొచ్చేనా?
`ప్రభుత్వ వ్యతిరేకత ఎవరికి లాభం చేకూరుతుంది?
`ప్రజలు మార్పు కోరుకుంటే గెలుపు ఎవరిని వరిస్తుంది?
`డిల్లీ రూరల్ ప్రజల మనోగతమేమిటి?
`డిల్లీ అర్భన్‌లో బిజేపి ప్రభావం ఎంత చూపుతుంది?
`కేజ్రివాల్ పై ప్రజల్లో సానుభూతి వుందా?
`లిక్కర్ కేసు నిజమే అని జనం నమ్ముతోందా?
`బిజేపికి బలంగా ప్రచారం చేస్తున్న ఆర్ఎస్ఎస్ పని తీరు ఫలిస్తుందా?
`లిక్కర్ కేసు ప్రభావం ఆప్‌పై పడుతుందా?
`మహా కుంభమేళా కూడా బిజేపికి కలిసివస్తుందా?
`కుంభమేళాపై ఖర్గే వ్యాఖ్యలు ప్రభావం చూపుతాయా?
`ఆప్ మీద వున్న అవినీతి ఆరోపణలు ప్రజలు విశ్వసిస్తున్నారా?
`ఇండియా కూటమి సపోర్ట్ ఆప్ కా, కాంగ్రెస్ కా?
`ఆప్, కాంగ్రెస్ వేర్వేరు పోటీ కమలానికి కలిసొచ్చేనా?
`కాంగ్రెస్, బిజేపి ల మధ్య ఆప్ నిలబడుతుందా?
`మళ్ళీ రెండు జాతీయ పార్టీలను ఆప్ ఊడ్చేస్తుందా?
`నాలుగో సారి ఆప్ తన విజయం నమోదు చేసుకుంటుందా?
`1993 తర్వాత బిజేపి డిల్లీలో గెలవలేదు.
`ఈసారైనా బిజేపి డిల్లీని తన ఖాతాలో వేసుకుంటుందా?
`ఆప్ గెలిచి చీపురుకు ఎదురులేదని నిరూపిస్తుందా?
`ప్రచారంలో ఆప్ దూసుకుపోతుందా?
`డిల్లీ లో ఈ దఫా బిజేపి ఎత్తుగడలు ఫలిస్తాయా?
`ఆటలో అరటిపండు అయ్యే పార్టీ ఏది?
`పూర్వవైభవాన్ని కాంగ్రెస్ పొంది డిల్లీని ఏలుతుందా?
`డిల్లీ సెంటిమెంట్‌ను నిలబెట్టుకొని దేశమంతటా బలపడుతుందా?
`ఉచ్ఛితాలను నమ్ముకున్న మూడు పార్టీలు?
`యమునా నదిలో మునిగేదెవరు? తేలేదెవరు?
డిల్లీ శాసనసభ ఎన్నికలు దగ్గరపడుతున్న వేళ నువ్వా నేనా డిల్లీ నీదా నాదా సై అన్నట్లు ప్రధాన రాజకీయ పార్టీల ప్రచారం జోరుగా సాగుతోంది. ఎన్నికలు దగ్గర పడుతున్న వేళ ప్రచారం ఊపందుకున్నది. గల్లీలో కాదు డిల్లీలో చూసుకుందాం.. మీ ప్రతాపం..మా ప్రతాపం అన్నట్లు బిజేపి,కాంగ్రెస్, ఆప్ పార్టీలు విసృతమైన ప్రచారం నిర్వహిస్తున్నాయి. ముక్కొణపు పోటీలో డిల్లీ పీఠం ఎవరికి దక్కుతుందన్న ఉత్కంఠ అందరిలోనూ నెలకొన్నది. గత పార్లమెంటు ఎన్నికల్లో 70 శాసన సభ స్దానాలను నిర్ధేశించే 7 పార్లమెంటు స్ధానాలు దక్కించుకొని బిజేపి ఊపు మీద వున్నది. ఇప్పటికే మూడుసార్లు డిల్లీని కైవసం చేసుకొని హట్రిక్ సాధించిన ఆప్, నాలుగోసారి తన జాతకాన్ని పరిశీలించుకోనున్నది. ఇక గతంలో వరుసగా మూడుసార్లు డిల్లీని ఏలిన కాంగ్రెస్, ఆప్ పార్టీ వచ్చిన తర్వాత కనీసం ఉనికి కూడా లేకుండాపోయింది. ఇప్పుడు తన ఉనికి కోసం ఆరాపడుతుందో, గెలిచేందుకు పోరాటం చేస్తుందో అన్నది ఎన్నికల ఫలితాలు వస్తే గాని కాంగ్రెస్ పరిస్టితి తెలిసేలా లేదు. 1993లో ఒక్కసారి మాత్రమే డిల్లీని పరిపాలించిన బిజేపి మళ్లీ డిల్లీ పీఠం పాలించలేదు. ఈసారి ఎలాగైనా డిల్లీని ఏలాలన్న పట్టుదలతో ప్రచారం సాగిస్తోంది. గత గుజరాత్ ఎన్నికల సమయంలో ప్రజలకు ఉచితాలను అందివ్వడం వల్ల దేశం వెనుకబడి పోతుందని నీతులు చెప్పిన బిజేపి కూడా ఈసారి డిల్లీలో కాంగ్రెస్, ఆప్‌లను మించి ఉచితాలు ప్రచారం చేస్తున్నాయి. దేశంలో ఎక్కడా రూ.500లకు సిలిండర్ ఇవ్వని బిజేపి డిల్లీలో ప్రజలకు రూ.500లకే సిలిండర్ అందిస్తామని ప్రచారం సాగించడాన్ని చూస్తుంటే బిజేపి డిల్లీ ఎన్నికలను ఎంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్నదో అర్ధమౌతోంది. ఇంతకీ డిల్లీ రాజు ఎవరు అన్నది కొద్ది రోజుల్లో తేలనుంది. ఎట్టిపరిస్దితుల్లో ఈసారి డిల్లీని కైవసం చేసుకోవాలన్న తపన బిజేపిలో ఎక్కువగా కనిపిస్తోంది. కాకపోతే ఇన్ని సంవత్సరాలైనా డిల్లీలో బిజేపిని నడిపించే బలమైన నాయకుడు లేడు. అదే విధంగా కాంగ్రెస్‌కు కూడా షీలా దీక్షిత్ తర్వాత ఆ పార్టీని భుజనా వేసుకునే నాయకులే లేరు. ఈ విషయంలో ఆప్ ఒకింత మెరుగైన పార్టీ అని చెప్పక తప్పదు. డిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ అన్నీ తానై ముందుకు నడిస్తున్నారు. కాంగ్రెస్, బిజేపి లకు జాతీయ స్దాయి నాయకులు వున్నా, డిల్లీ గల్లీలలో సేవ చేయలేరు. అందువల్ల డిల్లీ ప్రజలు మళ్లీ ఆప్ వైపే మొగ్గుచూపుతున్నారన్న ప్రచారం సాగుతోంది. కాంగ్రెస్‌కు ఈసారైనా కలిసి వస్తుందా? అనే ప్రశ్నలకు సమాదానం చెప్పేవారు లేరు. పైగా కాంగ్రెస్ ఒకింత ప్రచాంరలో వెనుకబడి వుందనే అంటున్నారు. డిల్లీ ఎన్నికలను రాహుల్ గాంధీ కూడా ప్రతిష్టాత్మకంగా తీసుకొని ప్రచారం సాగిస్తున్నట్లు లేదు. రోడ్‌షోలను ముందు ప్రకటించి, తర్వాత వాయిదా వేశారు. దాంతో కాంగ్రెస్ శ్రేణుల్లో అసంతృప్తి నెలకొని వుందన్న మాటలు కూడా వినిపిస్తున్నాయి. కాలం కలిసి వస్తే ఇలాంటి చిన్న చిన్న సమస్యలు సమసిపోతాయని చెప్పడంలో సందేహం లేదు. అయితే ఇప్పటికే మూడు సార్లు గెలిచింది. దాంతో ఎంతో కొంత ప్రభుత్వ వ్యతిరేకత వుంటుందని కొందరు అంచనా వేస్తున్నారు. డిల్లీ లిక్కర్ కేసు విషయంలో డిల్లీ రూరల్‌లో పెద్దగా ప్రభావం కనిపించడం లేదంటున్నారు. కాని డిల్లీ అర్భన్‌లో మాత్రం లిక్కర్ కేసు ప్రభావం కనిపించేలా వుందని అంటున్నారు. దాంతో బిజేపి అర్భన్ ప్రాంతాలపై ఎక్కువ దృష్టిపెట్టి ప్రచారం సాగిస్తున్నట్లు కూడా తెలుస్తోంది. లిక్కర్ కేసులో అరవింద్ కేజ్రీవాల్‌ను అనవసరంగా ఇరికించారన్న సానుభూతి కూడా కనిపిస్తున్నట్లే అని వార్తలు కూడా వస్తున్నాయి. పైగా డిల్లీ ఎన్నిలకపై సర్వేలు నిర్వహిస్తున్న మెజార్టీల సంస్థలు ఆప్ వైపే మొగ్గుచూపుతున్నాయి. మహా కుంభమేళా బిజేపికి బాగా కలిసి వస్తుందని అందరూ అనుకున్నారు. కాని కుంభమేలా నిర్వహణ తొలి దశలో ప్రభుత్వానికి మంచిపేరు వచ్చినా,తర్వాత వరుస ఘటనలు బిజేపిపై ప్రభావం చూపొచ్చన్న అభిప్రాయం కూడా వుంది. ఇకపోతే కుంభ మేళామీద కాంగ్రెస్‌పార్టీ జాతీయ అధ్యక్షుడు ఖర్గే చేసిన వ్యాఖ్యలు ఆ పార్టీకి మైనస్‌గా మారొచ్చు. డిల్లీలో సుమారు 17లక్షల మంది ముస్లిం ఓటర్లు వున్నారు. వారంతా కాంగ్రెస్‌కు ఓటేస్తే కాంగ్రెస్ గట్టిపోటీ ఇచ్చే అవకాశాలున్నాయి. కాని ముస్లింలు ఆప్ వైపు మొగ్గు చూపితే మాత్రం కాంగ్రెస్‌కు ఆశనిపాతమే మిగులుతుందని చెప్పడంలో సందేహం లేదు. ఇక ఇండియా కూటమి ఎటు వైపు నిలస్తుందనేది కూడా ప్రశ్నగా మారింది. ఇండియా కూటమిలో వున్న ఇతర పార్టీలు ఆప్ వైపే మొగ్గు చూపుతున్నారన్న వార్తలు వినిపిస్తున్నాయి. అదే జరిగితే డిల్లీలో ఆప్ మరోసారి విజయం సాధిస్తే ఇండియా కూటమిలో కేజ్రీవాల్ తిరుగులేని శక్తిగా మారుతాడు. అందువల్ల కాంగ్రెస్ కూడా ఆప్ ఓడిపోవాలనే చూస్తోందని విశ్లేషకులు అభిప్రాయ పడుతున్నారు. అయితే ఆప్, కాంగ్రెస్‌లో ఇండియా కూటమిలో వుంటూనే వేర్వేరుగా పోటీ చేయడం వల్ల బిజేపికి లాబించొచ్చన్న వాదనలు కూడ వున్నాయి. లేక బిజేపి, కాంగ్రెస్‌ల మధ్య ఆప్ నిలబడుతుందా? అన్న సందేహాలు కూడా వ్యక్తమౌతున్నాయి. లేక రెండు జాతీయ పార్టీలను గతంలో ఊడ్చేసినట్లే ఈసారి కూడా ఆప్ ఊడ్చి పడేస్తుందని కూడా అంటున్నారు. కాకపోతే ఆప్‌కు గతంలో వచ్చినంత మెజార్టీ రాకపోవచ్చు అనే అభిప్రాయాలు వ్యక్తమౌతున్నాయి. నిజానికి డిల్లీ ఎన్నికలు ఆప్‌కు జీవన్మరణ సమస్య అని చెప్పాలి. ఈసారి డిల్లీలో ఓడిపోతే, ఆరు నెలలు తిరిగే లోపు పంజాబ్‌లో ఆప్ ప్రభుత్వం కూలిపోవచ్చు. అసలు ఆప్ పార్టీ ఎమ్మెల్యేలు, నాయకులు ఇతర పార్టీలను ఆశ్రయించొచ్చు. ఆప్ మనుగడ కష్టంగా మారొచ్చు. మళ్లీ లిక్కర్ కేసు తిరగదోడొచ్చు. ఏదైనా జరగొచ్చు. అందువల్ల ఈ ఎన్నికల్లో ఆప్ ఎలాగైన గెలవాలి. గెలిచి తీరాలి. ఆప్‌పై ప్రజలు సానుబూతితో వున్నారన్న వార్తలు ఎట్లా వున్నా, ఎన్నికల జిమ్మిక్కులు ప్రజల ఆలోచనలు మార్చడం పెద్ద కష్టం కాదు. విద్య, వైద్య రంగాలలో ప్రజలకు ఎంతో మేలు చేసిన ఆప్ ను కాదని, బిజేపి, కాంగ్రెస్‌లను నమ్ముతారా? లేక ఆప్ వైపే మొగ్గు చూపుతారా? అన్నది ఆసక్తి కరంగా మారింది. దాంతో రాజకీయ పార్టీలు విసృతంగా విరామం లేకుండా ప్రచారం సాగిస్తున్నాయి. ప్రజలను ప్రసన్నం చేసుకోవడంతో తలమునకలై వున్నారు. డిల్లీని 17 సంవత్సరాల పాటు షీలా దీక్షిత్ పరిపాలన చేసిన తర్వాత రాజకీయాల్లోకి దూసుకొచ్చిన ఆప్ జాతీయ అద్యక్షుడు అప్రతిహాతంగా తన పార్టీని గెలిపిస్తూ వస్తున్నారు. మూడు సార్లు ముఖ్యమంత్రిగా బాద్యతలు నిర్వహించారు. ఇప్పుడు కూడా ఆయన పార్టీయే అదికారంలోవుంది. కాకపోతే డిల్లీ ప్రభుత్వంలో లిక్కర్ కేసు ప్రకంపనలు అరవింద్ కేజ్రీవాల్‌ను జైలు పాలు చేసింది. గతంలో ఇండియన్ సివిల్ సర్వీస్ అదికారిగా అవినీతిపై పోరాటం చేశారో అదే అవినీతి కేసులో అవరింద్ కేజ్రీవాల్ చిక్కుకొని విలవిలలాడుతున్నారు. జైలు పాలయ్యారు. ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేశారు. నాలుగోసారి ఎన్నికల పోరాటం చేస్తున్నారు. ప్రజలు అరవింద్ కేజ్రీవాల్ మాటలు నమ్ముతారా? లేదా? ఇప్పటికే మూడుసార్లు నమ్మి గెలిపించిన డిల్లీ ప్రజలు మరోసారి విశ్వసిస్తారా? లేదా అన్నది ఉత్కంఠను రేపుతోంది. ఎందుకంటే డిల్లీ ప్రభుత్వంపై ఇన్ని సంవత్సరాలైనా పెద్దగా ఎలాంటి ఆరోపణలు రాలేదు. కాని లిక్కర్ కేసు మూలంగా అరవింద్ కేజ్రీవాల్ చిరిష్మా మసకబారిందా? లేదా? అన్నది ఈ ఎన్నికల ద్వారా తేలనుంది. ఎందుకంటే ప్రజా స్వామ్యంలో ప్రజా తీర్పును మించింది లేదు. ప్రజాభిప్రాయం ముందు ఏది పనికి రాదు. మెజార్టీ ప్రజల తీర్పుతో అరవింద్ కేజ్రీవాల్‌పై పడిన మచ్చ తొలగిపోతుందా? లేదా? అన్నది కూడా తేలిపోనుంది. ఈసారి డిల్లీ ఎన్నికలలో అన్ని పార్టీలు ఆల్ ఫ్రీ జపమ్ చేస్తున్నాయి. గత గుజరాత్ ఎన్నికల సందర్భంగా ప్రజలకు ఉచితాలు ఇవ్వడం వల్ల దేశ ఆర్ధిక వ్యవస్ధ కుదేలౌతుందని మాట్లాడిన ప్రధాని మోడీ ఈసారి డిల్లీ ఎన్నికల్లో బిజేపి ప్రకటిస్తున్న తాయిలాలపై నోరు మెదకపోవడం ఆశ్చర్యం. అయితే బిజేపి, కాంగ్రెస్, ఆప్ పార్టీలు పోటీ పడి మరి హామీలు గుప్పిస్తున్నాయి. ఇందులో ఆప్ పార్టీ అర్చకులకు నెలకు 18వేల వేతనం అందిస్తామని ప్రకటించింది. అంటే ఆప్ హిందుత్వానికి వ్యతిరేకం కాదన ప్రకటించినట్లైంది. డిల్లీలోని వృద్దులందరికీ ఎంత ఖరీదైన వైద్యమైనా సరే ఉచితంగా చేస్తామని ప్రకటించింది. డిల్లీలో అద్దెలకు వుండే కుటుంబాలకు ఉచిత, విద్యుత్, మంచినీరు అందిస్తామని అంటోంది. ఇక బిజేపి గర్భిణీ స్త్రీలకు రూ.21వేల రూపాయలు అందిస్తామంటోంది. వయో వృద్దులను రెండు విభాగాలుగా విభజించి 70 ఏళ్ల లోపు వారికి రూ.2500, ఆపై వయసు పైబడిన వారికి రూ.3000 ఇస్తామని ప్రచారం సాగిస్తోంది. రూ. 500కే గ్యాస్ సిలిండ్ సరఫరా చేస్తామంటున్నారు. కాంగ్రెస్ పార్టీ అక్కడ కూడా గ్యారెంటీలు ప్రకటించింది. అందులో నిరుద్యోగులకు నెలకు రూ.8500 ఇస్తామని ప్రకటించడం గమనార్హం. జీవన్ రక్ష కింద కాంగ్రెస్ ఫార్టీ డిల్లీ ప్రజలకు రూ.25 లక్షల వరకు ఉచిత ఆరోగ్య భీమా అందిస్తామని చెబుతోంది. 300 యూనిట్ల వరకు ఉచిత కరంటు సరఫరా చేస్తామంటున్నారు. ఇలా వరాల జల్లు మూడు పార్టీలు కురిపిస్తున్నాయి. అయితే ప్రజలు ఎటు వైపు మొగ్గుచూపుతారన్నది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఆప్ పార్టీపై ప్రజల్లో పెద్దగా వ్యతిరేకత కనిపించడం లేదు. కేజ్రీవాల్ చేసిన అభివృద్దిపై ప్రజలు సంతృప్తితో వున్నారు. అయితే తాజాగా కాగ్ నివేదికలో లిక్కర్ అమ్మకాలలో గోల్ మాల్ జరిగినట్లు వెల్లడైనట్లు ఆ విషయాన్ని ప్రతిపక్ష బిజేపి విసృతంగా ప్రచారం సాగిస్తోంది. ఆ ఆరోపణలను ఆప్ తీవ్రంగా ఖండిస్తోంది. ఇక బిజేపి నేతలు కొంత మంది నోటికి పని చెప్పి సాగిస్తున్న ప్రచారం ఆ పార్టీకి నష్టం చేకూర్చేలా వుందన్న వాదనలు కూడా వినిపిస్తున్నాయి. కాంగ్రెస్ పార్టీ నాయకురాలు, వాయినాడ్ ఎంపి. ప్రియాంకగాంధీనుద్దేశించి, బిజేపి నాయకుడు రమేష్ చేసిన వాఖ్యలు దేశ వ్యాప్తంగా పెద్ద దుమారాన్నే రేపాయి. ఎన్నికల దగ్గరపడుతున్న తరుణంలో సాగుతున్న ప్రచారాలపై ఎవరికి తోచినట్లు వారు విశ్లేషణలు చేస్తున్నప్పటికీ మెజార్టీ సర్వేలు ఆప్ వైపే మొగ్గు చూపుతున్నాయి. కాకపోతే నాలుగోసారి ఆప్‌కు అవకాశమిస్తారా? అన్నదే చర్చనీయాంశమౌతుంది. గత ఎన్నికల్లో ఉనికి కూడా లేకుండాపోయిన బిజేపి, కాంగ్రెస్‌లు కనీసం కొన్ని సీట్లైనా సంపాదిస్తాయా? అన్నదే చర్చనీయాంశమౌతోంది. డిల్లీలో కాంగ్రెస్‌పార్టీ ఇస్తున్న గ్యారెంటీలు ఏ మాత్రం ప్రజల్లో విశ్వాసం నింపుతాయన్నది కూడా అనుమానంగానే వుంది. డిల్లీ ఎన్నికల వేళ స్దానిక పరిస్దితులే కాదు, మహా కుంభమేళ ప్రచారం కూడా బిజేపికి కలిసి వస్తుందన్న ఆశలు బిజేపి పెట్టుకున్నది. ప్రపంచమంతా కుంభమేళాను కీర్తిస్తున్న వేళ ఆ ప్రభావం డిల్లీ ఎన్నికల మీద పడుతుందా? అన్న ప్రశ్నలు కూడా వినిపిస్తున్నాయి. అదే జరిగితే ఈసారి డిల్లీలో కూడా కాషాయ జెండా ఎగరడం ఖాయం. డిల్లీ ప్రజలు కుంభమేళాను ఎన్నికలకు ముడిపెట్టి చూడకపోతే మాత్రం ఆప్కే కలిసొస్తుందని అంటున్నారు. అయితే ఇండియా కూటమిలో లుకలుకలు కాంగ్రెస్ మీదనే ఎక్కువ ప్రభావం చూపేలా వున్నాయన్న చర్చ కూడా జోరుగా సాగుతోంది. హర్యానాలో కూడా ఇలాగే కాంగ్రెస్, ఆప్‌ల మధ్య సయోద్య కుదరకపోవడంతో అక్కడ దెబ్బతిన్నారు. కాకపోతే హర్యానలో బిజేపి అదికారంలో వుంది. ఆ పార్టీకి కలిసి వచ్చింది. ఇక్కడ ఆప్ అదికారంలో వుంది. ఎవరికి కలిసొస్తుందన్నదానిపై తర్జనభర్జనలు జరుగుతున్నాయి.